Saturday, 19 October 2013

దిల్ రాజ్ కు క్లాస్ పీకిన జూనియర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిల్ రాజ్ ను తన ఇంటికి పిలిచి క్లాస్ తీసుకున్నట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో దిల్ రాజ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘బృందావనం’ సినిమా నిర్మాణ సమయంలోనే వీరిద్దరి మధ్యా బేధాభిప్రయాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనికి కారణం ఆ చిత్రం షూటింగ్‌లో ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తన పారితోషికాన్ని 9 కోట్లు వరకు దిల్ రాజ్ నుండి ముక్కుపిండి మరీ వసూలు చేశాడని దిల్‌రాజు తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ దెబ్బతో ఇకపై దిల్ రాజ్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేయకూడదు అని అనుకుంటున్నాడు అంటూ రకరకాల కధనాలు చక్కర్లు కొట్టాయి. కానీ ఏమి జరిగిందో తెలియదు కాని అదే దిల్ రాజ్ జూనియర్ తో ‘రామయ్య’ ను తీసాడు. అయితే తను తీసిన 'రామయ్యా వస్తావయ్యా' పెద్దగా సక్సెస్‌ కాకపోయేసరికి దిల్ రాజ్ చాల షాక్ అయ్యాడట. అంతేకాదు రామయ్య సినిమా పై మీడియా అంత విపరీతంగా నెగెటివ్‌గా ఎందుకు రాసింది అని అడిగాడట జూనియర్ ఎన్టీఆర్.

 అంతేకాదు మీరు గతంలో మీడియాతో మీరు ఎందుకు గొడవ పెట్టుకున్నారు అని జూనియర్ దిల్ రాజ్ ను ప్రశ్నించాడట. ఈ విషయాన్ని దిల్‌ రాజు ఘాటుగా తీసుకుని తన పై ఎవరో ఎన్‌టిఆర్‌కు లేనిపోని విషయాలు నూరిపోస్తున్నారు అంటూ దిల్ రాజ్ తన సన్నీహితుల దగ్గర బాధ పడుతున్నాడట. ఇదే సందర్భంలో దిల్ రాజ్ జూనియర్ తో సినిమాలో సరుకుంటే చూస్తారు లేకుంటే లేదు సినిమా ఫెయిల్ అవ్వడానికి తాను ఒక్కడినే కారణం కాదు కదా అని చురక అంటించేసరికి మన జూనియర్ మైండ్ బ్లాంక్ అయింది అని అంటున్నారు. రామయ్య సినిమా విడుదల అయి పదిరోజులు గడిచి పోతున్నా ఆ చేదుజ్ఞాపకాలను ఎన్టీఆర్ ఇంకా మరిచి పోనట్లే కనిపిస్తోం ది...

న‌న్ను క‌ల‌వొద్దూ, మాట్లాడొద్దు, రావొద్దు :అక్కినేని నాగేశ్వర‌రావు


అక్కినేని నాగేశ్వర‌రావు చాలా కాలం తరువాత మీడియా ముందుకు వ‌చ్చాడు. ఇది పూర్తిగా త‌న వ్యక్తిగత మీటింగ్ అని చెప్పాడు. నాగేశ్వర్వరరావు ప్రస్తుతం మ‌నం మూవీ షూటింగ్‌లో బిజిబిజిగా గుడుపుతూ కొడుకు,మ‌న‌వుడితో క‌లిసి న‌ట‌న‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అక్కినేని మూడు త‌ర‌వాల న‌టులు క‌లిసి ఒకే తెర‌పై క‌నిపించ‌డం అనేది టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఇదిలా ఉంటే నాగేశ్వర‌రావుకి క్యాన్సర్ క‌ణాలు ఉన్నట్టు గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ నిపుణులు గుర్తించారు. ఈ విష‌యం టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కూ తెలిసింది. దీంతో నాగేశ్వర‌రావు ఆరోగ్యంపై ర‌క‌ర‌కాలు వార్తలు చ‌క్కెర్లు కొడుతున్నాయి. వీట‌న్నింటికి స‌మాధానంగా అంద‌రికి ఈ విష‌యాన్ని స్పష్టంగా తెలియ‌జేయాల్సి అవ‌స‌రం త‌న‌కు ఉంద‌ని నాగేశ్వర‌రావు మీడియా మీటింగ్ పెట్టి, అభిమానుల‌కు త‌న ఆరోగ్య స‌మాచారాన్ని తెలియ‌ప‌రిచాడు.

