Wednesday, 2 October 2013

సిద్ధమైన తెలంగాణ నోట్


న్యూఢిల్లీ, అక్టోబర్ 3 : రాష్ట్ర విభజనపై కేంద్రం దూకుడు పెంచింది. కిరణ్ ధిక్కారణ ధోరణితో ప్రక్రియను త్వరగా పూర్తి చే యాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో సీడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా హైకమాండ్ తెలంగాణ నోట్‌ను సిద్ధం చేసింది. 22 పేజీల తెలంగాణ నోట్‌ను కేంద్ర తయారు చేసింది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఏర్పాటు చేయగా, సీమాంధ్ర రాజధానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉమ్మడి రాజధానిపై మరో బిల్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నదీ జలాలు, ఇతర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రుల కమిటీని నియమించన్నుట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినేట్ భేటీ అయి తెలంగాణ నోట్‌పై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కేబినేట్ ఆమోదం తర్వాత తీర్మానం కోసం అసెంబ్లీకి తెలంగాణ నోట్ వెళ్లనుంది.

No comments:

Post a Comment