Tuesday, 19 November 2013

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ ఆహ్వానం ?


ప్రస్తుతం భాగ్యనగరంలో అంతర్జాతీయ చిల్డ్రన్ ఫెస్టివల్ జరుగుతోంది. దాదాపు 48 దేశాల ప్రతినిధులు వారు నిర్మించిన సినిమాలు భాగ్యనగరంలోని చాల ధియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎలట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వెబ్ మీడియాల దృష్టి అంతా రాష్ట్ర విభజన సమస్య పై ఉండటంతో ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ కు అనుకున్నంత మీడియా కవరేజ్ రావడంలేదు. అయినా చాల మంచి, పిల్లల సినిమాలు ఈ ఫెస్టివల్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది. నవంబర్ 14న ప్రారంభం అయిన ఈ ఫెస్టివల్ ఈరోజు ముగింపుకు వస్తోంది. ఈ ఫెస్టివల్ ను బాలీవుడ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ ప్రారంభించాడు.

ఈరోజు జరగబోతున్న ముగింపు ఉత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్న చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ముఖ్య అతిధిగా పిలిచినట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ అభిమానుల క్రేజ్ రీత్యా ఈ వార్తను చివరి నిముషంలో ప్రకటిస్తారు అని అంటున్నారు. గత వారంరోజులుగా ఈ ఫెస్టివల్ మన రాజధానిలో జరుగుతున్నా మన టాలీవుడ్ సెలెబ్రెటీలు ఎవ్వరూ ఈ ఉత్సవం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ ఈ ముగింపు ఉత్సవానికి ముఖ్య అతిధిగా హాజర అవుతాడు అని అంటున్నారు. పవన్ కు చిన్న పిల్లలంటే ఉన్న విపరీతమైన అభిమానం పవర్ స్టార్ చేత ఈ ఉత్సవాలకు వచ్చేటట్లుగా చేసింది అని టాక్. ఈ వార్తలే నిజమైతే పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న మొట్టమొదటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా రికార్డుకేక్కుతుంది.

మ‌హేష్‌కు సిక్స్ ప్యాక్ రెడీ


టాలీవుడ్‌లో హీరో ఎవ‌రంటే ప్రిన్స్ మ‌హేష్‌బాబు పేరే చెబుతారు అమ్మాయిల గుండెల్లో ఇప్పటికీ రాకుమారుడిగానే ఉన్నాడు ఈ ప్రిన్స్‌ అయితే సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ 1 నేనొక్కడినే అయితే మ‌హేష్ గ్లామర్ కాస్త త‌గ్గిన‌ట్టే అనిపిస్తోంది తాజాగా ఈచిత్రంలోని సీన్స్‌కు సన్నివేశాలకు సంబంధించిన కొన్ని మ‌హేష్ ఫోటోలు లీక‌యిన చూస్తుంటే. ఇదంతా సిక్స్ ప్యాక్ ఎఫెక్టే అని తెలిసింది. సిక్స్ ప్యాక్ వ‌ల్ల కండలు పెరుగుతాయి స‌రేకానీ ముఖంలో తీవ్ర మైన మార్పులొస్తాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండగకు జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మహేష్ బాబు క్రితి సానన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటి మహేష్ బాబు సినిమాలకు యూఎస్‌లో బాగా డిమాండ్ ఉండటంతో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పలు చిత్రాలకు హిట్ మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా మహేష్ బాబు చిత్రానికి పని చేస్తున్నారు

శివశంకర్‌ మాస్టర్ కి డాక్టరేట్


: ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్‌కు బెంగళూరుకు చెందిన ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ ట్రస్ట్‌ పీస్‌ సంస్థ గౌరవ డాక్టరేట్‌ అందించింది. ఇటీవల ఆయన ఈ డాక్టరేట్‌ని స్వీకరించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ ఇలా దాదాపు పది చిత్రసీమలతో ఆయనకు అనుబంధం ఉంది. 'మగధీర' చిత్రానికి ఉత్తమ నృత్య దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకొన్నారు. శివ శంకర్ మాట్లాడుతూ... ''మీ నృత్యంలో పవిత్రత ఉంది. అందుకే ఈ పురస్కారం అందిస్తున్నాం... అని ఈ సంస్థ ప్రతినిధులు నాకు చెప్పారు. ఆ మాట వినగానే చాలా సంతోషం వేసింది. నృత్యమే నా శ్వాస. అదే నా జీవితం. ఎన్ని భాషల్లో పనిచేసినా తెలుగు సినిమాలంటేనే నాకు ప్రేమ. నటుడిగానూ రాణించాలని ఉంది'' అన్నారు. ఈ సందర్భంగా శివ శంకర్ మాస్టర్ కి ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

ఇక శివ శంకర్ మాస్టర్ డాన్స్ మాస్టర్ గానే కాక, టీవి పోగ్రామ్స్ లోనూ పాపులర్. ఇక రీసెంట్ గా విడుదలైన మసాలా చిత్రంలో తన పాత్రకు శివ శంకర్ పాత్రే స్పూర్తి అని రామ్ అన్నారు. రామ్ మాట్లాడుతూ.. 'మసాలా' లో రెండో రకం పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా తర్ఫీదు పొందటంలాంటిదేమీ లేదు . అయితే ఆ పాత్ర విషయంలో శివశంకర్‌ మాస్టర్‌ నాకు బాగా సహకరించారు. సినిమాలో ఆ పాత్రపై ఓ పాట ఉంటుంది. దాంతోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. శివశంకర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చడంతో నా పని సులువైంది. సినిమా మొత్తం ఆయన్ని అనుకరిస్తూ నటించా. రెండు కోణాల్లో సాగే పాత్ర అది. రెండో రకం పాత్ర కాస్త తేడాగా ఉంటుంది అన్నారు.

వోల్వో ప్రమాదం: బస్సుతో ప్రయోగాత్మకంగా (పిక్చర్స్)


అక్టోబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో జాతీయ రహదారి పైన జరిగిన వోల్వో బస్సు ప్రమాదంపై సిఐడి అధికారులు సోమవారం దర్యాఫ్తు నిర్వహించారు. వోల్వో బస్సు ప్రమాదానికి గురైన ఘటనలో 45 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం సిఐడి విచారణకు అప్పగించింది. దీంతో వారు సోమవారం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. సిఐడి డిఐజి రవిచంద్ర నేతృత్వంలో బృందం వివరాలు సేకరించింది. వోల్వో బస్సు కల్వర్టును ఢీకొన్న తీరును, మంటలు వ్యాపించడానికి గల కారణాలు, బస్సు దహనమైన ప్రదేశాన్ని వారు క్షుణ్ణంగా పరిశీలించారు. వోల్వో బస్సు ప్రమాదంపై సోమవారం స్వీడన్‌కు చెందిన నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బస్సు ఢీకొట్టిన కల్వక్టును పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును వారు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. మొదట బస్సు టైరును తెచ్చి ప్రమాదాన్ని అంచనా వేశారు. ఓ ప్రయివేటు బస్సును వారు తీసుకు వచ్చి డివైడర్ పైకి ఎక్కించి కల్వర్టును ఢీకొట్టిన విధానాన్ని అంచనా వేశారు. బస్సు వేగాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. వీరి వెంట వోల్వో కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.

శ్రుతిహాసన్‌పై దాడి: భీతిల్లిన నటి, సురక్షితం


ముంబై: ప్రముఖ సినీ నటి, హీరోయిన్ శ్రుతిహాసన్‌పై ముంబైలోని అపార్టుమెంటులో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలోని అపార్టుమెంటులోకి గుర్తు తెలియని దుండగుడు దూసుకుని వచ్చి దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగిందని అంటున్నారు. మీడియా కథనాల ప్రకారం - శ్రుతిహాసన్ తలుపు తీయగానే దుండగుడు ఆమె గొంతు పట్టుకుని తోసేసి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఆమె అతని ముఖం మీద తలుపును వేయడంతో అతని చేయికి దెబ్బ తాకింది. ఆమె వేరే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. దాంతో అతను పారిపోయాడు. ఆ ఆకస్మిక సంఘటనతో శ్రుతి హాసన్ భీతిల్లినట్లు చెబుతున్నారు. శ్రుతిహాసన్ ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ కూతురు. ఆమె ముంబైలో అపార్టుమెంటు కొనుక్కుని అక్కడే ఉంటోంది. ఆమె తెలుగులో గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా వంటి చిత్రాల్లో నటించింది. ఈ సంఘటనపై శ్రుతిహాసన్ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఆమె తీవ్రంగా వణికిపోయిందని ఆమె అధికార ప్రతినిధి చెప్పినట్లు ఎన్డీటివీ రాసింది.