సంచలనం, రాష్ట్రరాజకీయాల్లో ఓ సీనియర్ నేత లేఖ బాంబులాంటి వార్తను వినిపించింది, ఇది తెలిసిన వారంతా అవాక్కవడం కాదు హతాషులయ్యారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదేంటంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పోస్టుపై కన్నేయలేదట, ఏకంగా ప్రధాని పోస్టుకే పోటీలో ఉన్నాడు, అవుతాడు కూడా అన్నది ఆ లేఖ సారాంశం. అది ఉత్తుత్తి మాట కాదు, అదెలాగో కూడా ఆలేఖలో వివరించడంతో ఆ అవకాశం కూడా జగన్ కు ఉంది అన్న టాక్ కూడా మొదలయింది.ఎందుకంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకం అన్న విషయాన్ని లేటేస్టుగా సర్వేలు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటే కదా.. నిజానికి ఈ టాక్ లేనప్పుడు దేవగౌడ ప్రధాని పీఠం అదిరోహించి నిరూపించాడు. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందన్నది ఆ సీనియర్ కాంగ్రెస్ ఎంపీ విశ్లేషణ. ఈ మాటను చెప్పడం కాదు ఏకంగా సోనియాకు లేఖ ద్వారా తెలియచేసాడు ఆ ఎంపీ రాయపాటి సాంబశివరావు. ఇప్పుడు సీమాంద్రలో కాంగ్రెస్ ను పూర్తిగా చంపేసి జగన్ పాట పాడుతున్నారు. బాగానే ఉంది, కాని ఆయన 20 ఎంపి సీట్లు గెలుచుకోవడం ఖాయం, అప్పుడు మీరే ఆయనకు మద్దతుగా నిలచి ప్రధానిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పట్లో దేవగౌడ కూడా 20 మంది ఎంపీలతోనే ప్రధాని అయ్యాడు, గుర్తుంచుకోండి అంటూ రాయపాటి చక్కటి రాయితో సోనియాను కొట్టినంత పనిచేసాడు. అంతే కాదు, బిజేపి సీమాంద్రలో పుంజుకుంటుంది, మీరు కాదన్నా ఆ అవకాశం బిజేపి జగన్ కు ఇచ్చినా ఇస్తుంది జాగ్రత్త అన్నాడు. అందుకే ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది.












