Saturday, 12 October 2013

తెలంగాణలో మార్పులేదు – సీమాంద్రకు ప్యాకేజీనే.



ఇంత ఆందోళలనలు జరుగుతున్నా, హైదరాబాద్ కోసమే హంగామా చేస్తున్నా సరే మొదట ఇవ్వాలని నిర్ణయించిన తెలంగాణ విషయంలో మార్పులేదట. దీనికోసం సీమాంద్రులను మెప్పించడానికి ఓ ప్యాకేజిని మాత్రం ప్రకటిస్తారట, ఈ విషయంలో కాంగ్రెస్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయిందని విశ్వసనీయ సమాచారం. ఈమేరకు పిటిఐ కూడా ఈ వార్తను ప్రాధాన్యంగా పేర్కొంది. అయితే రాజధాని అభివృద్ది కోసం ప్యాకేజిని అనుమతించబోమని, హైదరాబాద్ శాశ్వత ఉమ్మడి రాజధానిగా ఉండాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధుల్లో బలమైన వాదన ఉన్న విషయం తెలిసిందే.

 శాశ్వత రాజధాని, లేదా కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ ఉండాలన్న ప్రతిపాదనపై కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా వైదొలగిందని, హైదరాబాద్ లేని తెలంగాణ ను తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని, అలా చేస్తే తెలంగాణలో మునుపటి కంటే ఎక్కువ ఉద్యమం లేస్తుందన్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ కు ఖచ్చితమైన సమాచారం ఉందని తెలిసింది. దీంతో ఆ విషయంపై, హైదరాబాద్ పై పెట్టుకున్న రెండు మూడు ఆప్షన్లపై ఇక కాంగ్రెస్ వైదొలగింది అంటున్నారు పరిశీలకులు.

 అయితే దీనిని సీమాంద్ర వారు ఆమోదించేందుకు కళ్లు చెదిరే ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందని కాంగ్రెస్ భావిస్తోందట. కొత్త రాజధానిని ఆధునిక రాజధానిగా అభివృద్ది చేస్తామని స్పష్టమైన హామీతో పాటు, ఊహించనంత రీతిలో ఆర్థిక ప్యాకేజి ప్రకటించడం ఒక్కటే మార్గమని, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ కూడా సూచించిందని, అందుకే ఆ వైపుగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందంటున్నారు. దీనిపై సీమాంద్ర వాదులు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో ఎదిరి చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment