Sunday, 29 September 2013

Courier Boy Kalyan Latest Trailer


మళ్లీ మెగా హీరోతో పెట్టుకున్నాడు!


నోరు తెచ్చినన్ని తంటాలు మరేదీ తెచ్చిపెట్టదు మనిషికి. అందుకే దాన్ని కంట్రోల్ చేయాలి. లేదంటే మనల్ని నట్టేట్లో ముంచేస్తుంది. దానికో తాజా ఉదాహరణ పూరీ జగన్నాథ్. పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చిన స్టేట్ మెంట్లిచ్చి బుర్ర బొప్పి కట్టించుకున్నాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసేవాడు కాస్తా నితిన్, విష్ణు లాంటి వాళ్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా బుద్ధి రాలేదు మనోడికి. ఇప్పుడు మరోసారి టంగ్ స్లిప్పయ్యాడు. అది కూడా మెగా హీరో గురించే! తన పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఓ తెలుగు పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు పూరీ. అప్పుడు ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తెరకు పరిచయం చేసినందుకు తాను చాలా ఫీలవుతున్నానని అన్నాడు. అలా ఎందుకంటే... ఆ సమయంలో అతడికి సల్మాన్ ఖాన్ 'వాంటెడ్' సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చాడట. కానీ తాను చిరుత సినిమా కమిట్ అయి ఉండటం వల్ల ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడట. ఆ చాన్స్ మిస్ చేసుకోవడం నా బ్యాడ్ లక్ అంటూ ఇప్పుడు నిట్టూర్చాడు. అంతేనా, తాను ఆ త్యాగం చేసి చిరుతను తీయడం రామ్ చరణ్ అదృష్టం అని అర్థం వచ్చేలా కూడా మాట్లాడాడు. గతంలో కూడా ఇలాగే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడాడు. పవన్ తో పని చేయడం తనకు ఆనందాన్ని ఇవ్వలేదని, ఇంకెప్పుడూ అతడితో కలిసి పని చేయనని చాలా అతి చేశాడు. కట్ చేస్తే ఎక్కడికో పోయి పడ్డాడు. ఇప్పుడు మళ్లీ తన నోటి దూలను ఇలా ప్రదర్శించాడు. ఈసారి ఎక్కకెళ్లి పడతాడో చూడాలి. కాస్త నోరు అదుపు చేసుకో పూరీ. లేదంటే ఇండస్ట్రీలో నీకు త్వరలోనే నూకలు చెల్లిపోయే ప్రమాదం ఉంది!

పవన్ పేరుపై నితిన్ సెటైర్...!


పవనిజం క్రేజ్ తో అత్తారింటికి దారేది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది రూపాయలను కొల్లగొడుతూ సంచలనం సృష్టిస్తూ ఉంటే, ఈ ఆనందాల మధ్య పవన్ కళ్యాణ్ వీరాభిమాని నితిన్ తన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసుకున్నాడు. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. పవన్ పాటలను, మాటలను వాడుకొనే నితిన్ ఈ సినిమాలో హీరో పాత్రకు ఏకంగా కళ్యాణ్ పేరునే పెట్టేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరో స్నేహితులు మాత్రం కళ్యాణ్ పాత్రలో ఉన్న నితిన్ ను ‘PK’ అని పిలుస్తూ ఉంటారట. అయితే దీనిఅర్ధం పవన్ కళ్యాణ్ అని మాత్రం కాదు, ఆ సినిమాలో హీరో కళ్యాణ్ కు ఏ పని పాటా లేకుండా ఉంటాడు కాబట్టి ‘పని లేని కళ్యాణ్’ అని అర్ధం అట. కళ్యాణ్ పేరును పనిలేని కళ్యాణ్ గా పిలిపించుకోవడం సాహసమే అయినా నితిన్ పవన్ కు ఎంత వీరభిమానో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ తెలుసు కాబట్టి ఆ సినిమాలో కళ్యాణ్ ను పనిలేని కళ్యాణ్ గా పిలిచినా పవన అభిమానులకు కోపం రాకపోవచ్చు. బహుశా ఆ ధైర్యం తోనే నితిన్ ఈ సాహసం చేస్తున్నాడు అనుకోవాలి. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న ఈ సినిమా లో నితిన్ సరసన యామీ గౌతమ్ నటిస్తోందన్న విషయం తెలిసిందే. ‘గుండెజారి గల్లంతైందే’ సూపర్ హిట్ తరువాత నితిన్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నవంబర్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలను నితిన్ సాధిస్తాడో లేదో చూడాలి.

సీపీఎంకు జగన్ 70 కోట్ల పార్టీ ఫండ్!


దేశంలోని అన్ని రాజకీయ పార్టీలూపార్టీ ఫండ్ తీసుకోవడం చాల కామన్ అంటూ ఈ మధ్య కమ్యూనిస్టుపార్టీలెప్పుడో క్లాసులిచ్చినట్టు గుర్తు. అయితే ఇప్పుడు వారు వేరే పార్టీ అధినేతల దగ్గర నుంచి కూడా పార్టీ ఫండ్ లు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నుంచి సీపీఎం 70 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీని లైన్ లో పెట్టుకొనే ప్రయత్నంలో జగన్ రెడ్డి ఈ వల విసిరినట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులూ కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబు వెనుక ఉండేవి. అయితే ఇప్పుడు బాబు బీజేపీ వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టుపార్టీలు కూడా తమ దారి తాము చూసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే జగన్ తో స్నేహానికి వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో జగన్ సీపీఎంకు పార్టీ ఫండ్ ఇచ్చాడన్నాడు అన్న ప్రచారానికి మరింత ఊపువస్తోంది. మొత్తానికి ఒక రాజకీయ పార్టీకి మరో రాజకీయ పార్టీ అధినేత పార్టీ ఫండ్ ఇచ్చాడు అంటే అది కాస్త వింత అయిన విషయమే!