Sunday, 27 October 2013

మోడీ సభ గ్రౌండ్‌లో, సమీపంలో వరుస బాంబు పేలుళ్లు


బీహార్ రాజధాని పాట్నాలో ఆదివారం వరుస పేలుళ్లు సంభవించాయి. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ పాట్నాలోని హూంకార్ ర్యాలీ సభలో ఈ రోజు పాల్గొన్నారు. ఈ సభకు ముందు పాట్నాలో వరుసగా ఎనిమిది నాటు బాంబులు పేలాయి. మోడీ పాట్నాకు రాకముందు రెండు పేలుళ్లు సంభవించగా, రాజధానిలో అడుగు పెట్టిన తర్వాత ఆరు పెలుళ్లు సంభవించాయి. ఉదయం పదకొండు గంటలకు రైల్వే స్టేషన్‌లోని పదో నెంబరు ప్లాట్ ఫాం పైన, రెండోది సినిమా థియోటర్ సమీపంలో పన్నెండున్నర గంటలకు సంభవించింది. అలాగే మోడీ సభ జరగాల్సిన గాంధీ మైదానంలో రెండు పేలుళ్లు, వెలుపల నాలుగు పేలుళ్లు సంభవించాయి.

 ఈ పేలుళ్లకు సంబంధించి ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుస పేలుళ్ల నేపథ్యంలో పోలీసులు మోడీ సభకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, రేల్వే స్టేషన్ సమీపంలో రెండు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మిగతా పేలుళ్లలో గాయపడ్డారు. సభ జరిగి తీరుతుంది: బిజెపి ఎవరు ఏం చేసినా మోడీ సభ జరిగి తీరుతుందని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మోడీ హూంకార్ ర్యాలీలో పాల్గొన్నారు.

కమల్ జన్మదినం రోజున ’విశ్వరూపం 2’ ట్రైలర్


బహుభాషా నటుడు కమల్ హసన్ నటిస్తూ, రూపొందిస్తున్న 'విశ్వరూపం 2’ చిత్ర ట్రైలర్ ను ఆయన జన్మదినం నవంబర 7 తేదిన విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సంవత్సరం ఆయన జన్మదినం రోజునే విశ్వరూపం ట్రైలర్‌ను ఆరో 3డిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ముందే విడుదల చేయాలనుకున్నాం.

కొంత ఎడిటింగ్ పూర్తికావడంలో ఆలస్యమైంది.అందుచేత కమల్ జన్మదినం రోజున ట్రైలర్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నాం అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన వర్గాలు వెల్లడించాయి. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

పవన్ 'కోబలి'లో శాతవాహనుల తర్వాత కాలం నాటి...


హైదరాబాద్ : ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ ఏమిటీ అంటే పవన్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న కోబలి చిత్రం. ఈ చిత్రం గురించి త్రివిక్రమ్ మరింతి ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ చిత్రంలో తెలుగు భాష గురించి పూర్తి కేర్ తీసుకుంటామని,అందుకే స్క్రిప్టు లేటు అవుతుందని చెప్పారు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం 'అత్తారింటికి దారేది' విజయాన్ని ఆస్వాదిస్తున్నారు . పవన్‌కల్యాణ్‌తో హీరోగా ఆయన తెరకెక్కించిన 'అత్తారింటికి దారేది' వంద కోట్ల క్లబ్‌లో చేరనుందనేది ట్రేడ్ పండితుల విశ్లేషణ. త్రివిక్రమ్ మాట్లాడుతూ.... 'కోబలి' కథ ఇంకా ప్రిలిమినరీ స్టేజస్‌లోనే ఉంది. శాతవాహనుల తర్వాత కాలం నాటి లాంగ్వేజ్‌ను, కప్పట్రాల ఆ ప్రాంతాల్లో వాడిన అచ్చమైన తెలుగును వాడుతున్నాం. ఇప్పటికీ ఆ ఏరియాలో అందమైన తెలుగు వినిపిస్తుంది. మెహబూబ్‌నగర్‌లోని పలు గ్రామాల్లో కూడా తెలుగు భాష సౌందర్యం వినిపిస్తూనే ఉంటుంది. లాంగ్వేజ్‌పై రీసెర్చ్ జరుగుతోంది. కోబలి స్క్రిప్ట్‌కే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే సినిమా ఎప్పుడు ప్రారంభిస్తామో చెప్పలేం అన్నారు.

