Wednesday, 16 October 2013

Nevalle Nevalle

శ్వేత సౌధంలో ఒబామాతో నీనా దవులూరి భేటీ


వాషింగ్టన్: మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తెలుగు అమ్మాయి నీనా దవులూరి బుధవారంనాడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. ఆమె శ్వేత సౌధంలో ఒబామాతో భేటీ అయ్యారు. మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్న తొలి ఇండియన్ అమెరికన్ నీనా దవులూరి. ఓవల్ కార్యాలయంలో అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మాట్లాడడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని నీనా దవులూరి అన్నారు. ఒబామాతో భేటీ తర్వాత ఆమె ఆ విధంగా ట్వీట్ చేశారు. పిల్లల మిరాకిల్ నెట్‌వర్క్ హాస్పిటల్ చాంపియన్స్ గౌరవార్థం మిస్ అమెరికా అధ్యక్షుడితో గ్రూప్ ఫొటోలో పాల్గొన్నట్లు శ్వేత సౌధం అధికార వర్గాలు చెప్పాయి. గ్రూప్ ఫొటో తర్వాత ఓవల్ కార్యాలయాన్ని సందర్సించినట్లు ఆ వర్గాలు తెలిపారు. ఇటీవల భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నీనా దవులూరి గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం మిస్ అమెరికా ఇండియన్ అమెరికన్ అని ఆయన మన్మోహన్‌తో అన్నారు. సెప్టెంబర్‌లో జరిగిన పోటీల్లో దవులూరి మిస్ అమెరికాగా ఎన్నికయ్యారు. ఈ పోటీల్లో గెలిచిన తర్వాత నీనా దవులూరిపై జాతి వివక్ష వ్యాఖ్యలు వెలువడ్డాయి.

పవన్ ను కలిసిన రామోజీ ?


ప్రస్తుతం ఎక్కడ విన్నాపవన్ పవన్ అత్తారింటి థాంక్స్ గివింగ్ మీట్ లో చేసిన ప్రసంగం గురించి చర్చలే. ఆరోజు జరిగిన ఫంక్షన్ లో పవన్ మాట్లాడుతూ అత్తారిల్లు పైరసీ విషయం చాలా చిన్నదని దానికంటే పెద్ద విషయాలు డీల్ చేయ వలసినవి చాలా ఉన్నాయని వాటికోసం తన అభిమానులను తరుచు కలుస్తాను అనడం వెనుక ఉన్న అర్ధం గురించి చాలా లోతుగా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ పవన్ దృష్టిలో ఉన్న పెద్ద విషయాలు ఏమిటి అన్న విషయం పై చాలా ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. పవన్ రాజకీయప్రవేశానికి సంకేతంగా ఈమాటలు పవన్ వాడడాన్ని అంటున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం లో చాలా ఉత్సాహంగా పనిచేసిన పవన్ ప్రజారాజ్యం ఓడిపోయిన తరువాత రాజకీయాల గురించి పట్టించు కోవడం మానేసినా, పవన్ ఫలానా పార్టీలో చేరబోతున్నాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

 ఈ మధ్య ఈ వార్తలు మరింత ఎక్కువ అయి పోయాయి. దీనికి మరింత బలం చేకూర్చే మరోవార్త ఇప్పుడు మీడియాలో ప్రచారంలో ఉంది. రాష్ట్ర రాజకీయాలలో కింగ్ మేకర్ గా, మీడియా ప్రపంచానికి చక్రవర్తిలా పిలిపించుకొనే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పవన్ ను రెండు సార్లు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ప్రస్తుతరాజకీయాల ఫై వీరిద్దరూ చాల సుదీర్ఘంగా చర్చించు కున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న పవన్ అలాగే తెలుగు మీడియా ప్రపంచంలో చక్రవర్తి లా వెలిగిపోతున్న రామోజీ కలవడం వెనుక ఎదో ఒక రాజకీయ ఉద్దేశ్యం ఉంది అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు నందమూరి తారకరామారావుకు ఆతరువాత చంద్రబాబునాయుడుకు గుండెకాయలా వ్యవహరించిన రామోజీరావు పవన్ ను కలవడం వెనుక ఆంతర్యం తెలుగు దేశం పార్టీ వైపు పవన్ ను మలుచు కోవడానికా లేదంటే మరేదైనా రాజకీయ ఉద్దేశ్యం వీరిద్దరి మధ్యా ఉన్నదా? అనే విషయం పై ఎవరికి తోచిన అభిప్రాయలు వారు వెల్లడిస్తున్నారు. ఎదిఎమైనా త్వరలో పవన్ కళ్యాణ్ నుండి ఒక సంచలన వార్త వచ్చే విధంగా ఆయన మాటలు అర్ధాలు ఇస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు...

"కత్రిన కోసం చచ్చిపోవచ్చు" - రన్బీర్ కపూర్ ...


ఇది పాత మాట … “కత్రిన కోసం చచ్చిపోవచ్చు”, “కత్రిన నా రీల్ హీరోయిన్ “కూడా” అయితే బాగుంటుంది”, “కత్రిన తో నా ప్రయాణం మరువలేనిది” ఈ మాటలు రన్బీర్ బహిరంగం గా అన్నాడు … అదీ కాక, “బికినీలలో ” వీరిరువురు , “హాలిడే ” చేసుకుంటూ , క్యామేరాకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన తరువాత , “అవును మేము ఒకరినొకరం ఇష్టపడుతున్నాం” అని బహిరంగం గా చెప్పుకున్నారు …


 ఇక , త్వరలో వీరిరువురు , పెళ్లి చేసుకుంటున్నారు అన్న వార్తాలు వినిపిస్తోన్న తరుణం లో , “తూచ్ … ఇదంతా ఒత్తి పుకారే ” అని చేబుతారనుకుంటే , వీరిరువురిలో ఎవ్వరు ఈ మాటను తోసిపుచ్చడం లేదు … పైగా , కత్రిన వచ్చే సంవత్సరం జూన్ తరువాత , ఏ సినిమా కమిట్ అవ్వకుండా ఖాళీ గా ఉండటానికి అనువుగా ప్ల్యాన్ చేసుకుందట … ఆశ్చర్యం గా రన్బీర్ కూడా ఇదే సమయం లో ఏ సినిమా ఒప్పుకోలేదట … అదీ కాక , బెంగుళూరు లో ఉన్న , రన్బీర్ కపూర్ ల తాతల నాటి బంగాళా ని , వీరి వివాహానికి “అంగ రంగ వైభవం” గా ముస్తాబు చేస్తున్నారని సమాచారం … అయితే , కత్రిన కుటుంబం ఈ సంబంధానికి యెగిరి గంతేసి ఒప్పుకున్నా , “రన్బీర్ ” తల్లి తండ్రులు , అందునా అమ్మ రీతు కపూర్ కి , రన్బీర్ “కత్రిన ” ని చేసుకోవడం ససేమీరా ఇష్టం లేదట … ఇందుకోసం , అమ్మ ను ఒప్పించడానికి రన్బీర్ నానా తంటాలు పడుతున్నాడట … మరి ఈ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళేనా , లేక సిమ్పల్ గా పెటాకులయ్యేనా తెలియాలంటే కాస్త బ్రేక్ తీసుకోవాల్సిందే

నయన్ తో "పెళ్లి గిళ్ళీ" జాన్తా నై...


ఈ మాట అన్నది ప్రస్తుతానికి, నయనతార మాజీ ప్రియుడు , ప్రభు దేవా కాదు … తమిళ యువ హీరో ఆర్య … ఆర్య , నయనతార హీరో హీరోయిన్లు గా ఒక తమిళ సినిమా షూటింగ్ అవుతున్న సంగతి తెలిసిందే … ఇది, వీరిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా … ఈ క్రమం లో ఆర్య – నయన్ పెళ్లి చేసుకోబోతున్నారని, “పెళ్లి సుభలేఖ” కూడా అచ్చయ్యింది అని “సుభలేఖ” కూడా నెట్ లో పెట్టారు

