Wednesday, 2 October 2013

5 కోట్ల ఆదాయంతో నితిన్‌


మొన్నటి వ‌ర‌కూ నితిన్ ప‌ని అయిపోయింద‌న్న టాలీవుడ్ ఇండ‌స్ట్రీ, ఇప్పుడు మాట మార్చి నితిన్‌ను గ్రేట్ అంటుంది. ఇదంతా నితిన్ బిజినెస్ వ్వవ‌హారంలో జ‌రుగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అత్తారింటికిదారేది మూవీ నైజాం రైట్స్‌ను 13 కోట్లకు నితిన్ కొన్నాడు. ప‌వ‌న్‌పై ఎంత అభిమానం ఉన్నా, ఇంత అమౌంట్‌తో నైజాం రైట్స్ తీసుకోవ‌డం అంటే నితిన్ ఖ‌చ్ఛితంగా న‌ష్టపోక త‌ప్పద‌ని అంద‌రూ ఆనాడు చెప్పిన‌వాళ్ళే. ఏ మూవీకైనా నైజాం రైట్స్‌ను తొమ్మిది నుండి ప‌ద‌కొండు కోట్లకు క్లోజ్ చేస్తారు. ఇంత‌కు మించి నైజాం రూట్స్ తీసుకోవ‌డం అంటే సాహ‌స‌మే. ఆ లెక్కల‌న్నింటిని బ్రేక్ చేసి కేవ‌లం ప‌వ‌న్ కోసం, అత్తారింటికిదారేది మూవీను 13 కోట్లకు కొనుక్కున్నాడు.

 అలాగే వైజాగ్‌లోనూ ప‌వ‌న్ మూవీకు నితిన్ డిస్ట్రిబ్యూష‌న్ చేశాడు. మొత్తంగా ప‌వ‌న్ మూవీకి 15 కోట్ల వ‌ర‌కూ డిస్ట్రిబ్యూష‌న్ మీద పెట్టుబ‌డి పెట్టాడు. ఆ మ‌ధ్య అత్తారింటికిదారేది మూవీ రిలీజ్‌పై డైల‌మా ఉండ‌టంతో నితిన్ ఈ దెబ్బతో అవుట్ అని ఫిల్మ్ న‌గ‌ర్‌లోనూ తెగ టాక్స్ వినిపిస్తున్నాయి. కాని ఈ మూవీ రిలీజ్ త‌రువాత ఆ అంచ‌నాలు త‌లక్రిందులై మూవీ లాభాల బాట ప‌ట్టింది. ఒక్క నైజాంలోనే అయిదు రోజుల క‌లెక్షన్స్ 10.5 కోట్లను వ‌సూల్ చేసింది. మొద‌టి వారం క‌లెక్షన్స్ 13 కోట్లను మించి ఉంటుందని ట్రేడ్స్ అంచ‌నా. అలాగే వైజాగ్‌లో క‌లెక్షన్స్ విజృంబించాయి. ఏ విధంగా చూసుకున్నా నితిన్ పెట్టిన పెట్టుబ‌డికి అయిదు కోట్ల లాభాలు ఖాయం అని అంటున్నారు.

No comments:

Post a Comment