 'క్యాన్సర్ క‌ణాలు ఉన్నాయి అనేది నిజ‌మే కాని, మ‌నో నిబ్బరంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నంత కాలం నాకు ఏమి కాదు అని డాక్టర్లు చెప్పారు. మీరు కూడ ఏ మాత్రం చింతించ‌కుండా ఉండండి.మీరు నా కోసం చేయాల్సింది ఒక్కటే. న‌న్ను ఎవ‌రూ క‌ల‌వాటానికి కాని, మాట్లాడ‌టానికి కాని, ఎక్కడిఎక్కడి నుండో ఇక్కడ‌కు రావ‌ద్దు. నా గురించిన స‌మాచారాన్ని తెలియ‌ప‌ర‌చటానికి ప్రతి నిముషం మీడియా ద్వార అందుబాటులో ఉంటాను. మీరు సంతోషంగా ఉండి, నేనే ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకోండి, ఖ‌చ్ఛితంగా నేను 94 ఏళ్ళ వ‌ర‌కూ ఉంటాను.' అని మ‌రికొద్ది నిముషాలు మాట్లాడాడు.

Nageswara Rao Family Press Meet


మోహన్ బాబు ఇమేజ్ ని దెబ్బతీస్తున్న మనోజ్ ..


మంచు వారి కుటుంబ హీరో మంచు మనోజ్ కు రకరకాల ప్రయోగాలూ చేసి తన తండ్రి లాగే పేరు తెచ్చుకోవాలని కోరిక. దీనికోసం రకరకాల ప్రయోగాలూ చేస్తూ ఉంటాడు మనోజ్. మోహన్ బాబు కెరియర్ లో క్లాసిక్ సినిమా గా మిగిలిపోయిన ‘పెదరాయుడు’ సినిమాను S/O ‘పెదరాయుడు’ గా మంచు మనోజ్ సీక్వెల్ చేస్తాడు అనే వార్త చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.

 కామెడి పాత్రలుచేస్తూ బాగా ఫైట్స్ చేస్తాడు అని పేరున్న మనోజ్ నిడిన విగ్రహం తో కండువా, పంచే తో అందరి మనస్సులలో నిండిపోయిన పెదరాయుడు పాత్రను చేయడం సాహసం. సాగర్ పసల అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట. పూర్తి కామెడి ఎంటర్ టైనర్ గా ఈసినిమాను పూర్తిగా అమెరికాలో నిర్మిస్తారట. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు హీరోయిన్స్ స్కిన్ షోస్ కు మారుపేరు గా ఉండే మనోజ్ సినిమాలు ఉంటాయని తెలిసిన విషయమే. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ‘పెదరాయుడు’ పాత్రను మనోజ్ ఎందుకు కామెడి చేస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

మీడియా మీట్ లో అక్కినేని చెప్పిన సంచలన వార్త..!!


నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన ఆరోగ్యానికి సంబంధించి ఒక ముఖ్య విషయం ఈ రోజు ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు తెలియ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు అక్టోబర్ 8న కడుపు నొప్పి వచ్చిందనీ దానికి, డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేసిన అనంతరం క్యాన్సర్ కణాలు ఉన్నట్లు గుర్తించారని అక్కినేని చెప్పినట్లుగా వార్తలు వినపడుతున్నాయి.

 అయితే వృద్ధాప్యంలో క్యాన్సర్ కణాలు చురుకుగా ఉండవని వైద్యులు చెప్పారట. తను నటించిన సినిమాల్లో చూపినట్లు ఇదేమీ భయంకరమైన జబ్బు కాదు అని అంటూ ప్రపంచంలో క్యాన్సర్‌ను జయించిన వాళ్లు చాలా మంది ఉన్నారు అని అక్కినేని అన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను ఎక్కువ కాలం బ్రతకాలంటే మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు బాధపడకుండా తనను ఈ విషయమై తరచి తరచి అడిగి ఇబ్బంది పెట్టకుండా తనతో ఎప్పటిలాగే నవ్వుతూ పలకరించాలని కోరుకుంటున్నానని అక్కినేని అన్నారట.

 తన ఆరోగ్యం గురించి ఎవరో ఎదో గాలి వార్తలు రాయకుండా తన పరిస్థితి తానే మీడియా ద్వారా తెలియచేయ కలిగిన మనో నిబ్బరం ఒక్క అక్కినేని లాంటి వారికే చెల్లుతుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో బిరుదులూ బహుమానాలు గౌరవాలు పొందిన అక్కినేని ఈ అనారోగ్యాన్ని కూడా ఎదిరించి నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు హృదయం మనసారా కోరుకుంటోంది.