సుప్రీం కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. నచ్చని లీడర్ పోటీలో ఉంటే ఆయనను ఛీకొట్టే అవకాశం కల్పించాలని శుక్రవారం తీర్పు వెలువరించింది. అంటే సదరు అభ్యర్థిని తిరస్కరించే అవకాశం కల్పిస్తూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో రిజక్ట్ బటన్ ఏర్పాటు చేయాలని ఈ తీర్పు సారాంశం. దీంతో ఓటర్లకు మంచి అవకాశమే కాకుండా దుర్మార్గులు, దుష్టులు పోటీచేసేందుకు కూడా భయపడతారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాని ఇది ఎంతవరకు అమలవుతుందన్నది అసలు సమస్య. సుప్రీం చెప్పిందంతా చట్టం కాదు, చట్టం చేసే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. ఇప్పటికే రిమాండ్ ఖైదీలు, నిందితులు పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం తీర్పు ఇస్తే ఏమయింది, వారికి పోటీ చేసే అవకాశంతో పాటు, చట్టసభలకు హాజరై అభిప్రాయాలు చెప్పే అవకాశాన్ని కూడా కల్పిస్తూ రాష్ట్రపతి ఆర్డినెన్స్ తాజాగా జారీ చేసాడు. అందుకే ఇది కూడా అంతే అని పెదవి విరుస్తున్నారు అంతటా.
Friday, 27 September 2013
సంచలన తీర్పు : లీడర్ ను ఓటర్ ఛీకొట్టే అవకాsham

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment