మనీలా: ఫిలిప్పీన్స్‌లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జశ్వీందర్‌సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో జశ్వీందర్ సోదరుడు అమరీందర్‌సింగ్ కూడా కారులోనే ఉన్నారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు జశ్వీందర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా బుల్లెట్ గాయాలైన అతనిని బాటిక్ నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. అమరీందర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.
Wednesday, 2 October 2013
ఫిలిప్పీన్స్‌లో భారతీయుడి కాల్చివేత
మనీలా: ఫిలిప్పీన్స్‌లో దుండగులు జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించాడు. బటాక్ నగరంలో నివసించే జశ్వీందర్‌సింగ్ (38) మంగళవారం కారులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ సమయంలో జశ్వీందర్ సోదరుడు అమరీందర్‌సింగ్ కూడా కారులోనే ఉన్నారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు జశ్వీందర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా బుల్లెట్ గాయాలైన అతనిని బాటిక్ నగరంలోని ఒక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు చెప్పారు. అమరీందర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు.
శృతిహాసన్ లేడీ విలన్ కాదట
చెన్నై : జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్యా వస్తావయా' సినిమాలో శృతిహాసన్ నెగిటివ్ పాత్ర పోషించలేదని దర్శకుడు హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఆమె అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమాలో శృతి నెగిటివ్ పాత్రలో నటించిందని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు.
రామయ్యా వస్తావయాలో శృతి ప్రత్యేక పాత్ర పోషించిందని హరీష్ తెలిపారు. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమా గబ్బర్ సింగ్ లోనూ కమల్ తనయ నటించింది. తాజా చిత్రంలో ఎన్టీఆర్ సరసన కనిపించనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా మరో హీరోయిన్ సమంత నటించింది. నిర్మాత దిల్ రాజు. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. కాగా శృతిహాసన్.. రామ్ చరణ్ సరసన నటించిన 'ఎవడు' సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ రెండు సినిమాల కోసం శృతి ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
వృద్ధి రేటు 4.7 శాతమే
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) మరింతగా కుదించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు వృద్ధిరేటును 5 శాతానికి దిగువకు కుదించాయి. ఈ నేపథ్యంలో ఎడిబి ఆసియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్ 2013 నివేదికలో తాజాగా దీన్ని 4.7 శాతానికి కుదించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో భారత ఆర్థిక రంగం 4.7 శాతం మించి వృద్ధిని సాధించలేకపోవచ్చునని తేల్చి చెప్పింది. గతంలో ఆరు శాతంగా అంచనా వేసిన ఎడిబి ఒక్కసారిగా వృద్ధిరేటును 4.7 శాతానికి తగ్గించడం ఆందోళనకరమనే చెప్పాలి. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జిడిపి వృద్ధిని దృష్టిలో ఉంచుకుని వార్షిక వృద్ధిని కూడా కుదించినట్టు బ్యాంకు తన నివేదికలో తెలిపింది.రూపాయి పత నం, విదేశీ నిధులు వెనక్కి మరలటం, వ్యవస్థాపరమైన ఇబ్బందులు భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావం చూపుతున్నట్టు పేర్కొంది. అయితే 2014-15లో వృద్ధిరేటు 5.7 శాతం ఉండవచ్చునని అంచనా వేసింది. ఇది కూడా గతంలో ప్రకటించిన అంచనా 6.5 శాతం కన్నా తక్కువే. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొని ఉన్న అనిశ్చిత పరిస్థితులు ఆర్థిక సంస్కరణల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయని ఎడిబి చీఫ్ ఎకనామిస్ట్ చాంగ్‌యంగ్ రీ అన్నారు. గత నెలలో ప్రధాని ఆర్థిక సలహా మండలి(పిఎంఇఎసి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భార త ఆర్థిక వృద్ధి రేటును 6.4 నుంచి 5.3 శాతానికి తగ్గించగా, ఆర్‌బిఐ 5.7 నుంచి 5.5 శాతానికి తగ్గించింది. అయితే భారత ప్రభుత్వం వృద్ధిని పట్టాలెక్కించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నదని, ఇటీవల జపాన్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 1500 కోట్ల డాలర్లనుంచి 5000 కోట్ల డాలర్లకు పెంచాలని తీసుకున్న నిర్ణయం ఈ కోవలోనిదే అని ఎడిబి తెలిపింది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం ద్వారా రూపాయికి స్థిరత్వాన్నిచ్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో యత్నిస్తోందని, వీటితో పాటు స్థూల ఆర్థిక ప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన అవసరం కూడా ఉందని పేర్కొంది.
సిద్ధమైన తెలంగాణ నోట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. కిరణ్ ధిక్కారణ ధోరణితో ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో సీడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా హైకమాండ్ తెలంగాణ నోట్‌ను సిద్ధం చేసింది. 22 పేజీల తెలంగాణ నోట్‌ను కేంద్ర తయారు చేసింది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయగా, సీమాంధ్ర రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీని నియమించన్నుట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినేట్ భేటీ అయి తెలంగాణ నోట్‌పై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినేట్ ఆమోదం తర్వాత తీర్మానం కోసం అసెంబ్లీకి తెలంగాణ నోట్ వెళ్లనుంది.
5 కోట్ల ఆదాయంతో నితిన్
మొన్నటి వరకూ నితిన్ పని అయిపోయిందన్న టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇప్పుడు మాట మార్చి నితిన్‌ను గ్రేట్ అంటుంది. ఇదంతా నితిన్ బిజినెస్ వ్వవహారంలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికిదారేది మూవీ నైజాం రైట్స్‌ను 13 కోట్లకు నితిన్ కొన్నాడు. పవన్‌పై ఎంత అభిమానం ఉన్నా, ఇంత అమౌంట్‌తో నైజాం రైట్స్ తీసుకోవడం అంటే నితిన్ ఖచ్ఛితంగా నష్టపోక తప్పదని అందరూ ఆనాడు చెప్పినవాళ్ళే. ఏ మూవీకైనా నైజాం రైట్స్‌ను తొమ్మిది నుండి పదకొండు కోట్లకు క్లోజ్ చేస్తారు. ఇంతకు మించి నైజాం రూట్స్ తీసుకోవడం అంటే సాహసమే. ఆ లెక్కలన్నింటిని బ్రేక్ చేసి కేవలం పవన్ కోసం, అత్తారింటికిదారేది మూవీను 13 కోట్లకు కొనుక్కున్నాడు.అలాగే వైజాగ్‌లోనూ పవన్ మూవీకు నితిన్ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. మొత్తంగా పవన్ మూవీకి 15 కోట్ల వరకూ డిస్ట్రిబ్యూషన్ మీద పెట్టుబడి పెట్టాడు. ఆ మధ్య అత్తారింటికిదారేది మూవీ రిలీజ్‌పై డైలమా ఉండటంతో నితిన్ ఈ దెబ్బతో అవుట్ అని ఫిల్మ్ నగర్‌లోనూ తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. కాని ఈ మూవీ రిలీజ్ తరువాత ఆ అంచనాలు తలక్రిందులై మూవీ లాభాల బాట పట్టింది. ఒక్క నైజాంలోనే అయిదు రోజుల కలెక్షన్స్ 10.5 కోట్లను వసూల్ చేసింది. మొదటి వారం కలెక్షన్స్ 13 కోట్లను మించి ఉంటుందని ట్రేడ్స్ అంచనా. అలాగే వైజాగ్‌లో కలెక్షన్స్ విజృంబించాయి. ఏ విధంగా చూసుకున్నా నితిన్ పెట్టిన పెట్టుబడికి అయిదు కోట్ల లాభాలు ఖాయం అని అంటున్నారు.
సీఎం సొంత పార్టీ పెట్టడం ఖాయమే!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. కొత్త పార్టీ పెట్టబోతున్నాడనే ప్రతిపాదనను ఆయనైతే కొట్టి పడేస్తున్నాడు కానీ.. ఆయన భవిష్యత్తు ప్రణాళిక అయితే.. కొత్త పార్టీనే అని విశ్లేషకులు అంటున్నారు. అధిష్టానంపై విమర్శలు గుప్పించడం, రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్నే వ్యతిరేకిస్తూ మాట్లాడటాన్ని బట్టి ముఖ్యమంత్రి ఏదో ప్రణాళికలో ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అవి కాంగ్రెస్ అధిష్టాన వ్యూహంలో భాగమనేని అనుకున్నారంతా.అయితే ఇప్పుడు అధిష్టానం వైపు నుంచి కిరణ్ మీద ఆగ్రహం కనిపిస్తోంది. కిరణ్ రాజీనామా చేయాలని అనుకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని కేంద్ర నాయకత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. కిరణ్ తన దారి తాను చూసుకునే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను పక్కనపెడుతోందని అర్థం చేసుకున్న కిరణ్.. ఇక తనకు ఆ పార్టీలో మనుగడ కష్టమనే అభిప్రాయానికి వచ్చేశారని.. సొంతంగా పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారని సీఎం సన్నిహిత మిత్రులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సమైక్య వాదాన్ని బలంగా వినిపించే నాయకుడు, పార్టీ కోసం సీమాంధ్రులు ఎదురుచూస్తున్నారని.. ఈ స్థానాన్ని తనే తీసుకోవాలని అనుకుంటున్నాడట కిరణ్ రెడ్డి. పార్టీ పెట్టడం వల్ల గొప్ప స్థాయికి చేరుకోకపోయినా.. కాంగ్రెస్ లో మిగిలిపోవడం కన్నా మంచి పరిస్థితే ఉంటుందని కిరణ్ భావిస్తున్నాడట. దీంతో కిరణ్ పార్టీ పెట్టడం ఖాయమనే అభిప్రాయానికి రావొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఫ్లాష్ న్యూస్ : ఏపి సిఎం గా ఆనం లేదా రఘువీరా

అంతే కాదు కిరణ్ సామాజిక వర్గాన్ని కాదని మరో సామాజిక వర్గం నేతలు అంటే బొత్స, చిరంజీవి వంటి వారిని పెడితే కూడా సంకేతాలు మరో రకంగా జారీ అవుతాయని కూడా అధిష్టానం భావిస్తోందట. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి లేదా అనంతపూర్ జిల్లాకు చెందిన రఘువీరా రెడ్డిలలో ఒకరిని సిఎం గా నియమించాలన్న ఆలోచనకు అధిష్టానం వచ్చిందని సమాచారం. ఇది వీలు కాని పక్షంలో రాష్ట్రపతి పాలనైనా విధిస్తారని కిరణ్ ను మాత్రం సిఎం గా కొనసాగించరని స్పష్టం అవుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో.
రాంచరణ్ ను అసహ్యించుకున్న క్రిష్ణా

ఇది నిజమా, అబద్దమా తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. విషయమేమిటంటే మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ క్రిష్ణా రాంచరణ్ ను అసహ్యించుకున్నాడట, ఆయనతో నేను సినిమా తీయడమేమిటి, అస్సలు కుదరదు అంటూ డైరెక్టర్ క్రిష్ణ వంశీకి చెప్పేసాడట. క్రిష్ణ వంశీ... క్రిష్ణా, వెంకటేష్, రాంచరణ్ లతో మల్టీ స్టారర్ సినిమా తీస్తున్నాడన్న విషయం టాలీవుడ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పట్లో ఓసారి ఈ సినిమాలో రాంచరణ్ తో నటించడానికి వెంకటేష్ నో చెప్పాడని వార్తలు వినిపించాయి. ఇప్పుడు పెద్ద మనిషి క్రిష్ణ కూడా ఆ మాట చెప్పాడంటే చెర్రీ పరిస్థితి చెత్తచెత్త అయినట్టే అంటూ టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి.
పవన్ కల్యాన్ ను కలిపేసుకున్న టీడీపీ ఫ్యాన్స్!
ఈ మధ్య తెలుగు సినిమా స్టార్లను ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ ఫ్లెక్సీలకు ఎక్కించేస్తున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, ప్రభా స్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులను వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లు తమ పోస్టర్లపైకి ఎక్కించేశారు. ఈ హీరో లు తమవారేనని అంటున్నారు జగన్ అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ కల్యాన్ ను సొంతం చేసుకుంది టీడీపీ!తాజాగా అత్తారింటికి దారేదీ సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తెలుగుదేశం అభిమానులు. ఈ ఫ్లెక్సీలపై టీడీపీ అధినేత చంద్రబాబు బొమ్మ, నందమూరి బాలకృష్ణ బొమ్మ, పవన్ కల్యాన్ బొమ్మలున్నాయి. ఈ విధంగా పవన్ ను టీడీపీ కార్యకర్తలు తమవాడిని చేసుకున్నారు! ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. గతంలోనే పవన్ కల్యాన్ టీడీపీలో చేరబోతున్నాడనే వార్తలు వచ్చాయి. పవన్ టీడీపీలో చేరడం ఖాయమని, ఆయన మచిలీ పట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే వాటికి బ్రేక్ పడి చాలా కాలమే అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం కార్యకర్తలు.. పవన్ కల్యాన్ గురించి చర్చకు తెరతీశారు! మరి దీనిపై మెగాఫ్యామిలీ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో!
'దూసుకెళ్తా'లో రవితేజ పాత్ర ఏంటి?
వీరు పోట్ల దర్శకత్వంలో మంచు విష్ణు నటిస్తోన్న దూసుకెళ్తా చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఎప్పుడూ లేనిది ఈసారి విష్ణు సినిమా మీద అంచనాలు కాస్త బాగానే ఉన్నాయి. షూటింగ్ స్టిల్స్, ట్రెయిలర్ వంటివి ఇంటరెస్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అవడమే అందుక్కారణం.
దూసుకెళ్తా సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మంచు ఫ్యామిలీ. కథ దగ్గర్నుంచి పబ్లిసిటీ కార్యక్రమాల వరకూ ప్రతిదానిలోనూ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. విష్ణు కూడా సిక్స్ ప్యాక్ పెంచాడు. డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ ని అదరగొట్టేశాడు. ఆ స్టిల్స్ చూస్తే, నిజంగానే ఆ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని అనిపిస్తోంది. ఇక ట్రెయిలర్లో బ్రహ్మానందం కామెడీ చూస్తుంటే, పొట్టలు పగిలిపోవడం ఖాయమని అర్థమవుతోంది. వీటికి తోడు స్లిమ్ గా అయిపోయిన హన్సిక నాజూకు అందాలు ప్రేక్షక హృదయాలను కవ్విస్తున్నాయి.ఇవన్నీ కలిసి దూసుకెళ్తా మీద అంచనాలు పెంచేశాయి. అయితే వీటన్నిటితో పాటు ఈ చిత్రానికి మరో ఆకర్షణ ఉంది. అది... రవితేజ వాయిస్ ఓవర్. విష్ణు చిన్నతనంలో వచ్చే సన్నివేశాలకు కాస్త వెటకారంగా, హాస్యం పుట్టేలా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిన అవసరం ఉందట. అందులో రవితేజను మించినవాళ్లు లేరు కాబట్టి అతడితోనే చెప్పించాలని డిసైడ్ అయ్యారట. మన మాస్ మహరాజా కూడా అందుకే సంతోషంగా ఎస్ అన్నాడట. గతంలో మర్యాద రామన్న చిత్రంలో సైకిల్ కు డబ్బింగ్ చెప్పి అదరగొట్టాడు కదా. ఇందులో అందకంటే అదిరిపోద్ది అంటున్నాడు వీరు పోట్ల!
సునీల్ విశ్వరూపం ముగిసినట్టే
కమెడియన్‌గా సునీల్ కామెడీ ఓ సరికొత్త గిలిగింతలను పెట్టింది ప్రేక్షకులని. తరువాత సునీల్‌కు టైం కలిసొచ్చి హీరోగా కూడ చెలామణి అవుతున్నాడు. అందాలరాముడు,పూలరంగడు,తఢాఖ ఇలా వరుసగా బాక్సాపీస్ వద్ద మినిమం కలెక్షన్స్‌ను కొల్లగొడుతున్న ఈ హీరో, ఎట్ ప్రెజెండ్ నాలుగు,అయిదు మూవీలలో హీరోగా బిజిబిజిగా ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే సునీల్ హీరోగా ఇన్వెస్ట్ చేయటానికి ప్రొడ్యూజర్లు కూడ రెడీగా ఉన్నారు. ఎన్ని ఉన్నా, రిలీజ్ అయిన మూవీల సక్సెస్‌తోనే అప్‌కమింగ్ మూవీల మార్కెట్ ఆధారపడి ఉంటుంది. త్వరలోనే అశ్వినిదత్,మెహర్‌రమేష్ కాంబినేషన్‌లో సునీల్ హీరోగా ఓ మూవీ రెడీ అవుతుంది.అలాగే తనికెళ్ళభరణి దర్శకత్వంలో భక్తకన్నప్పగా సునీల్ నటించడానికి రెడీ అయిపోయాడు. భక్తి పాత్రలు చేయటానకి చాలా మంది హీరోలే భయపడిపోతారు. కాని సునీల్ హీరోగా నిలదొక్కుకుంటున్న ఈ తరుణంలో ఇటువంటి సాహసాలు చేయడం కరెక్ట్ కాదని టాలీవుడ్ అంటుంది. ఏ హీరోకూ మెహార్‌రమేష్‌కి డేట్స్ ఇవ్వటానికి సాహసించలేకపోతుంటే, సునీల్ మాత్రం చాలా ఈజీగా మెహార్‌తో జోడి కడుతున్నాడు. ఒక్క సారి ప్లాప్ పడితే సునీల్ మార్కెట్లో డౌన్ అయినట్టే, ఇక అక్కడనుండి బయటకు రావడం అనేది చాలా కష్టం. అందుకే మంచి కాంబినేషన్స్‌ను సెలక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తపడాలని సునీల్‌కు సన్నిహితులు హితబోధ చేస్తున్నారంట. వింటే హీరోగా కొంత కాలాం ఉంటాడు, లేకపోతే ఎంతో కాలం ఉండడు అని అంటున్నారు.
దాసరి ఉచ్చులో పవన్ !!
దర్శకరత్న దాసరికీ చిరంజీవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. చిరంజీవి కుటుంబం తో తీవ్రంగా విభేదించే దాసరి ఒక బహిరంగ వేదికలో పవన్ కళ్యాణ్ ను పొగడ బోతున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఆదివారం శిల్పకళా వేదికలో జరగబోయే ‘అత్తారింటికి దారేది’ యూనిట్ కృతజ్ఞతా సభలో దాసరినారాయణ రావు కూడా పాల్గొన బోతున్నాడని తెలుస్తోంది.ఈ విషయమై ఈ సినిమా యూనిట్ వారు దాసరిని కూడా ఆహ్వానించారని దానికి దాసరి ఓకె అన్నారని ఫిలింనగర్ టాక్.నిన్న దాసరి ఈ సినిమాను ప్రసాద్ లేబరటరీలో కొంతమంది ప్రముఖులతో కలిసి చూసారని సినిమా చుసిన వెంటనే తన ఆనందాన్ని ఆపుకోలేక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసును పొగడ్తలతో ముంచెత్తి వేసారని అంటున్నారు. అత్తారింటి సినిమా విజయాన్ని ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమ తమ సొంత విజయంగా భావిస్తూ పెద్ద తారల దగ్గర నుంచి చిన్న తరాల వరకు ఈసినిమాను తమ భుజాల పై ఎక్కించుకుని మోస్తున్నారు అన్న విషయం వాస్తవం. ఎప్పుడూ గ్రూపులు గా విడిపోయి ఒకరిపై ఒకరు సటైర్లు వేసుకునే టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ ‘అత్తారింటి’ విజయాన్ని తమ విజయంగా భావిస్తూ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో తనకు నచ్చితే ఆకాశానికి ఎత్తేయడం, నచ్చకపోతే ఆ వ్యక్తి పై భయంకరమైన సెటైర్లు వేసే దాసరి వచ్చే ఆదివారం పవన్ కళ్యాణ్ ను ఏ ఎత్తులో ఆకాశానికి ఎత్తేస్తాడో అంటూ మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ విజయోత్సవ సభకు చిరంజీవి రామ్ చరణ్, అల్లుఅర్జనులలో ఎవరైనా వస్తారా లేకుంటే అన్నీ తానై పవన్ కళ్యాణ్ మెగా హీరోగా ఆ ఫంక్షన్ లో ప్రొజెక్ట్ అవుతాడా అనే అనుమానాలు ఫిలింనగర్ లో వినపడుతున్నాయి. దాసరి పవన్ కళ్యాణ్ ల నూతన ప్రేమానురాగాల స్నేహం టాలీవుడ్ లోని వర్గాల సమీకరణ మార్పుకు సంకేతం కానుందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎదిఎమైనా వచ్చే ఆదివారం జరుగబోయే పవన్ ‘అత్తారిల్లు’ విజయోత్సవ సభలో చాలా ఆ శక్తికర విషయాలు ఉండేలా కనిపిస్తున్నాయి...
ధూమ్-3 సెకండ్ లుక్?
విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ధూమ్-౩. దీనికి సంబంధించి రెండో పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అమీర్ ఖాన్ ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాడు. అమీర్ ఖాన్ బైక్ పై చేసిన స్టంట్స్ ఆసక్తికరంగా ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన లభించడంతో సెకెండ్ లుక్ ను కూడా అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.
సమ్మెలోనే ఉద్యోగులు.. రెండో నెలా జీతాల్లేవు?
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమ్మె చేస్తున్న మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రెండోనెల కూడా వేతనాలు రాలేదు. దీంతో చిరు, మధ్యతరగతి ఉద్యోగుల కుంటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఈనెల దసరా పండుగ కూడా ఉండడంతో జీతాల అకౌంట్ ఉన్న బ్యాంకులను ఆశ్రయించి వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చిన్న, మధ్య తరగతికి చెందిన లక్షన్నర మంది ఉద్యోగులు తమ వేతనాల అకౌంట్ ఉన్న బ్యాంకులను ఆశ్రయించి 18 శాతం వడ్డీపై ఒక నెల వేతనాలను వ్యక్తిగత రుణంగా తీసుకున్నట్లు సీమాంధ్ర ఉద్యోగƒ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఉద్యోగుల జీతాల అకౌంట్లు తమ వద్ద ఉండటంతో బ్యాంకులు కూడా నెల వేతనాన్ని వ్యక్తిగత రుణంగా మంజూరు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు.పది లేదా 12 వాయిదాల్లో తిరిగి చెల్లించేలా ఈ రుణాలను ఉద్యోగులు పొందుతున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ఉద్యోగులు జీతాలు తీసుకోకుండా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 13 నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని ఉద్యోగులందరూ సమ్మెలో పాలుపంచుకుంటున్నారు. జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. జిల్లా ట్రెజరీ డిప్యుటీ డెరైక్టర్లు కూడా గతనెల 23 నుంచి సమ్మెలోకి వెళ్లడంతో 13 జిల్లాల ఖజానా కార్యాలయాల్లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
జీతాల కోసం ఖజానా కార్యాలయాలకు బిల్లులను కూడా సమర్పించలేదు. ఆగస్టు 13 నుంచి సమ్మెలో ఉన్నందున నో వర్‌క నో పే అమలుచేసినప్పటికీ అంతకుముందు పనిచేసిన 12 రోజులకు కూడా సీమాంధ్ర ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఇందుకు కారణం ఉద్యోగులెవరూ బిల్లులను సమర్పించకపోవడమే. అయితే, ఈ జిల్లాల్లో పెన్షనర్లకు మాత్రం పింఛన్ సొమ్ములు అందేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ జిల్లాల్లోని పెన్షనర్లకు ఒకట్రెండు రోజుల్లో పింఛన్ సొమ్ము అందనుంది. ఇక విధుల్లో ఉన్న సీమాంధ్ర జిల్లాల్లోని పోలీసు, న్యాయ విభాగాలకు చెందిన ఉద్యోగులు, అధికారులకు హైదరాబాద్‌లోని ప్రధాన ఖజానా కార్యాలయం ద్వారా జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
మేమంతా మీ వెంటే.. జగన్ విడుదలపై అమెరికాలో సంబరాలు

అనంతరం వైఎస్సార్ యువసేన యూఎస్‌ఏ కమిటీ అధ్యక్షుడు బొంతు నాగిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సేయింట్ లూయీస్‌లో సభను ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రƒ శేఖర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా ప్రసంగించారు. తాము ఆది నుంచి జగన్ వెంటే ఉంటున్నామని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని మేకపాటి ధీమా వ్యక్తం చేశారు. రాజన్న రాజ్యం సాధించే వరకు మద్దతు ఇలాగే కొనసాగాలని గడికోట ఆకాక్షించారు. ఈ సభలో పలువురు సాఫ్‌టవేర్ ఉద్యోగులు మాట్లాడారు. సాఫ్‌టవేర్ నిపుణుడు షేక్ కబీర్ మాట్లాడుతూ.. వైఎస్సార్ వల్లే రాష్ట్రంలోని మైనార్టీల జీవితాల్లో వెలుగులు నిండాయన్నారు. కిరణ్ మలుపు, సి.రంగ , శ్రీకాంత్ జొన్నల తదితర ఉద్యోగులు వైఎస్సార్ సంక్షేమ పథకాలను ప్రస్తావించారు.
ప్రముఖ వైద్యుడు గొండిపల్లి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఒక డాక్టర్‌గా వైఎస్ అందించిన సేవలను కొనియాడారు. జగన్‌లో వైఎస్‌లోని కమిట్‌మెంట్, అంకితభావం, శ్రమించేతత్వం, విజన్ ఉందన్నారు. వైఎస్సార్ యువసేన యూఎస్‌ఏ కమిటీ బొంతు నాగిరెడ్డి మాట్లాడుతూ... ఈ సంబరాలు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సాధించబోయే విజయాలకు ముందస్తు సంకేతమన్నారు. స్థానిక వ్యాపారవేత్త చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ వైఎస్ కుటుంబానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తాటిపర్తి, బి.దినేష్, రవి ఉప్పలపాటి, విజయనాగ ఇందుకూరి, రామకృష్ణ దగ్గుమతి, సాయి తారపరెడ్డి, శివరామరాజు, మురళిరాజు గొట్టిముక్కల, లింగారెడ్డి గన్నపనేని, శ్రీను దగ్గుమతి, వెంకట్ కాట్రగడ్డ, నంద పుప్పల, వంశీరెడ్డి మోపూరు, చందు తారపరెడ్డి, కిరణ్ మలుపూరు, రవికాంత్, విజయకుమార్‌రెడ్డి, వేదనపతిలతో పాటు వందలాది పాలుపంచుకున్నారు. మహిళలు, పిల్లలు, జగన్‌మోహన్‌రెడ్డికి అభినందనలు తెలుపుతూ కేక్ కట్ చేశారు.
కళ్యాణ్ పేరు బాగా అచ్చొచ్చింది...
ఇందులో నా పేరు కళ్యాణ్. నాకు ఎంతో అచ్చొచ్చిన పేరది. ‘ఇష్క్’ ఆడియోకి పవన్‌కళ్యాణ్‌గారొచ్చారు. సినిమా పెద్ద హిట్. ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో కళ్యాణ్‌గారి పాట పెట్టుకున్నాం. ఆ సినిమా పెద్ద హిట్. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందనిపించింది. అందుకే ఈ సినిమాకు ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’ అనే టైటిల్ ఖరారు చేశాం’’ అని నితిన్ అన్నారు. ఆయన కథానాయకునిగా రూపొందుతోన్న చిత్రం ‘కొరియర్‌బాయ్ కళ్యాణ్’. ప్రేంసాయి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సోమసుందరం, రేష్మ నిర్మాతలు. తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ సమర్పిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ -‘‘మనకున్న సెన్సిబుల్ దర్శకుల్లో గౌతమ్‌మీనన్ ఒకరు. ఆయన డెరైక్షన్‌లో నటించలేకపోయినా... ఆయన సంస్థలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది’’ అని చెప్పారు. ‘‘లవ్, రొమాన్స్ కలగలిపిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలో పాటలను, నవంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని గౌతమ్‌మీనన్ తెలిపారు. నితిన్‌కి ఇది హ్యాటిక్ హిట్ అవుతుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేరనేతల ఆర్డినెన్స్ ఉపసంహరణకు కోర్ కమిటీ నిర్ణయం
వితంతు వేషంలో ఎంపీ శివప్రసాద్ నిరసన
తిరుపతి, అక్టోబర్ 2 : సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ సమైక్యవాదుల్లో ఉత్సాహం రేపుతున్న టీడీపీ ఎంపీ శివప్రసాద్ బుధవారం వితంతు వేషంలో నిరసన తెలిపారు. ఈ వేషయంలోనే వెళ్లి గాంధీజీకి నివాళులర్పించారు. అనంతరం విభజనవాదులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు సీమాం«ద్రులతో వియ్యం అందారని గుర్తు చేశారు. సీమాంధ్రకు చెందిన కోడళ్లు, అల్లుళ్లు కావాలని కాని సమైక్యం ఎందుకు వద్దని శివప్రసాద్ ప్రశ్నించారు.త్రివిక్రమ్‌ని చీల్చి చెండాడిన ఛానల్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసి డైరెక్టర్‌గా మారి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకు ఎన్నో ఫ్యామిలి ఎంటర్‌టైనింగ్ మూవీలను, బాక్సాపీస్‌ను షేక్ చేయగల చిత్రాలను అందించాడు. అలాంటిది త్రివిక్రమ్ కెపాసిటి మీదే టెస్టింగ్ జరిగింది ఓ ఛానల్‌లో. రోజు రోజుకి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి పోటీ జరుగుతుందో తెలుసుకోవడం కష్టంగా ఉంది. టి.ఆర్.పిల పరుగుతో ఈ పోటీ అనేది మితిమీరుతుంది, దారి తప్పుతుదని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ అత్తారింటికి దారేది. ఈ మూవీ సక్సెస్‌ను ప్రేక్షకులతో పంచుకోవడానికి త్రివిక్రమ్, సమంత ఓ లీడింగ్ న్యూస్ ఛానల్‌కి వెళ్ళింది.వెంటనే మరో లీడింగ్ ఛానల్ త్రివిక్రమ్‌కి కబురుపెట్టింది. మా ఛానల్‌కి రండి అని. కాని త్రివిక్రమ్ మరోసారి వస్తాను అని చెప్పడంతో వెంటనే అదే రోజు త్రివిక్రమ్ మీద నెగిటివ్ స్టోరిను ఆ ఛానల్ ప్లే చేసింది. పవన్ లేకుండా ఈ మూవీ ఇంత సక్సెస్ అయ్యేదా, ఇందులో డైరెక్టర్ గొప్పదనం ఏంటి, జల్సా,ఖలేజా,అతడు మూవీలను ప్లాప్ చేసిన త్రివిక్రమ్‌కు స్టార్ హీరో లేకుండా హిట్టు సాధ్యమా అంటూ చెప్పుకోని రీతిలో నెగిటివ్ స్టోరీను వేశారు. ఆ ప్రొగ్రామ్‌ను చూస్తున్న ఎవరైనా ఆ మాటలను నమ్మలేని విధంగా ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ స్టోరి వెనుక ఉన్న అసలు కథను తెలుకొని ఆ ఛానల్‌కు వెళ్ళవద్దని కొంత మంది సెలబ్రిటలకు సమాచారం అందించారని తెలిసింది.
పవన్ క్షమాపణలను బయటపెట్టిన అలీ
పవన్ చెప్పిన క్షమాపణల వెనుక ఉన్న అసలు విషయాన్ని హాస్యనటుడు అలీ బయటపెట్టాడు. పవన్ మంచి మితృలన్న సంగతి అందరికి తెలిసిందే, అంతే కాదు పవన్ కూడా అలీని సోదరుడుగా భావిస్తాడు, ఈవిషయాన్ని పవన్ ఎన్నోసార్లు చెప్పాడు కూడా, అంతే కాదు పవన్ తల్లికూడా పవన్ సినిమాలన్నింటిలో అలీ తప్పనిసరిగా ఉండాలని చెప్పిందట.అలాంటి అలీ ఇటీవల పెట్టిన ‘అత్తారింటికి దారేది’ సినిమా విలేఖరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ సినిమా నటీనటులందరికి క్షమాపణలు చెప్పాడని చెప్పారు. కారణం ఈ సినిమా క్లయిమాక్స్ పర్ఫెక్ట్ గా రావడం లేదంటూ ఈ సీన్ తో సంబందం లేని నటీనటులను, టెక్నీషియన్స్ ను కూడా పవన్ కోపగించుకున్నాడట. అయితే ఆ సీన్ తర్వాత బయటకు వచ్చిన పవన్ అందరికి సారీ చెప్పాడు అని దాని వెనుక ఉన్న అసలు విషయాన్ని అలీ బయటపెట్టాడు అంటున్నారు.
లెజెండ్‌గా బాలకృష్ణ?
నటునిగా భిన్నమైన పాత్రలు పోషించి, స్టార్‌గా పలు రికార్డులు సృష్టించి, హీరోగా వంద చిత్రాలను పూర్తి చేసుకుంటూ... సినీ పరిశ్రమలోని లెజండ్స్‌లో ఒకరిగా నిలిచారు బాలకృష్ణ. అందుకే... ఆయన్ను తెరపై కూడా ‘లెజెండ్’గా చూపించబోతున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘లెజెండ్’ అనే పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.‘సింహా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. దానికి తగ్గట్టే ప్రతిష్టాత్మకంగా బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎన్నికలు ఉండొచ్చని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో... బాలకృష్ణ రాజకీయ జీవితానికి ఉపయోగపడే విధంగా ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన కథా కథనాలు, పాత్ర చిత్రణ కూడా బాలయ్య పొలిటికల్ ఎంట్రీకి హెల్ప్ అయ్యేలా ఉంటాయని సమాచారం.
‘సింహా’ని మించే స్థాయిలో అత్యంత శక్తిమంతంగా బోయపాటి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని వినికిడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడా స్టూడియోలో జరుగుతోంది. రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. బాలయ్య చిత్రానికి దేవిశ్రీ స్వరాలందించడం ఇదే ప్రథమం. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది.
Subscribe to:
Posts (Atom)


.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)
.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)


.jpg)



.jpg)

.jpg)


.jpg)

.jpg)

.jpg)

.jpg)

.jpg)


.jpg)

.jpg)


.jpg)

.jpg)

.jpg)