… దీని మీద ఆర్య గొప్ప సీరియస్ అయ్యాడు లెండి … “నయనతార , నేను మంచి స్నేహితులం , సహ నటులం… ఇంతకు మించి మా మధ్య ఇంక బంధం లేదు … మా “పెళ్లి” గురించి వచ్చే పుకార్లు కేవలం “ఎవరో పనిలేనివారు ” సృష్టించిన నిరాధారమైన మాటలు … నయనతార పరిణతి ఉన్న వ్యక్తిత్వం ఉన్న మనిషి , నాకు తానంటే అభిమానం తప్ప ఇంక ఏమి లేదు”… “ఈ “సుభలేఖ” కూడా చిత్రం లో షూటింగ్ కోసం అచ్చు వేయించినదే ” అని స్పష్టం చేసాడు , ఆర్య … ఒక వైపు ప్రేమ లేదు అంటూనే , మరో వైపు “నయనతార ను పొగడ్తలతో ముంచెత్తడం ” వెనుక అర్ధం ఏంటి ఆర్య గారు ???

"శ్రీ హరి" మరణానికి "అదే" కారణం ???


తెలుగు సినీ పరిశ్రమ లో నే ” అత్యంత పేరు గల నటుడు … ఒక విలన్ గా , హీరో గా, ఎన్నో సినిమాల్లో అతి ముఖ్యమైన పాత్రలు పోషించి , ఆ సినిమాల విజయానికి ప్రాణం పోసిన విలక్షణ నటుడు , శ్రీ హరి మరణానికి “అదే” కారణం అని తేల్చి చెప్పారు, ఆయనని పరీక్షించి , వైద్యం చేసి , ఆయన తుది శ్వాస విడిచే వరకు ఆయన తో ఉన్న వైద్యులు … అవును , “అది” అంటే , “నిర్లక్ష్యం”… తన ఆరోగ్యం బాగోలేకపోయినా , “ఒప్పుకున్న షూటింగ్ తన వల్ల ఆగకూడదని శ్రీ హరి ,

 బలవంతంగా షూటింగ్ చెయ్యడం , తన ఆరోగ్యం నిర్లక్ష్యం చెయ్యడం వల్లనే , ఆయన ఈ రోజు మన మధ్య లేడని “వైద్యులు స్పష్టం చేసారు “… “శ్రీ హరి , కాలేయ సంభందీత వ్యాధి తో మృతి చెందారని , ముందు చెప్పిన వైద్యులు , తరువాత , అది కాలేయం వరకు చేరిన “పచ్చకామేర్లని ” … ముందుగానే , శ్రీ హరి గారికి తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించినా , వారించి , తాను చేస్తున్న హిందీ చిత్రం , ప్రభు దేవా దర్శకత్వం లో వస్తోన్న “ర్యాంబో రాజకుమార్” షూటింగ్ లో పాల్గొన్నారని , షూటింగ్ స్పాట్ లో నలతగా ఉంది అని చాలా సార్లు కంప్లెయింట్ చేసారని , చాతీ నొప్పిగా ఉందని కూడా అన్నారని , తన ఆరోగ్య పరిస్థితి క్షీణించిన సమయాన , ముంబై లోని పేరున్న లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేసారు … కాని అప్పటికే , ఆయన ఆరోగ్య పరిస్థితి చేదాటి పోయింది … ఇక , తిరిగిరాని లోకాలకు ఆయన చేరుకున్నారు “… తన వ్రుత్తి పట్ల శ్రీ హరి కి ఉన్న డెడికేషన్ , నటన లో భాగం గా , ఎన్నో క్లిష్టమైన సన్నివేశాలలో డూప్ లేకుండా శ్రీ హరి నటించడం ,


ఆరోగ్యం బాగోలేకపోయినా ఎన్నో సార్లు తన ఆరోగ్యాన్ని లెక్క చెయ్యకుండా , కమిట్మెంట్ ఇచ్చిన సమయానికి షూటింగ్ పూర్తీ చెయ్యాలన్న సంకల్పం తో శ్రీ హరి షూటింగ్ లలో పాల్గొనడం అందరికీ తెలిసిందే … ఇది ఎందరో నటీనటులకు ఆదర్శం … అయితే , ఈ క్రమం లో తన ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, “నిర్లక్ష్యం” చెయ్యడం, శ్రీ హరి ప్రానాలని హరించిందని చెప్పారు … ఈ సంఘటన , “ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ” అందరికీ వివరించడం తో పాటు , ఆర్టిస్టు గా శ్రీ హరి డెడికేషన్ కు మరోసారి సలాం చేసేలా చేస్తుంది …

"దిల్" ఉన్న వారిని "తిట్టి తిట్టి" పోసిన పవన్


“అత్తారింటికి దారేది” విజయాన్ని పురస్కరించుకుని నిన్న శిల్ప కళా వేదిక లో థ్యాంక్స్ గివింగ్ వేడుక జరిగిందా … మన పవర్ స్టార్ హాజరు అయ్యారా … “ఎప్పుడు” మాట్లాడటానికి కాస్త మొహమాటపడే పవన్ … దిమ్మ తిరిగిపోయేలా మాట్లాడారు”… “ఈ చిత్రం విడుదలకి ముందే పైరసీ కి గురి కావడం … “కొంతమంది ” పరిశ్రమ లో పెద్ద మనుషులు గా చెలామణీ అయ్యే వారి కుట్ర … అతి త్వరలో “వీళ్ళందరి ” గుట్టు బయట పెడతా … యెంత కుట్ర పన్నినా , “సినిమా” ని దేబ్బతీయ్యాలని ఎంతగా ప్రయత్నించినా , మేము నిజాయతీగా చేసిన కష్టం తప్పకుండా ఫలించింది , “ఎవ్వరు యెంత “పన్నాగాలు” పన్నినా చిత్ర విజయాన్ని ఆపలేకపోయారు … ఎప్పుడు నా సినిమాలు “పంపిణీ” చేసే కొందరు పేరున్న “నిర్మాతలు”, ఈ సినిమా పంపిణీ కి ఆసక్తి చూబించకపోవడం , “వారు నిర్మించిన సినిమా కి నా సినిమా పోటీ వస్తుంది అన్న భావన తో ఇదంతా చేసారని నా “నమ్మకం” కాదు , అసలు మాట … ఇది త్వరలోనే తేలుస్తా , అసలు మ్యాటర్ ఏంటో తేలుస్తా … జై హింద్ “… ఇది పవన్ మాటల సారాంశం … ఇక ఈ “తిట్ల వర్షం … వార్నింగ్ లు … బెదిరింపులు … ఎవరి కోసమో మీకు తెలుసు గా … ” ఇక ఇలా ఇండైరెక్ట్ గా కాక , డైరెక్ట్ గా వార్ టూ సైడ్ అయితే , పరిశ్రమ రెండు గా చీలిపోయే రోజు దూరం లో లేదని సినీ పండితులు కోడై కూస్తున్నారు “

పవన్ కళ్యాణ్ వార్నింగుతో...డొంక కదులుతోంది!


పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దల గురించి మాట్లాడింది అక్షరసత్యమని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. పవన్ కళ్యాణ్ నిజాయితీగా తన మనసులోని మాట బయట పెట్టాడని.....పవన్ కళ్యాణ్‌కు సపోర్టివ్‌గా మాట్లాడారు చదలవాడ. మరి ఆ పెద్దలు ఎవరు? అనేది మాత్రం చదలవాడ బయటకు వెల్లడించలేదు. ‘అత్తారింటికి దారేది' చిత్రం లీక్ వెనక ఉన్న పెద్దల భాగోతాన్ని బయట పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మన సినిమా ఆడకున్నా ఫర్వాలేదు...పక్కోడు సినిమా సర్వనాశనం అయిపోవాలి అనే స్వార్థం, అసూయతో ఇలాంటి చర్యలకు పాల్పడి వారికి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట.

బాబోయ్ పవన్ కళ్యాణ్


బాబోయ్ పవన్ కళ్యాణ్... గత మూడు రెండు రోజులుగా రాష్ట్రం అంతటా వినిపిస్తున్న మాట. సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోను ఏ నోట విన్నా ఇదే మాట. దీంతో పవర్ స్టార్ పవర్ అదిరింది అంటున్నారు సాధారణ జనం కూడా. సినిమా హిట్టయితే కృతజ్ఞతలు తెలిపేందుకు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడితేనే ఇంత హల్ చల్ సృష్టిస్తే ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చి జనంలో తిరిగితే ఏమైనా ఉందా.. అయ్య బాబోయ్ అందరి బాక్స్ లు బద్దలవుతాయేమో అంటున్నారు. పైరసీ గూర్చి, తన జీవితం గూర్చి నాలుగు మాటలు చెప్పి, పైరసీ వారి భరతం పడతాను అన్నందుకు రెండు రోజులుగా ఎన్ని యాంగిల్స్ లో మీడియాలో వార్తల వరద పారుతోందంటే ఇప్పటి వరకు ఏ లెజండ్ పొల్టీషియన్ వాఖ్యలపై కూడా మీడియా ఇంత హంగామా చేసి ఉండదు అనేంతగా ఉంది.

