Sunday, 22 March 2015

సమంత,ఎమీ జాక్సన్ హీరోయిన్స్ గా...


చెన్నై : సమంత,ఎమి జాక్సన్ ఇద్దరూ టాప్ హీరోయిన్స్. వీరిద్దరూ ఒకే సినిమాల్లో ఉంటే ఇంక చెప్పేదేముంది..ప్రేక్షకులకు పండుగే. అలాంటిదే ఇప్పుడు జరగబోతోంది. అదీ ఆశామాషీ కాంబినేషన్ లో కాదు. పూర్తి వివరాల్లోకి వెళితే... 'షమితాబ్‌', 'అనేగన్‌' (అనేకుడు)చిత్రాలతో భారత సినీ జనాలను ఆకట్టుకుంటున్న నటుడు ధనుష్‌. అంతకుముందు వేల్‌రాజ్‌ దర్శకత్వంలో విడుదలైన 'వేలై ఇల్లా పట్టదారి' (తెలుగులో రఘువరన్ ఎంటెక్) వసూళ్ల వర్షం కురిపించింది. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. ఇప్పుడు మళ్లీ ఇదే జట్టు మరో చిత్రానికి శ్రీకారం చుట్టింది. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఇందులో ఎమీజాక్సన్‌, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సునంద మృతి కేసు: పాక్ జర్నలిస్ట్ తరర్‌ను ఎలా ప్రశ్నిస్తారు?


న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరర్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఆమెను ఎలా ప్రశ్నించాలనే విషయమై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆమె పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు కావడంతో ఆమెకు సమన్లు ఇవ్వడం కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని. మెహర్ తరర్ విచారణ కోసం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమైతే పెద్ద సమస్య పోతుంది. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను విచారించేందుకు పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే, సునంద పుష్కర్ మృతి కేసులో దర్యాఫ్తు బృందానికి తాను సహకరిస్తానని ఆమె చెప్పారు. వారు పాక్‌కు వస్తే విచారించుకోవచ్చునని గతంలో చెప్పారు. ఈ కేసులో ఆమె కీలకమైన సాక్షి. అయినప్పటికీ ఆమె విచారణ కోసం భారత్ వస్తారా లేదా అనేది ఇంకా అనుమానమే.