Sunday, 20 October 2013

రవితేజ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు


ఇండస్ట్రీలో లవ్‌కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయ్. బహుశా నా ఫేస్ అలా అనిపిస్తుందేమో. అంటే వాళ్లక్కూడా తెలుసేమో ఈ అమ్మాయితో ఇవన్నీ వేస్ట్ అని. ఇండస్ట్రీలో హరీష్ శంకర్, రవితేజ, బీవీఎస్ రవి అందరూ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారని చెప్తోంది కలర్స్ స్వాతి. తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ ఇలా స్పందించింది. ఫస్ట్ లవ్ గురించి చెప్తూ... స్కూల్లో! సెవెన్త్‌క్లాస్‌లోనే వచ్చింది. అప్పుడు వైజాగ్ నేవీ స్కూల్‌లో చదువుతున్నాను. పెన్సిల్ చెక్కుకుంటుంటే క్లోజ్‌ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యు అన్నాడు. నాకు వెంటనే అర్థం కాక చెక్కుకోవడం ఆపి ‘క్యా' అంటూ దీర్ఘం తీశాను. ఐ థింక్ ఐ లవ్ యూ అన్నాడు. అంతే... ఆ అబ్బాయితో మాట్లాడడం మానేశాను. వారం తర్వాత కలిసి ‘‘నువ్వేమైనా మిస్ ఇండియావా! ఏమనుకుంటున్నావ్? ఇష్టం లేకపోతే వదిలెయ్, నాతో మామూలుగా ఉండు'' అన్నాడు. ఇప్పటికీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌మే! ఇక కాలేజ్‌లో లవ్ ప్రపోజల్స్ ఏమీరాలేదు. మా అన్నయ్య టీషర్ట్, జీన్స్, జుట్టు ముడి వేసుకుని కాస్త పద్ధతిగా వెళ్లేదాన్ని అందుకేనేమో ఎవరూ పట్టించుకోలేదు , ఇండస్ట్రీకి వెళ్లాక చాలా వచ్చాయి అంది పెళ్లి గురించి మాట్లాడుతూ.... ఇంకో రెండు మూడేళ్లలో ఉండొచ్చు... నాకు తెలీదండీ! చెప్పలేం కదా... ఇలాంటి విషయాల్లో. అయినా ఇప్పుడు నేను ‘పెళ్లి చేసుకుందాం' అని ఆలోచించడంలేదు.

 ‘పెళ్లంటే ఏంటా?' అని ఆలోచిస్తున్నాను. ఆ ఇన్‌స్టిట్యూషన్ నాకింకా అర్థం కాలేదు. అయితే ఆ వ్యవస్థను నేను నమ్ముతున్నానంటే అది కూడా నా పేరెంట్స్‌ని చూసి. లేదా మా ఫ్రెండ్స్ పేరెంట్స్. లేదా మా చిన్నాన్న, పిన్ని. లేకపోతే... నాకంతగా సరైన అభిప్రాయం లేదు. ఏదైనా ప్రతి పెళ్లీ డిఫరెంట్. కొన్ని పెళ్ళిళ్లు అరేంజ్‌మెంట్స్ వల్లో, డీల్స్, లవ్వూ, సోషల్ ఆబ్లిగేషన్... కారణాలతో జరిగినవి చూశాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పెళ్లిళ్లు వెరీ లక్కీ. కొంతమందివి ప్చ్... వాళ్ల లైఫ్ అంతే. ఏదైనా మంచి పార్ట్‌నర్ దొరకడం అనేదానికి మనం అదృష్టవంతులం అయి ఉండాలనేది నా ఫీలింగ్ అని చెప్పుకొచ్చారామె. సోషల్ నెట్ వర్కింగ్ లు గురించి మాట్లాడుతూ... ఫేస్‌బుక్‌లో ఎకౌంట్ నాలుగేళ్ల క్రితం క్లోజ్ చేశాను. ఇప్పుడు లేదు. ఇక ట్విట్టర్ వాడే దాకా బాయ్స్‌లో అంత పైత్యం ఉందనేది నాకు తెలీలేదు. ఇంత ఫస్ట్రేటెడ్‌గా ఉన్నారా మన జనరేషన్ అనుకున్నా. రండి నన్ను ఎటాక్ చేయండి అని చెప్పి వాళ్లకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది కదా... అని ట్వీట్స్ మానేశా. అందులో ఎవరైనా ఏమైనా రాయచ్చు కదా. ‘ఎవరో నలుగురైదుగురు అంటే ట్విట్టర్ నుంచి వదిలేయడం ఏమిటీ అని' కొందరన్నారు. అయితే ప్రతిరోజూ రాయడానికి ఏం ఉంటుంది నాకు? షారూఖ్‌ఖాన్ అయితే దలైలామాను కలిశా అనో ఇంకోటో రాసుకోవచ్చు. నేనేం రాయాలి? మాపక్కింటివాళ్లని కలిశా అనా? ప్రతిరోజూ ఇంట్రెస్టింగ్‌గా ఏమిరాయగలను అని వివరించింది.

