Wednesday, 17 July 2019
Tuesday, 28 April 2015
ఐఐటి జెఇఇ మెయిన్స్‌లో తెలుగు పిల్లల తడాఖా
హైదరాబాద్: ఐఐటి జెఇఇ మెయిన్స్ పరీక్షల్లో ఎప్పటిలాగే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. సోమవారం సాయంత్రం సిబిఎస్‌ఇ జెఇఇ మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 80వేల మంది మెయిన్స్‌కు హాజరుకాగా, 20 వేలమంది వరకూ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్టు తెలుస్తోంది. అయితే, పూర్తి లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. 360 మార్కులకు జరిగిన మెయిన్స్ పరీక్షలో టాపర్‌కు 335 మార్కులు రాగా, అడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపికైన చిట్టచివరి అభ్యర్ధికి 105 మార్కులు వచ్చాయి. అంటే 105 మార్కులు దాటివచ్చిన వారంతా అడ్వాన్స్‌కు ఎంపికయ్యారు. ఈసారి ఓబిసి కటాఫ్ మార్కులు 70కాగా, ఎస్సీ కటాఫ్ మార్కులు 50, ఎస్టీ కటాఫ్ మార్కులు 44గా నిర్ణయించినట్టు సిబిఎస్‌ఇ చెప్పింది. జెఇఇ మార్కులకు 60శాతం వెయిటేజీ, ఇంటర్ మార్కులకు 40శాతం వెయిటేజీ కలిపి తుది ర్యాంకులను ప్రకటిస్తారు.
ఈసారి జెఇఇ మెయిన్స్‌కు 13 లక్షలమంది హాజరుకాగా, అందులో కేవలం లక్షన్నర మంది మాత్రమే అడ్వాన్స్‌కు ఎంపిక చేస్తున్నారు. జనరల్ పిడబ్ల్యుడి కోటా కలిపి 75,750 మంది, ఓబిసి 40,500, ఎస్సీ 22500, ఎస్టీ 11250 మంది ఎంపికయ్యారు. ఇందులో జనరల్ 73,478 మంది మాత్రమే. అన్ని క్యాటగిరిల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 20వేల మందికి పైగానే ఉన్నారు. అడ్వాన్స్ పరీక్షకు మే 2 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. పరీక్ష మే 24న జరుగుతుంది. జూన్ 18న తుది ఫలితాలు ప్రకటించే వీలుంది. జూన్ 3న ఒఆర్‌ఆర్ కాపీలను నెట్‌లో అందుబాటులో ఉంచుతారు. జూన్ 8న తొలి కీ ప్రకటించి, దానిపై 8 నుండి 11 వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తారు. అభ్యంతరాల ఆధారంగా 13న తుది కీ ప్రకటిస్తారు. దానికి అనుగుణంగా జూన్ 18న ఫలితాలిస్తారు. జూలై 1న తొలి రౌండ్ సీట్ల పంపిణీ జరుగుతుంది.
Sunday, 19 April 2015
జస్ట్ ...‘ఓకే’ బంగారం(రివ్యూ)
అతి కొద్ది మంది దర్శకుల చిత్రాలకు మాత్రమే ...హీరోలతో సంభందం లేకుండా థియోటర్లు హౌస్ ఫుల్ అయ్యే మార్కెట్ ఉంది. అటువంటివారిలో ముందు వరసలో ఉన్న దర్శకుడు మణిరత్నం. ఆయన డబ్బింగ్ చిత్రాలు తెలుగులో చాలా సార్లు స్టైయిట్ చిత్రాలుకు పోటీ ఇచ్చాయి. అయితే ఆయన గత సంవత్సరాలుగా విజయం అనే మాటకు దూరంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ సినిమాలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా 'కడలి' చిత్రం ఆయన వీరాభిమానులను సైతం భయపట్టేసింది. ఈ నేపధ్యంలో ఆయన మళ్లీ 'సఖి' రోజులను గుర్తు చేసేలా ఓ లవ్ స్టోరీని ఎత్తుకుని...దానికి తగ్గట్లు తన దైన శైలిలో ప్రోమోలు,పోస్టర్స్ క్రియేట్ చేసి 'ఓకే బంగారం' అంటూ ఆశలు రేకిత్తించి థియోటర్ కు వచ్చేలా చేసారు.