 అలాగే కోబలి రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా కాదు. నాకూ, పవన్‌గారికి అంతంత రెమ్యూనరేషన్స్ ఇచ్చేవారు ఇలాంటి వాటిని ఇష్టపడతారో? లేదో? అందుకే మేమే ఈ సినిమా చేస్తున్నాం. భవిష్యత్తులోనూ చాలా సినిమాలు చేస్తాం. కొన్ని కథలను నేను ఎంత చేసినా ఇది త్రివిక్రమ్ సినిమాలాగా లేదు అంటారు. త్రివిక్రమ్ సినిమాలాగా ఉండటమంటే ఏంటో నాక్కూడా తెలియదు. కానీ ఆడియన్స్ అలా ఫిక్సయిపోతారు. అలా నా దృష్టిలోకొచ్చిన, పవన్‌గారి దృష్టిలోకొచ్చిన మంచి కథలతో ఈ సంస్థలో సినిమాలు చేస్తాం. ఇక ఈ చిత్రం పవన్‌తో కలిసి నిర్మిస్తున్నాను. 'కోబలి'... రాయలసీమ ప్రాంతంలో ఈ పదం వినిపిస్తుంటుంది. అంటే అమ్మవారికి బలివ్వడం అన్నమాట. ఈ కథపై పరిశోధన జరుగుతోంది. కొంచెం కష్టంతో కూడిన కథ. ఆ సాహసమేదో మేమిద్దరమే చేయాలనుకొన్నాం. 'కోబలి' సమాంతర చిత్రం అనుకోలేం. అలా అనలేం. అవార్డు సినిమా, సమాంతర సినిమా అంటూ విడగొట్టి చూడడం నాకు ఇష్టం లేదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అంతే.వీలైనంత తొందర్లోనే ఈ సినిమాను మొదలుపెడతాం అని చెప్పారు.

విశాల్ పెళ్లి శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో?


చెన్నై: తమిళ సినీ వర్గాల్లో ఇప్పుడు ఓ విషయం హాట్ టాపిక్‌గా మారింది. హీరో విశాల్, సినీయర్ హీరో శరత్ కుమార్ తనయ వరలక్ష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సమాచారం. అయితే వీరి వివాహానికి శరత్ కుమార్ సుముఖంగానే ఉన్నప్పటికీ......శరత్ కుమార్‌తో వియ్యమొందడానికి విశాల్ తండ్రి జి.కె.రెడ్డి సుముఖంగా లేరని సమాచారం. గతంలో శరత్ కుమార్‌తో విభేదాల కారణంగానే ఆయన ఈ వివాహానికి ఒప్పుకోవడం లేదని అంటున్నారు.

అయితే విశాల్ మాత్రం వరలక్ష్మినే పెళ్లి చేసుకుంటానని పట్టుదలతో ఉన్నట్లు కోలీవుడ్ టాక్. ఇరు కుటుంబాల మధ్య రాజీకుదర్చి వివాహానికి ఒప్పించేందుకు వరలక్ష్మి సవతి తల్లి, నటి రాధిక రాయబారం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విశాల్-వరలక్ష్మి మాత్రం తమ పెళ్లి విషయమై వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. రాధిక రాయబారం ఫలించే వరకు.....ఈ విషయం బయటకు పొక్కకూడదనే ఉద్దేశ్యంతోనే వారు మీడియా వార్తలను ఖండిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా...వరలక్ష్మితో తన వివాహానికి అడ్డు చెబుతున్న తండ్రితో విశాల్ విబేధించాడని, తను ఇటీవల కొన్న ఇంట్లో వేరుగా ఉంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విశాల్-వరలక్ష్మి వివాహం విషయమై ఓక్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇటీవల విశాల్-వరలక్ష్మి ‘మద గజ రాజా' చిత్రంలో కలిసి నటించారు.

