టాలీవుడ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్న హరీష్‌శంకర్‌కి ఏ హీరో అయినా కాల్షీట్లు ఇట్టే ఇచ్చేస్తాడు. ఎందుకంటే హరీష్ చెప్పే స్టోరీలకు ఏ హీరో అయినా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఒక హీరోను ఏవిధంగా, ఏ యాంగిల్‌లో పొగడాలలో అనేది హరీష్ శంకర్‌కు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు అని టాలీవుడ్ అంటుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణే ఎవరెస్ట్ శిఖరం అన్న హరీష్, రీసెంట్‌గా జరిగిన రామయ్యవస్తావయ్యా ఆడియో ఫంక్షన్‌లో ఎన్టీఆర్ లాంటి వాడు మరొకరు ఉండరు అంటూనే తన మాటల చాతుర్యాన్ని బయటపెట్టాడు. ఇదిలా ఉంటే హరీష్‌శంకర్‌కు ఓ క్రేజీ హీరోయిన్ బాగా కనెక్ట్ అయిందని అంటున్నారు.గబ్బర్‌సింగ్‌తో ఫాంలోకి వచ్చిన శృతిహాసన్‌కి డైరెక్టర్ హరీష్‌శంకర్ అంటే విపరీతమైన అభిమానం అంట. హరీష్ శంకర్ ఏమడిగా నో చెప్పలేని పరిస్థితుల్లో శృతిహాసన్ ఉంది. రామయ్యవస్తావయ్య మూవీలో శృతిహాసన్ మొదట నటించడానికి నో చెప్పి, తరువాత హరీష్‌శంకర్ నటించాల్సిందే అని డిమాండ్ చేయడంతో కాదలనేకపోయిందట. అందుకే శృతిహాసన్ మీద టాలీవుడ్‌లో ఎటువంటి కామెంట్స్ వచ్చినా, మొదటగా రెస్పాండ్ అయ్యే మొదటి వ్యక్తి హరీష్ అంటున్నారు. రామయ్యవస్తావయ్యా మూవీలో శృతిహాసన్ నెగిటివ్ రోల్ చేస్తుందని టాక్ వచ్చిన వెంటనే, దానికి సంబంధించిన క్లారిటి ఇస్తూ 'శృతిహాసన్ ఎటువంటి నెగిటివ్ రోల్స్ చేయడంలేదు' అని ఆమెను వెనకేసుకొని వచ్చాడు. అంతే కాకుండా హరీష్ శంకర్ అప్‌కమింగ్ ఫిల్మ్‌లో ఈసారి శృతిహాసన్ హీరోయిన్‌గా ఉంటుందని టాలీవుడ్ టాక్.
No comments:
Post a Comment