Sunday, 3 November 2013

Pawan Kalyan Premalo Paddadu - Telugu Short Film


తన ‘స్క్రిప్ట్’ కాపీ కొట్టారంటూ కోర్టుకు...


మరో కాపీ వివాదం భారీ బడ్జెట్ సినిమాకు తగులుకుంది. గతంలో తాను ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా ‘క్రిష్ 3' నిర్మించారని, తనకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని, సినిమా టైటిల్స్‌లో తన పేరు కూడా వేయలేదని మధ్యప్రదేశ్‌కు చెందిన ఉదయ్‌సింగ్ రాజ్‌పుట్ అనే రచయిత ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు అందుకు అంగీకరించలేదు. 2008లో ‘క్రిష్ 2' పేరిట తాను రాసిన స్క్రిప్ట్‌ను సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని, దాని ప్రతిని నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్‌కు పంపానని ఉదయ్‌సింగ్ చెబుతున్నారు. క్రిష్ 3' సినిమాకు తన స్క్రిప్ట్‌ను వాడుకోవడమే గాక, రాబిన్ భట్ అనే వ్యక్తికి పారితోషికం చెల్లించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

 తనకు నష్టపరిహారంగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని, కేసు విచారణ ప్రారంభించగానే తాత్కాలికంగా కొంత మొత్తం చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోరారు. అయితే, రాకేష్ రోషన్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరై సినిమా విడుదలకు ఆటంకం లేకుండా చూడాలని అభ్యర్థించారు. సినిమాను నిలిపివేసే విషయంలో కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేనందున, నవంబర్ 1న దేశవ్యాప్తంగా ‘క్రిష్ 3'ని విడుదల చేసారు. అయితే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పండగ ప్రబావంతో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం, ఎనిమిది మంది మృతి


విజయనగరం జిల్లాలోని గొట్లాం రైవ్వే స్టేషన్ వద్ద శనివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. బొకారో ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో మంటలు వచ్చాయన్న వదంతి ప్రచారం కావడంతో ఆందోళన పడిన ప్రయాణికులు రైలును ఆపి కిందికి దిగి పరుగులు తీయడం మొదలు పెట్లారు. కోందరు మాత్రం పక్కనే ఉన్న ట్రాక్‌పై నిలబడ్డారు. వరిని ఆ ట్రాక్‌పై వస్తున్న విజయవాడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టడంతో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది . ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్బాృంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తోనూ మాట్లాడి వెంటానే సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

దివ్వి దివ్వి దీపావళి


‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని ఓ సినిమా కవి అన్నారు. ఇది లక్ష ప్రమిదల వెలుతురులాంటి నిజం. దీపావళి అంటేనే సంతోషాల సంరంభం. పెద్దవాళ్లు కూడా తమ వయసు మరచిపోయి టపాసులు కాలుస్తూ ఆనంద సాగరంలో మునిగి తేలుతారు. మరి... మన అభిమాన తారల దీపావళి సంరంభం ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం...

నాగార్జున:-

  నాకెందుకో చిన్నప్పట్నుంచీ టపాసులు కాల్చడం అంత ఆసక్తి అనిపించేది కాదు. కానీ, ఫ్రెండ్స్ అందరూ కాలుస్తుంటే నేనూ కొన్ని కాల్చేవాణ్ణి. ఇప్పుడైతే టపాసుల జోలికి అస్సలు వెళ్లడంలేదు. ముఖ్యంగా పర్యావరణం మీద అవగాహన పెరిగిన తర్వాత టపాసులు కాల్చకపోవడమే బెటర్ అని ఫిక్స్ అయిపోయాను. దీపావళినాడు శబ్ద కాలుష్యం ఎక్కువ. అందుకే, శబ్దం రాని టపాసులతో సరిపెట్టుకోవాలి. అయితే, దీపావళి పండగ వల్ల కూడా ప్లస్సులున్నాయి. టపాసులు కాల్చడం వల్ల దోమల బెడద తగ్గడం ఓ ప్లస్ (నవ్వుతూ). ఈ దీపావళిని అందరూ ఎంజాయ్ చేయాలని, అందరికీ శుభం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.అప్పట్నుంచీ టపాసులు కాల్చడం మానేశాను.

అనుష్క:-

  అసలు సిసలైన పండగ సంబరం కొత్త బట్టల ద్వారా వస్తుంది. చిన్నప్పుడైతే కంపల్సరీగా కొత్త డ్రెస్ కొనుక్కునేదాన్ని. ఉదయం తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని సందడి చేసేదాన్ని. ఫ్రెండ్స్‌తో పోటీపడి టపాసులు కాల్చేదాన్ని. ఇప్పుడు అంత ఆసక్తి లేదు. ఎవరైనా ఎంజాయ్ చేస్తుంటే చూడటమే తప్ప పెద్దగా సెలబ్రేట్ చేసుకోను. ఇప్పుడు ఒకేసారి బాహుబలి, రుద్రమదేవిలాంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాను కాబట్టి... నాకెందుకో దీపావళి ముందే వచ్చేసిందనిపిస్తోంది. ఈ పండగను అందరూ ఎంజాయ్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఒకప్పుడు సందడే సందడి .

 వెంకటేష్:-

  చిన్నప్పుడు నాకు దీపావళి అంటే చాలా సరదా. బీభత్సంగా టపాసులు కాల్చేవాణ్ణి. ఇదిగో ఈ చెయ్యి చూశారు కదా. ఈ మచ్చ నా ఆరేళ్ల వయసులో పడింది. దీపావళి పండగ మిగిల్చిన గుర్తు ఇది. ఆ వయసులో అంత పెద్ద దెబ్బ తగిలినా ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు నా సరదాని మానుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం పొల్యూషన్ అంటూ... టపాసుల జోలికి దాదాపు వెళ్లడం మానేశాను. నా సంగతెలా ఉన్నా...

నాని:-


దీపావళిని చిన్నతనం నుంచి బాగా ఎంజాయ్ చేసేవాణ్ణి. దాదాపు ప్రతిసారీ ఏదో ఒక దెబ్బ తగిలేది. ఈ దీపావళి మా కుటుంబానికి చాలా స్పెషల్. అంజనాతో నా పెళ్లయిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి ఇది. ఈ పండగను అమ్మా నాన్న, అంజనాతో జరుపుకుంటాను. శబ్దం వల్ల పెద్దవాళ్లకి చాలా ఇబ్బంది. అందుకని  భూచక్రాలు, మతాబులు... ఇలా సౌండ్ లేని టపాసులు కాల్చాలని మనవి చేసుకుంటున్నాను. అలాగే, మనం టపాసులు కాల్చడం మొదలుపెట్టిన తర్వాత మొదటి అరగంట జాగ్రత్తగా కాల్చాలనుకుంటాం. ఆ తర్వాత ఆ జాగ్రత్తను మర్చిపోతాం. కానీ, కాలుస్తున్నంతసేపూ జాగ్రత్తగా ఉండాలి.