One Nenokkadine Latest Working Stills


రాత్రిళ్ళు మందు తాగుతున్న హీరోయిన్స్ వీళ్ళే


ఫిల్మ్‌ ఇండ‌స్ట్రీలో ప‌గ‌లంతా షూటింగ్ చేసి, బాగా అల‌సి పోయిన త‌రువాత చాలా మంది చేసే ప‌ని ఏంటంటే కాస్త రిలీఫ్ అవ్వడం. ఈ రిలీఫ్ అనే దాని కోసం ఎవ‌రికి న‌చ్ఛిన విధంగా వాళ్ళు ఎంజాయ్‌మెంట్‌ను వెతుక్కుంటారు. అయితే ఎక్కువ మంది అల్కాహాల్‌ను తీసుకుంటున్నట్టు ఈ మ‌ధ్య ఓ స‌ర్వే కూడ వెల్లడించింది. ఫిల్మ్ ఇండ‌స్ట్రీల‌లో ఎక్కువుగా, త్వర‌గా డ్రింకింగ్‌కు అడిక్ట్ అవుతున్న వారిలో హీరోయిన్స్ ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఈ త‌ర‌హా క‌ల్ఛర్ అన్ని ఇండ‌స్ట్రీల కంటే బాలీవుడ్‌లో ఎక్కువుగా క‌నిపిస్తుంది. బాలీవుడ్‌లో షూటింగ్ పూర్తయిన త‌రువాత టెక్నిష‌న్లతో క‌లిసి డ్రింకింగ్ చేసే అలవాటు ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారంట‌.

ఇందులో బ‌డా హీరోయిన్స్ కూడ ఉన్నట్టు ఆ స‌ర్వే తెలిపింది. ఒక‌రిద్దరు పేరు చెప్పాలంటే చెప్పవ‌చ్చు కాని, చాలా మంది అదే మ‌త్తును హాబిట్‌గా తీసుకోవ‌డంతో ఎన్ని పేర్లను బ‌య‌ట‌కు చెప్పాలో అర్ధంకావ‌డంలేదంటూ వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఆ స‌ర్వే ఇచ్చిన రిపోర్ట్‌ను చూసిన కొంద‌రు, వాళ్ళల్లో ప్రియాంక‌చోప్ర,దీపికా,మ‌ల్లికాశెరావ‌త్‌,కంగ‌నా,క‌రీనా లాంటి పేర్లు ముందు వ‌ర‌స‌లో ఉంటాయ‌ని బిటౌన్‌లో టాపిక్స్ న‌డుస్తున్నాయి. ఏదేమైనా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఇదో చిన్న హాబిట్ త‌ప్పితే, ఎవ‌రూ అదే ప‌నిగా హార్డ్ కోర్ పార్టీల‌కు అల‌వాటు ప‌డ‌రు అని మ‌రో వ‌ర్గం చెబుతుంది.

కొత్త పార్టీ పనులను ప్రారంభించిన పవన్ కళ్యాణ్


చిరంజీవి సోదరుడు, హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ ఏర్పాటు పనులను ప్రారంభించినట్టు విశ్వసనీయ సమాచారం. దీని కోసం మళ్లీ ప్రజారాజ్యం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పరకాల ప్రభాకర్, డా. మిత్ర ల సహాయం ఆయన కోరినట్టు తెలిసింది. అయితే వారిద్దరు కూడా పవన్ తో పనిచేసేందుకు తిరస్కరించారట, తాము ఎలాంటి రాజకీయాల జోలికి రాము అంటూ చెప్పేసారట. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాలా, అది కొత్తదా, లేక పాత ప్రజారాజ్యం పార్టీని తిరిగి ప్రారంభించాలా, అసలు తను పార్టీ పెడితే క్లిక్ అవుతుందా లేదా అన్న విషయంలో ప్రజాభ్రిప్రాయం తెలుసుకునేందుకు ఓ ఏజేన్సీని నియమించి సర్వేచేయించాలని పవన్ నిర్ణయించాడంటున్నారు.

ఈ సర్వే నవంబరు మొదటివారం నుంచి మొదలవుతుందని చెపుతున్నారు. అంతకు ముందు తను గతంలో ఏర్పాటు చేసిన కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కు తిరిగి ప్రాణం పోసి ప్రజల్లోకి పంపాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి పై కోపంతో, ఆయనకు ధీటుగా సమాధానం చెప్పాలని పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతున్నాడని పుకార్లు లేచిన సంగతి తెలిసిందే. కాని అలాంటిదేం లేదట చిరంజీవే పవన్ కు వెనుక నుంచి ప్రోత్సాహం అందిస్తున్నాడంటున్నారు. కారణం ఆయన పరిస్థితి మాట ఎలా ఉన్నా కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అందుకే పవన్ తో పార్టీ పెట్టించి క్లిక్ అయ్యాక అంతా కలిసిపోవచ్చనేది మెగా బ్రదర్స్ ఆలోచన అంటున్నారు.