అంతెందుకు రాష్ట్రం విడగొడుతున్నాం అంటూ సిడబ్ల్యూసి మీటింగ్ తర్వాత వెలుబడ్డ ప్రకటన కూడా ఇంత హల్ చల్ చేయలేదేమో అంటే కూడా అతిశయోక్తి కాదనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు. ప్రింట్ మీడియా కాస్తా టచ్ చేసి విడిచిపెట్టినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా పవన్ మాటలతో పండగ చేసుకుంది. ఇక ఆన్ లైన్ మీడియానయితే ఆ సంబారాల్లో ఇంకా మునిగి తేలుతోంది. పైరసీ ఎవరు చేసారో తెలుసు అంటే వారెవరో అంటూ ఏకంగా అల్లు అరవింద్, రాంచరణ్ వంటి పేర్లను అనుమానాలకింద చూపిస్తూ ఆగమాగం అయింది మీడియా. ఇక రాజకీయాల గూర్చి ఆయన ప్రసంగంలో ప్రస్తావనే లేకపోయినా కూడా ఆయన మాటలు చూస్తే రాజకీయాల్లోకి పవన్ కళ్యాన్ వస్తున్నాడు అంటూ తెగ వార్తలు దంచేసాయి. ఇదంతా ఎందుకు అంటే ఇంత పాపులారిటి పవన్ కు ఉంది అని చెప్పడానికి ఇది ఉదహరణ. అంతే కాదు పవన్ కు ఇప్పుడు వచ్చిన పాపులారిటి చూసి కొందరి గుండెలు మాత్రం అదిరిపోయాయి అంటున్నారు పరిశీలకులు.

లిప్ లాక్ పై పవన్ మరదలు


లిప్ లాక్ పై పవన్ మరదలు పంథా మార్చుకుంది, పవన్ కళ్యాణ్ కు మరదలు ఎక్కడిది అంటే ‘అత్తారింటికి దారేది’ లో అందంగా కనిపించి ఆయన మరదలుగా అదరగొట్టిన ప్రణీత. ఆమె ఈ సినిమా విడుదలకు ముందు టాలీవుడ్ లో ప్రవేశించేందుకు తన గ్లామర్, లిప్ లాక్ వంటి విషయాలను కూడా అంత పెద్దగా పట్టించుకోను అనుకుందట. ఏకంగా ఎంట్రీని పవర్ స్టార్ పవన్ తో ఇచ్చేసరికి ప్రణీత దశ తిరిగిపోయింది. అప్పుడే ఎన్నో ఏళ్లుగా స్టార్ డమ్ ను కొనసాగిస్తున్న టాప్ హీరోయిన్ల లెవల్లో ఫోజులు కొట్టడం మొదలు పెట్టింది అంటున్నారు.

‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల ఆలస్యం అవుతున్న సమయంలోను సినిమా దొరికితే చాలు అన్న ఆమే హఠాత్తుగా మాట మార్చారు. పవన్ తో సినిమా సూపర్ హిట్టయినందుకు ఆమెకు సినిమాల ఆఫర్లు అంతా ఇంతా కాదట. అయితే అంతకు ముందు గ్లామర్, లిప్ లాక్ లనే నమ్ముకున్న సదరు సుందరి ఇప్పుడు వాటిపై ఆదారపడే సినిమాలకు ఒప్పుకోను, స్క్రిప్ట్ నచ్చితేనే ఒప్పుకుంటాను, కథ ప్రాదాన్యతకే నేను మొగ్గు చూపుతాను అందట. ఇదండీ ఓ సారి పవన్ సరసన అవకాశం వస్తే దశ ఎలా తిరుగుతుందో చెప్పడానికి అంటున్నారు టాలీవుడ్ లో.