ఫుల్‌గా తాగి ఫోటోలు పెట్టింది: ఫొటో


తెలుగులో కేవ‌లం ఒకే ఒక్క మూవీ చేసింది. ఆ మూవీ కూడ ప్లాప్ కావ‌డంతో ఇక టాలీవుడ్ వైపు క‌న్నెత్తి కూడ చూడ‌లేదు. త‌నే ఫిల్మ్ యాక్టర్ రైమా సేన్‌. త‌ను ఎక్కువుగా బాలీవుడ్‌, బెంగాళి ఫిల్మ్స్‌లోనే న‌టించింది. అయితే ఎక్కడ న‌టించినా త‌న‌దైన గుర్తింపు పొందుతుంది. అలాగే వార్తల్లోనూ హాట్ టాపిక్‌గా మారుతుంది. లేటెస్ట్‌గా రైమాసేన్ త‌న స్నేహితుల‌తో క‌లిసి వీకెండ్ పార్టీను ప్రెండ్స్ రూంలో జ‌రుపుకుంది. మొత్తం అయిదుగురు గ‌ర్ల్స్‌, ఇద్దరు జెంట్స్‌. వీళ్ళంతా బీర్లతోనూ, హాట్ లిక్కర్లతోనూ పార్టీను తెగ ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన వారు ఎంజాయ్ చేసినట్టుగా ఉండ‌క ఆ ఫొటోల‌ను నెట్‌లో ప‌బ్లిష్ చేశారు. దీంతో రైమాసేన్ య‌వ్వావం హాట్‌టాపిక్‌గా మారింది. ఇండ‌స్ట్రీలోనూ రైమాసేన్ డేటింగ్ క‌ల్చర్‌కు బాగా అల‌వాటు ప‌డింద‌ని, అయితే ఇప్పుడు పీక్ స్టేజ్‌కు వెళ్ళింద‌ని చర్చించుకుంటున్నారు. నిజానికి రైమాసేన్‌ ఒక మూవీకు చెందిన షూటింగ్‌లో పార్టిసిపెట్ చేయాల్సి ఉండ‌గా, ఆ మూవీకు సంబంధించిన షెడ్యూల్‌ డేట్స్‌ను కాన్సిల్ చేయించుకొని మ‌రీ ఈ విధంగా పార్టీలో ఎంజాయ్ చేయ‌డంపై ఆ మూవీ నిర్మాత‌లు కూడ ఈమెపై ఫైర్ అవుతున్నారు. ఫిల్మ్ సెల‌బ్రిటిలు వీకెండ్స్ జ‌రుపుకుంటే ఎలా ఉంటుందో ఈ ఫోటోలతో మ‌రోసారి బ‌య‌ట‌కు తెలిసింది.

అన్నకు విధేయులు పవన్, నాగబాబు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరూ అన్న చిరంజీవికి విధేయులే. తమ ఎదుగుదలకు అన్నే కారణం అని ఇప్పటికీ, ఎప్పటికీ వారు నమ్ముతారు. వారు అలా భావించినంత మాత్రాన వారిలో టాలెంట్ లేదని కాదు. నటనా సామర్ధ్యంతోపాటు వారి వ్యక్తిత్వం వారికి ఉంది. వారి విలువలు వారికి ఉన్నాయి. అన్న అండతో అల్లుకుపోయామని వారికి తెలుసు. వాస్తవాలు తెలుసుగనుకనే ఒద్దికగా ఉంటారు. అన్న మాటకు విలువ, గౌరవం ఇచ్చినంత మాత్రాన వారి మధ్య అభిప్రాయ బేధాభిప్రాయాలు, చిన్నచిన్న మనఃస్పర్ధలు లేవని కాదు. అవి ఉంటాయి. వాటి దారి వాటిదే. వారి ఐక్యత వారిదే. ఆ రకంగా అటుంటి తమ్ముళ్లు ఉన్నందుకు చిరంజీవి కూడా అదృష్టవంతుడు. బాబాయి పవన్ మనసు తెలిసినందునే చరణ్ అప్పుడప్పుడు రెచ్చిపోయి మాట్లాడుతుంటారు.

 తమ సంబంధం పటిష్టమైనదని చెబుతుంటారు. అన్నను వదిలి పవన్ గానీ, నాగబాబు గానీ రాజకీయ పార్టీ పెట్టే అవకాశం లేదు. మరో పార్టీలో చేరే అవకాశం అంతకంటే లేదు. అన్నకు విధేయులుగా ఉండే వారు అన్న ఒక పార్టీలో ఉంటే మరో్ పార్టీలో ఎందుకు చేరతారు? ఈ ఇద్దరూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నట్లు ఎవరు ఊహించారోగానీ, అది రెండు రోజులపాటు విస్తృతంగా ప్రచారం అయింది. టిడిపి నేతలైతే ఒక అడుగు ముందుకువేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి తమ పార్టీలోకి వస్తే మంచిదేనని ఆహ్వానం పలికారు.

 ఆ తరువాత నాగబాబు, పవన్ వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తాను, పవన్ కళ్యాణ్ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు వచ్చిన వార్తలను నాగబాబు ఖండించారు. టీడీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు నిరాధారమైనవని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లోకి వచ్చే తీరిక తమకు లేదని స్పష్టం చేశారు. తాము వృత్తిపరంగా బిజీగా ఉన్నట్లు తెలిపారు. వృతికి న్యాయం చేయడమే తమ బాధ్యతగా పేర్కొన్నారు. తాము రాజకీయ పార్టీ పెట్టడం లేదని కూడా నాగబాబు స్పష్టం చేశారు. మీడియా కథనాలు అభిమానులను, ప్రజలను గందరగోళపరిచేలా ఉన్నాయని వాపోయారు.

ఎడారి మందు పార్టీలో టాప్ హీరోయిన్ !!


డస్కీ బ్యూటీ అమలాపాల్ కెరియర్ ప్రస్తుతం పెద్ద ఆశాజనకంగా లేకపోయిన తన పుట్టిన రోజును మాత్రం చాలా వెరైటీగా ఘనంగా జరుపుకుందని తెలుస్తోంది. తన పుట్టిన రోజు వేడుకకు చెన్నై ని వేదికగా తీసుకోకుండా ఏకంగా రాజస్థాన్ ను వేదికగా చేసుకుంది. నిన్న ఈమె పుట్టినరోజును రాజస్థాన్ లో జరుపుకోవడానికి గల కారణం ప్రస్తుతం ఆమె నటిస్తున్న మలయాళ చిత్రం 'ఒరు ఇండియన్ ప్రణయ్ కథ' కోసం గత కొన్ని రోజులుగా రాజస్థాన్ లోని వివిధ లోకేషన్లలో ఈ ముద్దుగుమ్మ షూటింగు చేస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రం యూనిట్ కి నిన్న రాత్రి మాంచి మందు పార్టీ ఏర్పాటు చేసి హడావిడి చేసిందట. నిన్నటితో ఈ చిన్నది 23 వ ఏట ప్రవేశించింన అమలాపాల్ కు మంచి నటిగా పేరున్నా ప్రస్తుతం చేతిలో చెప్పుకోతగ్గ సినిమాలు లేవు. ఈ సంవత్సరం ఈమె చరణ్, బన్నీలతో నటించి మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయినా టాలీవుడ్ ప్రేక్షకులలో ఈమెకు ఇంకా సరైన ఇమేజ్ఏర్పడలేదు. అదేవిధంగా ఈ మధ్య ఈమె తమిళ హీరో విజయ్ తో నటించిన సినిమా కూడా పరాజయం చెందడంతో ప్రస్తుతం ఈమె తన స్వస్థలం మలయాళ సినిమా రంగంలో అవకాశాలు వెతుక్కుంటోoది. యంగ్ హీరోలను ఫాన్ చేసి మరీ అవకాశాలు ఇవ్వమంటు మార్కెట్ చేసుకునే ఈ మలయాళ కుట్టికి ఈ పుట్టినరోజు పార్టీ ఎంత వరకు కలిసివస్తుందో చూడాలి.