Saturday, 12 October 2013

శ్రీహ‌రి మ‌ర‌ణంపై బాలీవుడ్ బ‌లుపు వేషాలు


త‌ను టాలీవుడ్‌లో ఓ సీనియ‌ర్ యాక్టెర్‌..స్వయంకృషితో ఎదిగిన ఫిల్మి రియ‌ల్ స్టార్, త‌నే శ్రీహ‌రి. అశేష జ‌నాభిమానం ఉన్న స్టార్ యాక్టర్ శ్రీహ‌రి మ‌ర‌ణం టాలీవుడ్ ఇండ‌స్ట్రీకు తీర‌ని లోటును మిగిల్చింది. చేసుకుంటున్న గొప్పలను ఏనాడు పైకి చెప్పుకోని వ్యక్తిత్వం శ్రీహ‌రిది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చిన్న త‌ర‌హా వ‌ర్గం న‌టుల‌కు ఆధ‌ర‌ణ త‌క్కువుగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ ఇబ్బందుల్లోనూ, అవ‌కాశాల లేమితోనూ, ఆధ‌ర‌ణ క‌రువై ఉంటారు. అలాంటి వాళ్ళకు శ్రీహ‌రి ఓ దేవుడు. ఎంతో మంది న‌టుల‌కు నేన్నాను అని భ‌రోస ఇచ్చి వెన్నుద‌న్ను ఉండి, వారి బాధ‌ల్లోనూ, సంతోషంలోనూ ఒక‌డిగా క‌లిసి మెలిగేవాడు. త‌న స్వయం కృషితో అంచ‌లెంచెలుగా ఎదిగి, టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌దైనా మార్కుతో, ప్రేక్షకుల మ‌న‌స్సులో చిర‌స్థాయి ఆత్మీయ ప్రేమాభిమానాన్ని చూర‌గొన్న ఏకైన న‌టుడు శ్రీహ‌రి. బాలీవుడ్‌లో ప్రభుదేవా ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న రాంబో రాజ్‌కుమార్ మూవీ షూటింగ్‌లో ప్రత్యర్ధి పాత్రగా లీడ్ రోల్ చేస్తున్న శ్రీహ‌రికి, షూటింగ్ స‌మ‌యంలో అశ్వస్థత‌కు గురికావ‌డం, ఆ త‌రువాత వెంట‌వెంట‌నే ఆరోగ్యం క్షీణించ‌డం, ఆ త‌రువాత మృత్యువాత ప‌డ‌టం యావ‌త్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీను క‌ల‌చివేసింది.

శ్రీహ‌రి ఇక‌లేరు అనే వార్త ఆంద్రప్రదేష్‌కు చేర‌గానే ప్రతి ఒక్కరి మ‌న‌స్సు శోక‌స‌ముద్రంలా త‌ల్లడిల్లిపోయింది. ఒక్క ఇండ‌స్ట్రీ వారు అనే బేధం లేకుండా అన్ని రంగాల నుండి అంద‌రూ శ్రీహ‌రిని చివ‌రిసారిగా చూడ‌టానికి ఎక్కడెక్కడినుండో త‌ర‌లి వ‌చ్చారు. ఇదిలా ఉంటే, ఈ విష‌యం బాలీవుడ్‌ యాక్టెర్స్‌కి చీమైనా కుట్టిన‌ట్టు లేదు. మొత్తం బాలీవుడ్ ఇండ‌స్ట్రీకు శ్రీహ‌రి గురించి తెలియ‌క‌పోవ‌చ్చు. క‌నీసం రాంబోరాజ్‌కుమార్ షూటింగ్ యూనిట్‌లోనూ తోటి యాక్టర్‌కు జ‌రిగిన విషాదంపై ఏ మాత్రం స్పందించ‌లేదు. హీరో షాహిద్‌క‌పూర్‌,హీరోయిన్ సోనాక్షి సిన్హా, డైరెక్టర్ ప్రభుదేవా ఎవ్వరూ కూడ జ‌రిగిన విషాదానికి క‌నీస స్పంద‌న లేదు. సోషియ‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్స్‌లో రాంబో రాజ్‌కుమార్ మూవీ గురించి ఊధ‌ర‌గొడుతున్న హీరో షాహిద్‌కు, శ్రీహ‌రి మేట‌ర్‌ను చాలా లైట్ తీసుకున్నాడు. పైగా ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే మూవీపై నెగిటివ్ టాక్ వ‌స్తుందేమో అని కూడ జాగ్రత్త ప‌డ్డట్టు ఓ లీడింగ్ టాబ్లాయిడ్ క‌థ‌నం వెల్లడించింది. తోటి క‌ళాకారుడిని గౌర‌వించ‌లేని బాలీవుడ్ ఇండ‌స్ట్రీపై, మ‌న సౌత్ ఇండ‌స్ట్రీ వ‌ల్లమాలిన అభిమానాన్ని ఎందుకు చూపుతుందో అర్ధం కాదు. ఇప్పటి వర‌కూ కూడ శ్రీహ‌రి విష‌యంపై రాంబోరాజ్‌కుమార్ చిత్ర యూనిట్ అఫిషియ‌ల్‌గా స్పందించ‌క‌పోవ‌డంపై బాలీవుడ్‌లోనూ నిర‌స‌న‌లు వెల్లువ‌డుతున్నాయి.

No comments:

Post a Comment