దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ ‘దసరా’ లేక ‘దేవీ నవరాత్రులు’ అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. Saturday, 12 October 2013
విజయదశమి శుభాకాంక్షలు
దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలో మొదటి తొమ్మిది రోజులనూ ‘దసరా’ లేక ‘దేవీ నవరాత్రులు’ అంటారు. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడురోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విద్యార్ధులు పుస్తకపూజ, శ్రామికులు పనిముట్లపూజ, క్షత్రియులు ఆయుధపూజ చేసి, అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. దేవి మహిషాసురమర్దనిగా రాక్షసుని మీదకు దండెత్తి విజయం సాధించిన స్పూర్తితో, పూర్వం రాజులు ఈశుభ ముహూర్తాన్నే దండయాత్రలకు ఎంచుకొనే వారని పురాణాల్లో చెప్పబడింది. విజయదశమి కానుకగా 'లెజెండ్' ఫస్ట్‌లుక్
'ముందస్తు'ను తీసుకొస్తున్న తెలంగాణ!
విభజనపై తీవ్ర రాజకీయ చిక్కుముడి పడిందిరానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఏపీ ఎంపీల రాజీనామా అప్పుడిక ఎన్నికలకు వెళ్లాల్సిందే ఎన్సీపీ నేత పవార్ సంచలన వ్యాఖ్యలు ముంబై, అక్టోబర్ 12: తెలంగాణ విభజన అంశం ముందస్తు ఎన్నికలను తెచ్చి పెట్టే అవకాశం కనిపిస్తున్నదని కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ సమస్యపై రానున్న రోజుల్లో పెద్దఎత్తున ఎంపీలు రాజీనామా చేయొచ్చునని కూడా వ్యాఖ్యానించారు. అలాగే, ఇక తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనబోనని పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఓ అధికార కార్యక్రమంలో శనివారం శరద్ పవార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన మీడియాతో ముచ్చటించారు. "తెలంగాణ అంశం తీవ్రమైన రాజకీయ చిక్కుముడిగా మారుతున్నది. నాకు తెలిసిన మేరకు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలామంది పార్లమెంటు సభ్యులు తమ లోక్‌సభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే జరిగితే గడువు కన్నా ముందే లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయి'' అని ఆయన వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..కాంగ్రెస్ పార్టీతో కలిసే పోటీ చేస్తామని చెప్పారు.
అదే సమయంలో తాను ఈసారి లోక్‌సభకు పోటీ చేయడం లేదని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో అడుగుపెడతానని వివరించారు. కాగా, ఆర్డినెన్స్ విషయమై రేగిన వివాదం గురించి స్పందించేందుకు ఆయన నిరాకరించారు. అలాగే.. ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు ఎందుకు పోటీ పడుతున్నారని ప్రశ్నించగా, సూటిగా సమాధానం ఇవ్వలేదు. గెలుద్దామని పోటీ చేస్తున్నానని చెప్పి ముక్తాయించారు
తెలంగాణలో మార్పులేదు – సీమాంద్రకు ప్యాకేజీనే.

శాశ్వత రాజధాని, లేదా కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ఉండాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా వైదొలగిందని, హైదరాబాద్ లేని తెలంగాణ ను తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని, అలా చేస్తే తెలంగాణలో మునుపటి కంటే ఎక్కువ ఉద్యమం లేస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కు ఖచ్చితమైన సమాచారం ఉందని తెలిసింది. దీంతో ఆ విషయంపై, హైదరాబాద్ పై పెట్టుకున్న రెండు మూడు ఆప్షన్లపై ఇక కాంగ్రెస్ వైదొలగింది అంటున్నారు పరిశీలకులు.
అయితే దీనిని సీమాంద్ర వారు ఆమోదించేందుకు కళ్లు చెదిరే ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోందట. కొత్త రాజధానిని ఆధునిక రాజధానిగా అభివృద్ది చేస్తామని స్పష్టమైన హామీతో పాటు, ఊహించనంత రీతిలో ఆర్థిక ప్యాకేజి ప్రకటించడం ఒక్కటే మార్గమని, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా సూచించిందని, అందుకే ఆ వైపుగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందంటున్నారు. దీనిపై సీమాంద్ర వాదులు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో ఎదిరి చూడాల్సి ఉంది.
సచిన్ రిటైర్మెంట్ పై టాలీవుడ్ హీరోల స్పందన
క్రికెట్ గాడ్‌గా పేర్గాంచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ వార్త క్రీడా ప్రపంచాన్ని కలవరానికి గురి చేసింది. సచిన్ వీరాభిమానులు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. సచిన్‌ని విపరీతంగా ఆరాధించేవారిలో మన టాలీవుడ్ హీరోలు కూడా ఉన్నారు. వారు కూడా సచిన్ రిటైర్మెంట్ వార్త విని చలించిపోయారు. పలువురి హీరోల స్పందన ఇలా...
విభజించాల్సిందే - వెంకటేశ్నా దృష్టిలో ఇది వెరీ శాడ్ డే. 24 ఏళ్లుగా సచిన్ ఆటను ఆస్వాదిస్తూ వచ్చాను. ఇక తను లేని క్రికెట్ అంటే నాకే బ్లాంక్‌గా ఉంది. సచిన్‌ని చూసి ఎవ్వరైనా సరే ఇన్‌స్పైర్ కావాల్సిందే. అతని డిసిప్లిన్, డెడికేషన్, ఎఛీవ్‌మెంట్, ఎనర్జీ... మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. నాకు రిలాక్సేషన్ అంటే క్రికెట్టే. సచిన్ లేని క్రికెట్‌ని ఇంకో రకంగా ఊహించాల్సిందే. ఇక నుంచి ఈ క్రికెట్ ఎలా ఉంటుందో అనిపిస్తోంది. అసలు క్రికెట్ గురించి మాట్లాడాలంటే... సచిన్‌కి ముందు, సచిన్‌కి తర్వాత అని విభజించాల్సిందే. సచిన్‌తో నాకు మంచి పరిచయమే ఉంది. దక్షిణాఫ్రికాలో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌ల సమయంలోనూ, ఐపీయల్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు తనను చాలాసార్లు కలిశాను. మా ఇద్దరి మధ్యనా చాలా మంచి చర్చలు జరిగేవి. ఆ సందర్భాలను ఎప్పుడు గుర్తు చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది.
నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు - శ్రీకాంత్‘‘క్రికెట్‌ని గాఢంగా ప్రేమించే వాళ్లంతా సచిన్ రిటైర్మెంట్ వార్త వినగానే ఏడ్చినంత పనిచేశారు. క్రమశిక్షణకు నిలువుటద్దంలాంటి వ్యక్తి ఆయన. సచిన్‌ని చూడ్డానికే స్టేడియమ్‌కి వెళ్లేవాళ్లు చాలామంది ఉంటారు. ఇప్పుడా సంఖ్య తగ్గుతుంది. ఇకపై నేను కూడా స్టేడియమ్‌కి వెళ్లి మ్యాచ్‌లు చూడను. సచిన్‌తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వైజాగ్‌లో ఓసారి ఛారిటీ మ్యాచ్ జరిగినప్పుడు సచిన్‌తో పాటు ఐదుగురు ఇండియన్ క్రికెటర్లు, నేను, చిరంజీవిగారు, వెంకటేశ్‌గారు, తరుణ్ క్రికెట్ ఆడాం. ఆ మ్యాచ్‌లో నా కాలికి దెబ్బ తగిలితే, సచిన్ స్వయంగా నాకు ఐస్ పెట్టి ఎలా కేర్‌గా ఉండాలో సూచనలు చేశారు. ఆ తర్వాత రోజు చిరంజీవిగారి ఇంట్లో పార్టీ జరిగినప్పుడు సచిన్, మేమంతా చాలా ఎంజాయ్ చేశాం. ఆ క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నేనెక్కడ కనిపించినా గుర్తుపట్టి పలకరిస్తుంటారు
సచిన్ అంటేనే క్రికెట్... క్రికెట్ అంటేనే సచిన్..! - అల్లరి నరేశ్‘గబ్బర్ సింగ్’లో పవన్ కల్యాణ్ ‘పిల్లా... నువ్వు లేని జీవితం నల్లరంగు అంటుకున్న తెల్ల కాగితం’ అని పాట పాడినట్టుగా, సచిన్ లేని క్రికెట్‌ని ఊహించడమే ఎంతో కష్టంగా ఉంది. బ్రియాన్ లారా లాంటి హేమాహేమీల్లాంటి క్రికెటర్లే సచిన్ రిటైర్మెంట్ వార్తను జీర్ణించుకోలేకపోతుంటే, నాలాంటి సాధారణ అభిమానుల పరిస్థితి ఏంటి? నిజంగానే సచిన్ క్రికెట్ దేవుడు. ఆయనలో ఇప్పటికీ క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో పక్కకు తప్పుకుంటున్నారు. నా మట్టుకు నేను సచిన్ లేని క్రికెట్‌ని చూడ్డానికి ఇంకో రెండేళ్లు పడుతుందేమో! అసలు ఒక మనిషి 24 ఏళ్లుగా ఎక్కడా గ్రాఫ్ పడిపోకుండా హైరేంజ్‌లోనే క్రికెట్ ఆడటమంటే మాటలు కాదు. అది సచిన్ ఒక్కడి వల్లే అవుతుంది. ఇన్నేళ్లలో తనపై ఒక్క కాంట్రవర్శి కూడా రాకపోవడం చాలా గొప్ప విషయం. అసలు సచిన్ గురించి ఇంకా చాలా చెప్పొచ్చు. ఫైనల్‌గా మాత్రం ఒక్కటే. సచిన్ అంటేనే క్రికెట్. క్రికెట్ అంటేనే సచిన్.
సచిన్ కోసమే ‘‘ఇక సచిన్ లేని క్రికెట్‌ని నేను చూడలేను - విష్ణు.సచిన్ కోసమే ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను. ఇక నుంచి క్రికెట్ ప్రపంచమంతా బిఫోర్ సచిన్, ఆఫ్టర్ సచిన్ అని చెప్పుకుంటారు. ఈ 40 ఏళ్లలో 30 ఏళ్లు సచిన్ క్రికెట్‌నే అంకితమైపోయాడు. నెక్ట్స్ ఆయన ఏం చేస్తాడు? ఎంత మందికి ఆదర్శవంతంగా ఉంటాడు? అనేది నాతో పాటు చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్ వచ్చినపుడు 2 సార్లు సచిన్‌ని కలిశాను. ఆ ఇన్సిడెంట్స్ ఇప్పటికే నా మదిలో లైవ్లీగా ఉన్నాయి’’.ఇన్నేళ్లూ క్రికెట్ చూశాను
వన్ అండ్ ఓన్లీ సచిన్ - సిద్దార్థ్‘‘నాకు డాన్ బ్రాడ్‌మన్ తెలీదు. గ్యారీ సోబర్స్‌ని చూడలేదు. నేను చూసింది, నాకు తెలిసింది, నేను ఆరాధించింది, నేను ఆస్వాదించింది వన్ అండ్ ఓన్లీ సచిన్‌నే. ప్రపంచంలో ఇంత గొప్ప బ్యాట్స్‌మెన్ మళ్లీ రాడు. 24 ఏళ్లుగా ఈ క్రికెట్ ప్రపంచాన్ని తేజోవంతం చేసినందుకు సచిన్‌కి కృతజ్ఞతలు.
ఆర్టీసీ కదిలింది!

జగన్ వచ్చి దెబ్బ తిన్నాడా
జగన్ జైలు నుంచి వచ్చి దెబ్బతిన్నాడా... ఈ ప్రశ్న ఆయన ప్రత్యర్థుల్లో కంటే ఆయన పార్టీ నేతల్లోనే ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఆయన రావడం పార్టీకి కొంత నష్టమే కలిగించిందన్న అభిప్రాయాలను కూడా కొందరు వైఎస్సార్ సిపి నేతలు వ్యక్తం చేస్తున్నారట. దీనికి ప్రధాన కారణం ఆయన దీక్ష ఫెయిల్ కావడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఆయన రాకూడాని సమయంలో బయటకు వచ్చాడా, ఉద్యమంలోకి ప్రజలు లీడర్లను రానీయని సమయంలో రావడం కూడా మైనస్ అయిందా అన్న వాదనలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాట ఎలా ఉన్నా ఆయన దీక్షకు ఆయన మీడియా ఇచ్చిన విపరీత ప్రచారం, జరిగిన తీరు, ఆయన వ్యవహార శైలి జగన్ పై నమ్మకాన్ని మాత్రం సన్నగిల్లేలా చేసాయన్న వాదనే ఎక్కువగా వ్యక్థం అవుతోంది అంటున్నారు పరిశీలకులు.దీనికి తోడు ఆయన కాంగ్రెస్ తో కుమ్ముక్కై వచ్చాడని ఆరోపణలు వెల్తువెత్తడం, మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర విభజనను ఆపకుండా మరింత వేగవంతం చేయడంతో ఆయన ప్రభావం ఏమాత్రం చూపడం లేదన్న భావం ఒకటయితే, జగన్ కూడా విభజనకు లోలోపల అనుకూలమేనా అన్న భావాన్ని ఆయన ప్రత్యర్థులు జనాల్లోకి తీసుకువెల్లడానికి దోహదం చేసిందంటున్నారు. ఆయన రాకపోతే షర్మిల సమైక్య శంఖారావం ప్రజల్లో ఇంకా కొనసాగేది, ఆమో శంఖారావానికి ప్రజల మద్దతు కూడా బాగానే లభిస్తోంది.
జగనన్న పై దర్యాప్తు పూర్తయినా ఆయనకు బెయిల్ రాకుండా కాంగ్రెస్, టిడిపి అడ్డుకుంటోందన్న ప్రచారం చేసే అవకాశం కూడా ఉండేది, అది నిజమేనన్న భావాన్ని కల్పించే అవకాశం ఉండేది. అలా కాక జగన్ రావడం, ఆయన రాష్ట్ర విభజన ఆపడంలో ఫెయిల్ అవుతుండడం, మరో వైపు షర్మిల ను జనాల్లోకి వెల్లకుండా ఆపడం, జగన్ కు షరతుల కారణంగా హైదరాబాద్ వదిలి సీమాంద్రలోకి వెల్లే వీలులేక పోవడం వంటివన్ని పార్టీకి ఆయన రాక మైనస్ చేసిందంటున్నారు. అయితే సీమాంద్రుల మనసు చూరగొనే నాయకుడు ఎవరవుతారన్న పోటీ నడుస్తున్న నేపథ్యంలో జగన్ బాగా కష్టపడితే మాత్రం పలితం దక్కవచ్చన్న ఆశాభావం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కేరళలో తెలుగు సినిమా షూటింగుపై దాడి
కేరళ: తెలుగు సినిమా షూటింగ్ యూనిట్ సభ్యులపై కేరళలో దాడి జరిగింది. సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లు తెరకెక్కుతున్న ‘రా రా కృష్ణయ్య' చిత్రం షూటింగ్ కేరళలోని అల్లెప్పీ సమీపంలోని తిరువల్లాలో ఓ దేవాలయంలో జరుగుతుండగా శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాడిచేసిన వ్యక్తులు లోకల్‌గా ఉండే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) మద్దతుదారులని తెలుస్తోంది.
ఈ విషయాన్ని సందీప్ కిషన్ తన మైక్రో బ్లాగింగ్ సైట్ ద్వారా వెల్లడించారు. కేరళ పత్రికల్లో కూడా ఈ దాడి విషయం ప్రచురితమైంది. ‘అధికారుల నుంచి అనుమతి తీసుకుని మేము షూటింగ్ మొదలు పెట్టాం. కొందరు వ్యక్తులు అక్కడి వచ్చి గొడవ చేయడం ప్రారంభించారు. పర్మిషన్ ఉందని చెప్పినా వారు వినలేదు. మా దర్శకుడు మహేష్‌పై దాడి చేసారు.లోకల్ మేనేజర్ 57 ఏళ్ల కబీర్‌పై దాడి చేసారు. చివరకు మా దర్శకుడి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకుని వెళ్లి పోయారు' అని సందీప్ కిషన్ తెలిపారు. దాడి చేసిన వ్యక్తులు మతపరమైన ఉద్దేశాలతోనే వచ్చినట్లు తెలుస్తోంది. హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ...‘దేవాలయంలో ఎవరూ ఎలాంటి తప్పు చేయలేదు. యూనిట్ సభ్యులంతా పాదరక్షలు బయటే విడిచి వచ్చాం. కానీ వారు వచ్చిన ఉద్దేశ్యం వేరు. కావాలనే దాడి చేసారు' అని వెల్లడించారు.
మహేష్ బాబు బార్య మళ్లీ వస్తోంది
టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు బార్య నమ్రతా శిరోద్కర్ మళ్లీ వెండితెరపైకి వస్తోంది. ఒకప్పటి మిస్ ఇండియానే కాదు తన నటన, అందచందాలతో సినిమా రంగాన్ని ఓ ఊపు ఊపిన హీరోయినే.అయితే ఆమె మహేష్ బాబు ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయింది. కుటుంబజీవితానికే పరిమితమై పోయింది. ఏదైనా మహేష్ బాబు సినిమా ఫంక్షన్లలో కనపడడం తప్ప ఆమె అంతగా బాహ్యప్రపంచంలో కనిపించలేదు.
కారణం మహేష్ బాబుది కూడా బిజినెస్ మైండ్ కాకపోవడం తో బార్యకు రిస్క్ ఇవ్వలేదన్న టాక్ ఉంది. అయితే శ్రీదేవి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ తో మళ్లీ వెండితెరపైకి రావడంతో నమ్రత కూడా మళ్లీ తన టాలెంట్ చూపించుకోవాలని డిసైడ్ అయిందంటున్నారు. మహేష్ బాబు కూడా ఈ విషయం చెప్పడంతో అది నిజమేనని తేలిపోయింది.
అమ్మ కోసం ముంబైలో చివరి టెస్టు: సచిన్
న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను ముంబైలోనే జరపాలని భారత క్రికెట్ నియంత్రణ మండలిని కోరిన విషయం తెలిసిందె. అయితే ఇందుకు ఓ ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ జీవితానికి స్వస్తి పలుకబోయే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ తిలకించేందుకు తన తల్లి రజిని ముంబైలో మ్యాచ్ జరిగితే హాజరవుతుందనే ఆలోచనతోనే సచిన్ బిసిసిఐకి విజ్ఞప్తి చేశారు. సచిన్ టెండూల్కర్ కోరిక మేరకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన 200వ టెస్టును నిర్వహించేందుకు బిసిసిఐ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. చివరి మ్యాచ్‌కు తన తల్లి హాజరై వీక్షించడం తనకు గర్వంగా ఉంటుందని సచిన్ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా సచిన్ టెండూల్కర్ తన 199వ టెస్ట్ మ్యాచ్‌ను కోల్‌కతా ఈడెన్ గార్డెన్ స్టేడియంలో, ఆ తర్వాత 200వ టెస్ట్ మ్యాచ్‌ను అతనికి ఇష్టమైన ముంబై వాంఖడే స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం.
సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవితాన్ని ప్రారంభించిన వాంఖడే స్టేడియంలోనే తన తల్లి సమక్షంలో తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకనున్నారు. తనను ప్రోత్సహించిన పలువురు ప్రముఖులు, ముంబై ప్రజల మధ్య తన చివరి మ్యాచ్‌ను ఆడనుండడం తనకు సంతోషన్నిచ్చే అంశంగా సచిన్ భావిస్తున్నట్లు సమాచారం.
ముని 3 : రాఘవ్ లారెన్స్‌కు గాయాలు
హైదరాబాద్: కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ గాయ పడ్డాడు. తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ముని-3 : గంగా' షూటింగు కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డాక్టర్లు అతనికి కంప్లీట్‌గా 3 నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ కాన్సిల్ అయింది.
ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ‘కాంచన' వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని గతంలో బెల్లంకొండ సురేష్ తెలుగు అనువాద హక్కులు దక్కించుకుని భారీ లాభాలు పొందారు.ఈ నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ ‘ముని-3' చిత్రానికి చేయడానికి ముందుకు వచ్చాడు బెల్లకొండ. లారెన్స్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించే ‘ముని-3'లో తాప్సీ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా గురించి నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...‘కాంచన లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బేనర్లో లారెన్స్ తో చేస్తున్న ‘ముని-3' సబ్జెక్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. హీరోగా, దర్శకుడిగా లారెన్స్ ముని-3 మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు' అన్నారు.
రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.
నేను ఎవరినీ చంపలేదు, బ్యాన్ ఎందుకు: జ్వాలా గుత్తా
హైదరాబాద్: సంక్షోభ సమయంలో తనకు మద్దతు నిలిచినవారందరికీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆమె ఉత్సాహంగా కనిపించారు. తాను ఎవరినీ చంపలేదని, తాను మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని, ఎందుకు తనపై జీవిత కాలం నిషేధం విధించారని ఆమె అన్నారు. తన పక్షాన హైకోర్టు ఆదేశాలు వెలువడడం ఎంతో సంతోషంగా ఉందని, తనను ఆడడానికి అనుమతించినందుకు ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. బ్యాడ్మింటన్ ఆడడం తప్ప తాను వేరేది ఏదీ చేయలేదని ఆమె అన్నారు. తాను బ్యాడ్మింటన్ ఆడుతానని, దేశానికి గౌరవాన్ని తెస్తానని, ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేస్తానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తన డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్పకు, తన కోచ్‌లకు జ్వాలా ధన్యవాదాలు తెలిపారు. తాను క్లీన్ స్పోర్ట్స్ ఇండియాకు, అశ్వినీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె అన్నారు. తనను మాత్రమే కాకుండా అశ్వినిని కూడా డెన్మార్క్ ఓపెన్ టోర్నమెంట్‌కు అనుమతించలేదని, తన వల్ల అశ్విని తీవ్రమైన ఒత్తిడికి గురైందని జ్వాలా అన్నారు. తనను అర్థం చేసుకుని అశ్విని తన పక్కన నిలిచిందని చెప్పారు. అది తనకు ఎంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు. విమల్ కుమార్ సారుకు, ఆరిఫ్ సారుకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేనని ఆమె అన్నారు. తన మిత్రులకు, తనకు మద్దతిచ్చినవారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఆన్‌లైన్ సందేశాలు కూడా తనకు పోరాటం చేయడానికి శక్తిని ఇచ్చాయని అన్నారు
శృతిహాసన్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తిన బన్నీ
ఏదో పని మీద ముంబై వెళ్ళిన బన్నీ పనిలో పనిగా, శృతి హాసన్‌ని కూడా కలిశాడు. ఇటీవల చెన్నై నుంచి తన నివాసాన్ని ముంబైకి మార్చిన శృతిహాసన్ అకస్మాత్తుగా ఇలా ముంబైలో బన్నీని చూడగానే ఆశ్చర్యపోయిందట. అక్కడతనితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టెర్‌లో పోస్ట్ చేసింది కూడా. పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన తర్వాత శృతిహాసన్‌కు తెలుగులో ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు తెలుగులో ఆఫర్లు వచ్చి పడుతున్నాయట. రవితేజ హీరోగా నటించిన బలుపు సినిమాలో కూడా ఆమె నటించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురైన శృతిహాసన్ ఇటీవలి కాలంలో తెరపై అందాలను ఆరబోయడానికి కూడా వెనకాడడం లేదు.
హైదరాబాద్‌లో కుక్క కాటుపై కేసు: యజమాని అరెస్ట్
నగరంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. మౌలాలిలోని వసంత్ విహార్ కాలనీలో గురువారం ఓ పదేళ్ల బాలికను పెంపుడు కుక్క కరవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఆ పెంపుడు కుక్క యజమానిని శుక్రవారం అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సాయి కిరణ్ తన ఇంట్లో ఓ పెంపుడు కుక్కను పెంచుకుటున్నారు. అతని ఇంటికి ఎదురుగా భారతి అనే మహిళ పిల్లల సంరక్షణ కేంద్రాన్ని నడుపుతోంది. కాగా గురువారం రోజు భారతి కూతురు సత్య అతిథి కేంద్రం ఎదుట రోడ్డుపై ఉండగా ఆ కుక్క ఆమెను కరిచింది. గాయాలపాలైన బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెంపుడు కుక్క యజమాని సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ 298(నిర్లక్ష్య ప్రవర్తన) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
శ్రీహరి మరణంపై బాలీవుడ్ బలుపు వేషాలు
తను టాలీవుడ్‌లో ఓ సీనియర్ యాక్టెర్..స్వయంకృషితో ఎదిగిన ఫిల్మి రియల్ స్టార్, తనే శ్రీహరి. అశేష జనాభిమానం ఉన్న స్టార్ యాక్టర్ శ్రీహరి మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకు తీరని లోటును మిగిల్చింది. చేసుకుంటున్న గొప్పలను ఏనాడు పైకి చెప్పుకోని వ్యక్తిత్వం శ్రీహరిది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న తరహా వర్గం నటులకు ఆధరణ తక్కువుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఇబ్బందుల్లోనూ, అవకాశాల లేమితోనూ, ఆధరణ కరువై ఉంటారు. అలాంటి వాళ్ళకు శ్రీహరి ఓ దేవుడు. ఎంతో మంది నటులకు నేన్నాను అని భరోస ఇచ్చి వెన్నుదన్ను ఉండి, వారి బాధల్లోనూ, సంతోషంలోనూ ఒకడిగా కలిసి మెలిగేవాడు.
తన స్వయం కృషితో అంచలెంచెలుగా ఎదిగి, టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైనా మార్కుతో, ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయి ఆత్మీయ ప్రేమాభిమానాన్ని చూరగొన్న ఏకైన నటుడు శ్రీహరి. బాలీవుడ్‌లో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న రాంబో రాజ్‌కుమార్ మూవీ షూటింగ్‌లో ప్రత్యర్ధి పాత్రగా లీడ్ రోల్ చేస్తున్న శ్రీహరికి, షూటింగ్ సమయంలో అశ్వస్థతకు గురికావడం, ఆ తరువాత వెంటవెంటనే ఆరోగ్యం క్షీణించడం, ఆ తరువాత మృత్యువాత పడటం యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీను కలచివేసింది.శ్రీహరి ఇకలేరు అనే వార్త ఆంద్రప్రదేష్‌కు చేరగానే ప్రతి ఒక్కరి మనస్సు శోకసముద్రంలా తల్లడిల్లిపోయింది. ఒక్క ఇండస్ట్రీ వారు అనే బేధం లేకుండా అన్ని రంగాల నుండి అందరూ శ్రీహరిని చివరిసారిగా చూడటానికి ఎక్కడెక్కడినుండో తరలి వచ్చారు. ఇదిలా ఉంటే, ఈ విషయం బాలీవుడ్ యాక్టెర్స్‌కి చీమైనా కుట్టినట్టు లేదు. మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీకు శ్రీహరి గురించి తెలియకపోవచ్చు. కనీసం రాంబోరాజ్‌కుమార్ షూటింగ్ యూనిట్‌లోనూ తోటి యాక్టర్‌కు జరిగిన విషాదంపై ఏ మాత్రం స్పందించలేదు. హీరో షాహిద్‌కపూర్,హీరోయిన్ సోనాక్షి సిన్హా, డైరెక్టర్ ప్రభుదేవా ఎవ్వరూ కూడ జరిగిన విషాదానికి కనీస స్పందన లేదు. సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో రాంబో రాజ్‌కుమార్ మూవీ గురించి ఊధరగొడుతున్న హీరో షాహిద్‌కు, శ్రీహరి మేటర్‌ను చాలా లైట్ తీసుకున్నాడు. పైగా ఈ విషయం బయటకు తెలిస్తే మూవీపై నెగిటివ్ టాక్ వస్తుందేమో అని కూడ జాగ్రత్త పడ్డట్టు ఓ లీడింగ్ టాబ్లాయిడ్ కథనం వెల్లడించింది. తోటి కళాకారుడిని గౌరవించలేని బాలీవుడ్ ఇండస్ట్రీపై, మన సౌత్ ఇండస్ట్రీ వల్లమాలిన అభిమానాన్ని ఎందుకు చూపుతుందో అర్ధం కాదు. ఇప్పటి వరకూ కూడ శ్రీహరి విషయంపై రాంబోరాజ్‌కుమార్ చిత్ర యూనిట్ అఫిషియల్‌గా స్పందించకపోవడంపై బాలీవుడ్‌లోనూ నిరసనలు వెల్లువడుతున్నాయి.
Subscribe to:
Posts (Atom)






