అంతేకాదు ఈ తరం నమ్ముతూ నిరంతంర చర్చకు నిలుస్తున్న లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనే పాయింట్ ని టచ్ చేసి,దాని చుట్టూ కథని అల్లారు. అయితే ఈ రొమాంటిక్ మూవిలో హీరో,హీరోయిన్స్ రిలేషన్ కు సమస్య వచ్చేసరికే... సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. ఆ సమస్యను కూడా తేలిగ్గా...సినిమాటెక్ గా రొటీన్ గా ముగించేయటం కొద్దిగా నిరాసపరుస్తుంది. ముఖ్యంగా చాలా ప్రెడిక్టుబుల్ గా కథనం నడుస్తుంది. ఫస్టాఫ్.. నత్తనడకతో ప్రారభైమైనా రొమాన్స్ తో బాగుంటుంది అదే ...సెకండాఫ్ కు వచ్చేసరికి ఇంకా స్లోగా నడుస్తూ..క్లైమాక్స్ కు వచ్చేసరికి ముగించాలి కాబట్టి ఓ ముగింపుని ఉన్నంతలో వెతికేసి అతికేసినట్లు అనిపిస్తుంది. అయితే అద్బుతమైన పాటల చిత్రీకరణ, లీడ్ పెయిర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ...మణిరత్నం మాత్రమే చేయగలరని మరోసారి అర్దమవుతుంది. స్క్రిప్టు మరింత పగడ్బందీగా ఉంటే...ఓ సెమీ క్లాసిక్ అయ్యే అవకాసం ఉండేది ఖచ్చితంగా. ముంబైలో కార్పోరేట్ సంస్ధలలో పనిచేస్తున్న ఆది (దుల్కర్ సల్మాన్),తార(నిత్యామీనన్) పోష్ లైఫ్ ని గడుపుతూంటారు. పెళ్లనే కాన్సెప్ట్ ని నమ్మని వీళ్లిద్దరూ ...అనుకోని పరిస్ధితుల్లో పరిచయమై...ఆ స్నేహం అనతికాలంలోనే ఏకాభిప్రాయాలతో బలపడి...సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్ షిప్)గా రూపాంతరం చెందుతుంది. అయితే తమ భవిష్యత్ కోసం వీరిద్దరూ వేరు వేరు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ నేపధ్యంలో వీరు తమ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తారా..లేక దాన్ని పెళ్లితో బలపరుచుకుంటారా అనేది కథలో కీలకాంశం.
మెగాస్టార్ ను 'మా' విజేతలు కలిసిన వేళ...(ఫొటోలు)






హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు నటకిరీటి రాజేంద్రప్రసాద్ శనివారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన గెలుపుకు కారణమైన మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలియజేశారు.
చిరంజీవి మాట్లాడుతూ.... రాజేంద్రప్రసాద్ గెలుపు తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మా నూతన కార్యవర్గ సభ్యులందరూ సినీ కార్మికులు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ ప్యానల్ సభ్యులను చిరంజీవి సన్మానించారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నటి జయసుధపై ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శుక్రవారం హైదరాబాద్‌లోని చలన చిత్ర వాణిజ్య మండలిలో ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు రౌండ్లుగా ఓట్లని లెక్కించారు. ప్రతీ రౌండ్‌లోనూ రాజేంద్రప్రసాద్ ఆధిక్యం ప్రదర్శిస్తూ విజయ దుందుభి మోగించారు.
హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై ఉచిత వైఫై పొందడం ఎలా?
మధ్యదరా సముద్రంలో పడవ మునక: 700 మంది గల్లంతు
మధ్యధరా సముద్రంలో వలసకూలీలతో ప్రయాణిస్తున్న ఓ నౌక మునిగిపోయింది. అందులో దాదాపు ఏడువందల మంది కూలీలు ఉన్నారని సమాచారం. ఈ నౌక మునిగిపోవడంతో వారందరూ గల్లంతయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వలస కూలీలను కాపాడేందుకు లిబియా జలాలలోని లాంపడూస తీరానికి 130 మైళ్ల దూరంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇటలీకి చెందిన నౌకలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇరవై ఎనిమిది మంది కూలీలను కాపాడినట్లుగా తెలుస్తోంది.
కాగా, నౌకలో ఏడువందల మంది కంటే ఎక్కువ మందే ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవలే మధ్యదరా సముద్రంలో నౌక ముక్కలైన విషయం తెలిసిందే. అది జరిగి వారం కాకముందే మరో ప్రమాదం జరగడం గమనార్హం.
Friday, 17 April 2015
పవన్ కళ్యాణ్ కోసం అభిమాని సుదూర సైకిల్ యాత్ర
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు సైకిల్ యాత్ర చేపట్టారు. అతను పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్ పూర్ నుండి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పవన్‌ను కలిసేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు. కాగా, సినిమాల్లో టాప్ స్టార్‌గా ఎదిగిన పవన్ కళ్యాణ్ గత ఏడాది జనసేన పార్టీని స్థాపించి.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీలకు మద్దతు పలికారు. ఆ పార్టీల తరఫున విస్తృత ప్రచారం నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేతల పర్యటన నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల తరఫున నష్ట పరిహారం చెల్లించే వరకు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. కాంగ్రెస్ నేతల్లో డీ శ్రీనివాస్, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నదని వారు చెప్పారు. ఎకరాకు 15వేల నుండి 20వేల వరకు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయాల నుండి 'మా' వరకు: జయసుధకు అంతా రివర్స్!
హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, సికింద్రాబాద్ మాజీ శాసన సభ్యురాలు జయసుధకు 'మా' అధ్యక్ష ఎన్నికలు షాకిచ్చాయి. జయసుధకు ఇటీవలి కాలంలో రాజకీయంగా, తాజాగా 'మా' అంశంలో రివర్స్ అయిందని చెప్పవచ్చు. అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ, అదే రాజకీయాల పైన అసంతృప్తితో దూరం జరిగారు. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ఆమె బలి అయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో జయసుధ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. సికింద్రాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్ హవా ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాంటి సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేశారు. ఇక్కడి నుండి పోటీ అంటే జయసుధ ఓటమిని కొని తెచ్చుకోవడమేనని, స్థానికంగా తలపండిన తలసానితో పోటీ అంటే కష్టమేనని అప్పట్లో భావించారు. కానీ, అనూహ్యంగా చాలామంది అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ ఎన్నికల్లో జయసుధ ఘన విజయం సాధించారు. ఆమె నాలుగు వేల పై చిలుకు ఓట్లతో గెలుపొందారు. నాటి ఆమె గెలుపుకు చాలా కారణాలున్నాయి. అవి ఏమైనప్పటికీ.. చాలామంది అంచనాలు తారుమారు కావడం గమనార్హం. అనంతరం కొద్ది రోజులకే వైయస్ దుర్మరణం చెందారు.ఈ నేపథ్యంలో.. అప్పటి వరకు 'రాజకీయం' అంతగా తెలియని జయసుధ.. ఇటు కాంగ్రెస్, అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు.. ఎటు వెళ్లాలో తెలియక డైలమాలో పడ్డారు. చివరికి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కానీ ఒకవిధంగా ఆమె రాజకీయాల్లో ఇమడలేకపోయారనే చెప్పవచ్చు. జయసుధ రాజకీయాల పైన పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. గ్రూపు రాజకీయాల పట్ల ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. జయసుధ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయరనే ఊహాగానాలు వినిపించాయి. అంతకుముందు.. ఆమె పలుమార్లు రాజకీయాల పైన అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా ఆ ఊహాగానాలకు ఊతం ఇచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఆమె అనూహ్యంగా ఓడిపోయారు. 2009లో ఓడిపోతారనుకున్న జయసుధ గెలిచారు. 2014లో అందుకు విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జయసుధ గెలుస్తారని అందరూ భావించారు. కానీ, కనీసం ఆమె రెండో స్థానంలో కూడా నిలబడలేకపోయారు. తెరాస తరఫున పోటీ చేసిన టీ పద్మారావు గెలుపొందారు. రెండో స్థానంలో టీడీపీ కూన వెంకటేష్ ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన జయసుధ ఘోర ఓటమి చవి చూశారు. తాజాగా, 'మా' ఎన్నికల కోసం ఆమెను హఠాత్తుగా చెన్నై నుండి తీసుకు వచ్చారనే వాదనలు ఉన్నాయి. 'మా' ఎన్నికల్లో పోటీ గురించి ఆమె అసలు ఆలోచించలేకపోయి ఉంటారు. అనుకోనివిధంగా రంగంలోకి దిగి ఉంటారు. అయినప్పటికీ ఆమె గెలుపుపై ప్యానల్ ధీమా వ్యక్తం చేసింది. 6పర్యాయాలు 'మా' అధ్యక్షుడిగా ఉన్న మురళీ మోహన్ అండ, పలువురు బిగ్ షాట్స్ ఆమెకు మద్దతుగా నిలబడిన నేపథ్యంలో ఆమె గెలిస్తుందనుకున్నారు. 'మా' ఎన్నికల పైన కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టుకు వెళ్లిన వారు రాజేంద్ర ప్రసాద్‌కు అనుకూలురని, జయసుధ గెలుస్తుందనే అభిప్రాయంతోనే వారు కోర్టును ఆశ్రయించారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గెలుపు ఖాయమని అందరికీ అనిపించింది. కానీ ఇక్కడ కూడా ఆమె అనూహ్యంగా ఓడిపోయారు. అయితే, ఓటమికి ఆమెను బాధ్యులుగా ఎవరు భావించడం లేదు. 'మా' ఎన్నికల్లో ఆమె ఓడినప్పటికీ.. ఈ ఓటమి ఎంపీ మురళీ మోహన్‌దే తప్ప, జయసుధది కాదని గెలిచిన ప్యానల్ సభ్యులు కూడా అంటున్నారు. రాజేంద్ర ప్రసాద్‌పై జయసుధ పోటీ చేసినప్పటికీ.. ఆమె ఓటమిగా దాదాపు ఎవరు చెప్పడం లేదు.
Subscribe to:
Posts (Atom)