Saturday, 31 May 2014

ఏపి కొత్త రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే?


ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయవాడ-గుంటూరుకు సమీపంలోని నాగార్జున యూనివర్సిటీ నుంచే తన అధికారిక కార్యకలాపాలను కొనసాగించే అవకాశం ఉంది. రాజధాని ఏర్పాటు పనులను ఇక్కడ్నుంచే పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా విజయవాడ-గుంటూరులను అభివృద్ధి చేస్తామని ఇటీవల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా చెప్పడం గమనార్హం. అయితే ఒంగోలు-ఏలూరు మధ్యలో కూడా కొత్త రాజధాని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్నే రాజధానిగా ఏర్పాటు చేసే అవకాశం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున తమ పార్టీ నేతల కోరిక మేరకు విజయవాడ-గుంటూరు జిల్లాల మధ్యనే కొత్త రాజధానిని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రాంతంలో అన్ని రకాలుగా అనువుగా ఉండటంతో రాజధానిని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధానిపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిని విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల క్రితం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో గుంటూరు-విజయవాడల మధ్యనే కొత్త రాజధానిని నిర్మించాలని వారు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడుకు కూడా ఇక్కడే రాజధానిని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానిని ముందే ప్రకటిస్తే పలువురు వ్యాపారవేత్తలు, సంపన్నులు ఆ ప్రదేశంలోని భూములను భారీగా కొనుగోలు చేస్తారని, అది ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

NEWS UPDATES: దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!

NEWS UPDATES: దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!: హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌‌కు కోర్టు తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆయనకు యలమంచిలి కోర్టు నాన్ బెయ...

దర్శకుడు రాజమౌళి తండ్రి అరెస్టుకు రంగం సిద్దం!


హైదరాబాద్: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌‌కు కోర్టు తిప్పలు తప్పడం లేదు. తాజాగా ఆయనకు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తునప్నాయి. ‘నరసింహుడు' కథ ఇస్తానని చెప్పి నిర్మాత చెంగల వెంకట్రావ్‌ వద్ద భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారు. సమయానికి కథ అందించక పోవడంతో పారితోషికాన్ని తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే బకాయి పడ్డ డబ్బు చెల్లింపు కోసం ఇచ్చిన చెక్‌ బౌన్స్ కావడంతో యలమంచిలి కోర్టులో నిర్మాత వెంకట్రావ్‌ కేసు దాఖలు చేశారు. దీంతో విజయేంద్ర ప్రసాద్‌కు యలమంచిలి కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది.