కథ తెలంగాణ మలుపులో కొనసాగిపోనుందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో... సీమాంధ్రలో నిరసల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు.
సీమాంధ్రుల సంగతి ఇలా ఉంటే.. విభజనకు అనుకూలంగా రెండో స్టెప్ పడటంతో తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ తీవ్రంగా బాధపడుతోందని సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా స్టాండ్ తీసుకోనంత సేపూ కేసీఆర్ కు తెలంగాణలో తిరుగేలేదు. ఆయన అప్పట్లో తెలంగాణ పరిధిలో వంద అసెంబ్లీ సీట్లు గెలుస్తామని కేసీఆర్ అనేవాడు. అయితే.. ఇప్పుడు ఆ ఆశలన్నీ అంతరించిపోయినట్టే. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం ఖాయంగా మారిన నేపథ్యంలో... కేసీఆర్ కున్న క్రేజ్ అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో.. రేపు ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినా.. కాంగ్రెస్ తో విభేదించి పోటీ చేసినా.. ఆయనకు గతంలో ఆశించినంత ప్రాధాన్యత దక్కదు. మొన్నటి వరకూ కూడా కేసీఆర్ కు తెలంగాణ రావడం ఇష్టంలేదు అని కొంతమంది తెలంగాణ వాదులే అన్నారు. మరి ఇప్పుడు విభజన నిర్ణయంతో కేసీఆర్ కు తీవ్రమైన బాధ కలిగే అవకాశం ఉంది. జనాల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతో.. తనకు, తన ఫ్యామిలీకి తగిన ప్రాధన్యత దక్కించుకొందామన్న కేసీఆర్ కు ఇక ఆ అవకాశం లేనట్లేనని, ఆయన ఇక పదవుల విషయంలో సోనియా భిక్ష మీద ఆధారపడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.
Thursday, 3 October 2013
కేసీఆర్ భవిష్యత్తు ఇక సోనియా చేతిలో..?
కథ తెలంగాణ మలుపులో కొనసాగిపోనుందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో... సీమాంధ్రలో నిరసల వెల్లువ కొనసాగుతోంది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు.
సీమాంధ్రుల సంగతి ఇలా ఉంటే.. విభజనకు అనుకూలంగా రెండో స్టెప్ పడటంతో తెలంగాణ ప్రాంతంలో ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ తీవ్రంగా బాధపడుతోందని సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా స్టాండ్ తీసుకోనంత సేపూ కేసీఆర్ కు తెలంగాణలో తిరుగేలేదు. ఆయన అప్పట్లో తెలంగాణ పరిధిలో వంద అసెంబ్లీ సీట్లు గెలుస్తామని కేసీఆర్ అనేవాడు. అయితే.. ఇప్పుడు ఆ ఆశలన్నీ అంతరించిపోయినట్టే. ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం ఖాయంగా మారిన నేపథ్యంలో... కేసీఆర్ కున్న క్రేజ్ అమాంతం తగ్గిపోయే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో.. రేపు ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినా.. కాంగ్రెస్ తో విభేదించి పోటీ చేసినా.. ఆయనకు గతంలో ఆశించినంత ప్రాధాన్యత దక్కదు. మొన్నటి వరకూ కూడా కేసీఆర్ కు తెలంగాణ రావడం ఇష్టంలేదు అని కొంతమంది తెలంగాణ వాదులే అన్నారు. మరి ఇప్పుడు విభజన నిర్ణయంతో కేసీఆర్ కు తీవ్రమైన బాధ కలిగే అవకాశం ఉంది. జనాల్లో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకతో.. తనకు, తన ఫ్యామిలీకి తగిన ప్రాధన్యత దక్కించుకొందామన్న కేసీఆర్ కు ఇక ఆ అవకాశం లేనట్లేనని, ఆయన ఇక పదవుల విషయంలో సోనియా భిక్ష మీద ఆధారపడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు.
భాయ్ కి భలే స్పందన
కింగ్ నాగార్జున హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ ‘భాయ్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్, టీజర్ కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో పక్కా మాస్ పాత్రలో నాగార్జున కనువిందుచెయ్యనున్నారు. వీరభద్రం చౌదరి దర్శకుడు. రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్.ఈ చిత్రాన్ని రిలయాన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై విడుదలచెయ్యనున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం కథ అంటూ (నాగార్జున) ఓప్రొఫిషనల్ కిల్లర్. దుబాయిలో ఉండే డాన్ నుంచి అతనికో వర్క్ వస్తుంది. పోలీస్ అధికారి శ్యామ్ (కిక్ ఫేమ్)ని చంపమని సుపారి వస్తుంది. దానికోసం అతను హైదరాబాద్ బయిలుదేరి వస్తాడు.
వచ్చాక అతను భాయ్ గా పేరు మార్చుకుని తన ఆపరేషన్ రహస్యంగా మొదలుపెడతాడు. ఈ క్రమంలో భాయ్...రిచాని ఓ కామన్ ప్రెండ్ పెళ్లిలో చూసి ప్రేమలో పడతాడు. కానీ అతని ఐడింటిటీ చెప్పడు. ఇక శ్యామ్ ని అతని పెళ్లిలోనే చంపేయలని వెళతాడు. అయితే అక్కడో ట్విస్ట్. అక్కడ భాయ్ తన తండ్రిని చూస్తాడు. తన తమ్ముడు శ్యామ్ అని అర్దం చేసుకుంటాడు. దాంతో శ్యామ్ ని చంపకూడదని డెషిషన్ తీసుకుంటాడు
పక్క పార్టీలోకి పోలేని వాళ్లే.. ఇంకా పోరాడతామంటున్నారు!
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధిష్టానం పై తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కాంగ్రెస్ లో ఉంటే ఇక చేతికి చిప్పేనని అనుకున్న వారు పార్టీని వీడటానికి సిద్ధం అవుతున్నారు. రాజీనామాలకు రెడీ అని అంటున్నారు.
అయితే.. ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు, మంత్రులు మాత్రం ఇప్పటికి అధిష్టానంపై వీర విధేయత చూపుతున్నారు. కాంగ్రెస్ ను వీడేది ఉండదని అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ లోనే ఉండి పోరాడతామంటున్నారు. సమైక్యవాదులు అయినప్పటికీ.. విభజన నిర్ణయం తీసుకున్న అధిష్టాన ఆజ్ఞలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. మరి వీరిలో ఇంత విధేయత ఎందుకు? ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా వీరు ఇలా ఎందుకు కాంగ్రెస్ లోనే ఉంటామంటున్నారు? అని ఆరాతీస్తే.. కాంగ్రెస్ లోనే ఉంటామంటున్న జాబితాను పరిశీలిస్తే..
ఈ జాబితాలో ఉన్న వారంతా జగన్ అంటే పడని వాళ్లు.. జగన్ పార్టీలోకి పోలేని వాళ్లు. కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు కారణమైనా.. ఆ పార్టీని వ్యతిరేకించి ఎక్కడికీ పోలే స్థితిలో ఉన్నారు వీరంతా. విభజనకు కారణమైన పార్టీలో ఉన్నామన్న అపవాదు ను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ.. వేరే పార్టీలోకి వెళ్లడానికి సిద్ధ పడటం లేదు. అసలు వీరు వేరే పార్టీల్లోకి వెళ్లడానికే అవకాశం లేదు. అందుకే ఇక్కడే ఉండి పోరాడతామంటున్నారు.
72 గంటల బంద్‌కు వైఎస్సార్ సీపీ పిలుపు
.jpg)
'సంక్షోభం సృష్టించండి, విభజనను అడ్డుకోండి'
తెలంగాణ రాష్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కుమ్మక్కవ్వడమే రాష్ట్ర విభజనకు దారి తీసిందన్నారు.
చాలా బాధకరమైన సంఘటన అని..గత 16 నెలల జైలు జీవితంలో కూడా తాను ఇంతటి బాధను అనుభవించలేదు అని అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం చరిత్ర హీనంగా రాష్ట్రాన్ని విభజిస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర హీనంగా విభజిస్తున్న పరిస్థితి చూస్తే...వీళ్లు మనుషులేనా అనిపిస్తోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం ఆధారంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, రెండు రాష్ట్రాలు కలయిక సందర్భంలో కూడా తీర్మానం చేసిన సంగతి తెలిసిందేనని వైస్ జగన్ తెలిపారు.డిసెంబర్ 9 ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రకటన ప్రారంభమవుతుందని అప్పటి హోంమంత్రి చిదంబరం చెప్పిన విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మధ్య ప్రదేశ్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను విభజించిన నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాతే మూడు రాష్రాలను ఏర్పాటు జరిగిందన్నారు.
ఈ రోజు మన రాష్ట్రంలో అసెంబ్లీలో తీర్మానం చేయాలనే పద్దతిని పక్కన పెట్టారు అని జగన్ అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై రాష్ట్ర విభజనకు సహకారం అందించాయన్నారు. గవర్నర్ ను కలిసిన సమయంలో కూడా అసెంబ్లీ సమావేశ పర్చాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కూడా లేఖలు రాశామనే విషయాన్ని మీడియాకు తెలిపారు. అసెంబ్లీని సమావేశం పెట్టండి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపిద్దాం.. కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది అని సూచించామన్నారు. అన్ని పార్టీల వైపు నుంచి మూడు పార్టీల వైపుకు రండి, విభజన వ్యతిరేకంగా లేఖలు ఇవ్వండి..అనుకూలంగా రాసిన లేఖలు వెనక్కి తీసుకోండి అని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశృ఼రు. ఓట్ల కోసం సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించిన.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చరిత్ర హీనులు చరిత్ర పుటల మిగిలుతారు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ 72 గంటల బంద్ కు పిలుపునిస్తున్నాం అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
తమ రాజీనామాలను ఆమోదించాలని లేఖలు రాశాం అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తే.. యూపీఏ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడటం ద్వారా.. రాష్ట్ర విభజన ప్రక్రియను ఆగిపోతుందని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన పై కోర్టులో పిటిషన్లను దాఖలు చేస్తామని.. కోర్టులో పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికి తాము సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి ఉండవల్లి, సబ్బం హరి రాజీనామా
న్యూఢిల్లీ, అక్టోబర్ 3: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ నోట్‌ను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఉండవల్లి అరుణ కుమార్, సబ్బంహరి పార్టీకి రాజీనామాలు చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో గురువారం సాయంత్రం సమావేశమైన కేంద్ర కేబినెట్ భేటీలో నోట్‌కు కేబినెట్ ఆమోదం తెలపడంతో మనస్తాపం చెందిన ఉండవల్లి, సబ్బం హరిలు ఈ మేరకు పార్టీకి రాజీనామా చేశారు. వీరి బాటలో వీరి బాటలో మరి కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. విభజన ప్రటకన వచ్చినప్పటి నుంచి వీరు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతున్నారు. ఈరోజు ఎవరికీ తెలియకుండా ఒక్కసారిగా కేబినెట్‌లో నోట్ ప్రవేశపెట్టి ఆమోదం తెలపడంతో వీరు తీవ్ర మనస్తాపం చెందారు.
సీమాంధ్ర కేంద్రమంత్రుల రాజీనామా?
ఢిల్లీ: తెలంగాణ నోట్ పై కేంద్రమంత్రి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసిన అనంతరం సీమాంధ్ర కేంద్రమంత్రులు తీవ్ర అసహనంతో ఉన్నారు. కేంద్రం తీసుకున్న ఈ మింగుడుపడని అంశంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ నోట్ విడుదలకు ముందు ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు జైపాల్ రెడ్డి, పల్లంరాజు, కావూరి సాంబశివరావుల మాత్రమే పాల్గొన్నారు. మిగతా సీమాంధ్ర మంత్రులు సమావేశానికి దూరంగా ఉండి రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, అనంత వెంకట్రామి రెడ్డి, చిరంజీవిలు రాజీనామా చేసి కాంగ్రెస్ పై నిరసన వ్యక్తం చేశారు.సీమాంధ్రలో ప్రజలు తీవ్రస్థాయిలో ఉద్యమంలో పయనిస్తుండటంతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల్లో అత్యధికం శాతం మంది రాజీనామాలు చేసే యోచనలో ఉన్నారు. ఒకప్రక్క ప్రజలు, మరోప్రక్క ఏపీఎన్జీవోల నుంచి అధిక స్థాయిలో ఒత్తిడి ఉండటంతో మంత్రులు రాజీనామాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని ప్రాధమికంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమన్యాయం చేయలేనపుడు సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామాలు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు.
హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటును హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి అనుమతితో టేబుల్ ఐటమ్ గా తెలంగాణ నోట్ పై చర్చించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకొని 60 రోజులు గడిచిపోయింది. నోట్ పై హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే సంతకం చేసి ఈ సాయంత్రం కేంద్ర మంత్రులకు అందజేశారు. ఆంధ్ర ప్రదేశ్ రీఆర్గనైజేషన్ పేరుతో 20 పేజీల నోట్ రూపొందించారు. ఈ నోట్ లో రాజధాని, భౌగోళిక స్వరూపం, నదీజలాలు తదితర అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
సంచలనం : తెలంగాణ రాష్ట్రానికి క్యాబినెట్ ఆమోదం
సంచలనం, ఎంతో ఉద్విగ్న పరిస్థితులకు కారణమైన రాష్ట్ర విభజనకు కేంద్ర క్యాబినెట్ పచ్చా జెండా ఊపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు అధికారికంగా కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించారు. అంతే కాదు ఈ విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారు రాష్ట్రంలోని ఏ ప్రాంతాల వారికి చెందాల్సిన హక్కులు వారికి కల్పించేలా చూడాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు.హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన చదివి వినిపించడం విశేషం. క్యాబినెట్ మీటింగు నుంచి బయటకు వచ్చిన వెంటనే విలేఖరులతో అన్న తొలి మాటలు ‘ క్యాబినెట్ తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది (క్యాబినెట్ తెలంగాణ నయా రాజ్య్ నిర్మాణ్ కియా హై) అన్నారు. తెలంగాణ, రాయల సీమ, ఆంద్రా ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా మెకానిజాన్ని మంత్రుల బృందం చూసుకుంటుందని ఆయన చెప్పారు.
దీనికి కావాల్సిన ప్రత్యేక నిధుల కేటాయింపును కేంద్రం చూసుకుంటుందని తెలిపారు. ఈమేరకు దీనిని కూడా క్యాబినెట్ తీర్మాణం చేసిందన్నారు. ఆంద్రా ప్రత్యేక రాజధాని ఏర్పాటు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా క్యాబినెట్ తీర్మాణించిందని ఆయన తెలిపారు. దీంతో ఇన్నాళ్లు కాంగ్రెస్ నాన్చుతోంది అన్న ఆరోపణలకు తెరదించినట్టయింది.
ముగ్గురి కథ ముగించేందుకే అర్జంటుగా తెలంగాణ నోట్

తెలంగాణ నోట్ పెట్టడం ద్వారా బిజేపి, టిడిపి బంధాన్ని అయోమయంలో పడేయడమే కాకుండు ఏపిలో చంద్రబాబు ను దెబ్బ తీసినట్టే అన్నది అందరికి తెలిసిందే. ఇక చంద్రబాబు ఏదో ఓ ప్రాంతంలో జీరో కంపల్సరీ, ఒక వేళ ఆయన సీమాంద్ర టర్న్ తీసుకుంటే అక్కడ జగన్ ఎలాగు బలపడ్డాడు, కాబట్టి కాంగ్రెస్ కు డోకా లేదు, టిడిపి బాగా దెబ్బ తింటుంది. ఇక టిడిపి కి రాష్ట్రంలో ఏమి రాక పోయాకా బిజేపి ఆయనతో బందం పెట్టుకుని ఏంలాభం. ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాటిమాటికి రాజీనామా చేస్తాను అని బెదిరిస్తున్నాడు, అదేదో తెలంగాణ నోట్ పెట్టేసామనుకో ఆయన చేస్తాడా, లేక ఉత్తిత్తి బెదిరింపులేనా... అన్న నాటకం బయట పడుతుంది. ఒక వేళ నిజంగా రాజీనామానే చేసాడు అనుకోండి, ఆయనను తొలగించి మరో సిఎం ను పెట్టారు అన్న అపవాదు నుంచి సోనియా తప్పించుకోవడమే కాకుండా తెలంగాణ విషయంలో ముందుకే పోయేందుకు దారి కూడా సుగమం అవుతుంది. ఇలా ఒక దెబ్బతో ముగ్గురిని పడగొట్టేందుకే ఇదంతా అన్నమాట.
యువరాజ్ ఆగయా
గత కొంత కాలం నుండి భారత జట్టులోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత జట్టు సీనియర్ ఆటగాడు అయిన యువరాజ్ సింగ్ ఆశ నెరవేరింది. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఫాం కోల్పోయి జట్టుకు దూరం అయిన యువరాజు సింగ్ కి భారత జట్టు సెలక్టర్లు మళ్ళీ చాన్స్ ఇచ్చారు. గత కొంత కాలంగా పలు మ్యాచ్ ల్లో రాణిస్తున్న యువీని ఆస్ట్రేలియాతో జరిగే ఒక టి20 మ్యాచ్ కి, ఏడు వన్డేల సిరీస్ కి ఎంపిక చేసింది. మరో ఇద్దరు సీనియర్లు అయిన గంబీర్, సెహ్వాగ్ లకు చోటు కల్పించలేదు. ఇక యువ ఆటగాడు అయిన దినేష్ కార్తీక్ పై వేటు వేస్తూ... కొత్త వారికి చోటు ఇచ్చింది.భారత జట్టు :
ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్ , రోహిత్ , కోహ్లీ , యువరాజ్‌సింగ్ , సురేష్‌రైనా , అంబటి రాయుడు , జడేజా, అశ్విన్ , భువనేశ్వర్ , ఇశాంత్ , వినయ్‌కుమార్ , అమిత్‌శర్మా , మహ్మద్‌షమీ , ఉనద్కత్. -
మహానేతకు నాలుగేళ్లు ..
నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు... మన కళ్ల ముందునుంచి దూరమయ్యారు మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి. ప్రజల కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు. ఆ ప్రజల సంక్షేమం కోసం పరిగెత్తున్న సమయంలో పంచభూతలకు కన్నుకుట్టి. మహానేతను ప్రక్రుతిలో కలిపేసుకుంది. ప్రక్రుతిలో నెలకొరిగిన మహానాయకుడు ఇక లేడు అనే నిజం తెలిసి కోట్లాది మంది కన్నీటి పర్వతమైనారు. సెప్టెంబర్ 2, 2009 రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం. బేగంపేట ఎయిర్‌పోర్టులో సిద్ధంగా హెలికాప్టర్. దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆ వేళ.. ప్రయాణం మానుకోమని అంతా రాజశేఖరరెడ్డికి సూచించారు. ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఆయన.. వాతావరణం కాదు జనం అనుగ్రహం ముఖ్యమని నమ్మారు. ప్రయాణం మానుకోమని ఎందరు వారించినా సున్నితంగా తిరస్కరిస్తూ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు. కానీ ఆ హెలికాప్టర్ గమ్యం చేరలేదు. పావురాల గుట్ట మహానేతను కబళించింది. నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట కొండ మీద హెలికాప్టర్ కుప్పకూలింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు పైలట్, కో పైలట్, భద్రతాధికారి, కార్యదర్శి.. అంతా మరణించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాజశేఖర్ రెడ్డి సాగించిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణ యుగాన్ని చూసింది. నాడు ఏ సమస్య ఎదురైనా ఆదుకునేందుకు రాజన్న ఉన్నాడులే అని జనం నమ్మారు. రాజన్న అంటేనే కొండంత అండ అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం రాజశేఖరుడు పరితపించారు. ప్రజల మేలు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మహానేత వ్యవసాయాన్ని పండగ చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉచిత విద్యుత్ అందించి రైతుల ఇళ్లో వెలుగులు నింపారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఫించన్లిచ్చి ఎంతో మంది వృద్ధులకు పెద్ద కొడుకయ్యాడు. మహానేత పాలనలో ఎంతో ధైర్యంగా బతికారు బడుగు, బలహీనవర్గాల ప్రజలు. అందుకే ఆ సంక్షేమ సారధి పదికాలాలు పదవిలో ఉండాలని జనం ఆకాంక్షించారు. ఆశీర్వదించారు. కాని ఏనాడైతే మహానేత ఇక లేడని తెలిసిందో పేద గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రజానేత లేని ఈ లోకంలో తాము ఉండలేమన్నారు. రాజన్న లేడని ఆగిపోయిన పేద గుండెలెన్నో. ఏ గాయాన్నైనా మాన్చే గొప్ప శక్తి కాలానికి ఉంటుందంటారు. కాని మహానేత కానరాని లోకాలకేగి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ అలానే ఉంది.
యువ హీరోకి డెంగ్యూ దోమ కుట్టింది
బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ ‘డెంగ్యూ ’ జ్వరంతో ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు. ఇతనికి గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్నా, విరామం లేకుండా షూటింగులో పాల్గొంటూనే ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కలకత్తా దగ్గర్లోని దుర్గాపూర్ లో జరుగుతుంది. అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అతనికి ఉన్నట్లుండి జ్వరం ఎక్కువ కావడంతో ముంబై ఆసుపత్రికి వెళితే అక్కడ డాక్టర్లు పరీక్షించి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించడంతో తక్షణమే షూటింగుకు విరామం ప్రకటించి ఆసుపత్రిలో చేశాడు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రణ్ వీర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పాడు. కానీ ఇతను నటిస్తున్న ‘గూండే ’ చిత్రం షూటింగులో తిరిగి ఎప్పుడు పాల్గొంటాడో మాత్రం తెలియరాలేదు. దీంతో నిర్మాతకు భారీ నష్టం చేకూరే పరిస్థితి ఏర్పడింది.
బాలయ్య కోసం కొత్త సఫారీ కారు
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం పలు ప్రత్యేక ఆకర్షణలు సంతరించుకుంటోంది. ఈ సినిమాలో బాలకృష్ణ ఉపయోగించే మోటార్ బైక్ ను ప్రత్యేకంగా తయారు చేయించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఇప్పుడు ఓ టాటా సఫారీ కారును కూడా ప్రత్యేకంగా రీ మోడలింగ్ చేశారు. సఫారీ కారుకి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆకర్షణీయంగా డిజైన్ చేయించారు. దీనిని కూడా బాలకృష్ణ ఉపయోగిస్తాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాదు నానక్ రామ్ గూడాలో జరుగుతోంది. బాలకృష్ణ సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈయన తమిళ ‘పోటుగాడు ’
ఇప్పటికే పలు తెలుగు చిత్రాలను తమిళంలో రీమేక్ చేశారు. ఇప్పుడు మరో చిత్రం రీమేక్ కాబోతుంది. ఇటీవల మంచు మనోజ్ నటించిన ‘పోటుగాడు ’ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా హన్సిక లవర్, తమిళ హీరో అయిన శింబు కన్నేశాడు. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన శింబు వెంటనే నటించడానికి ఒప్పుకున్నాడట. తమిళంలో చేరన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంలోనూ లగడపాటి శ్రీధర్ నిర్మిస్తారు. ఇప్పటికే కన్నడ సినిమా రీమేక్ గా తెలుగులో కి వచ్చిన ఈ చిత్రం ఇక తమిళ ప్రేక్షకులను కూడా పలకరించబోతుంది. చూద్దాం శింబు తమిళ పోటుగాడు అవుతాడో లేదో ?
చరణ్ 'ఎవడు' 31కి వస్తాడా?
గత రెండు నెలలుగా విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన 'ఎవడు' చిత్రాన్ని ఇక ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా జాప్యం జరగడంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయడం శ్రేయస్కరం కాదన్న ఆలోచనతో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 31న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్మించిన మరో చిత్రం 'రామయ్యా వస్తావయ్యా' ఈ నెల 10న రిలీజ్ అవుతోంది. అంటే, దీనికీ, దానికీ మూడు వారాల గ్యాప్ ఉంటుందనీ, పెద్ద సినిమాల మధ్య ఈ గ్యాప్ అభిలషణీయమనీ నిర్మాత అభిప్రాయపడుతున్నాడు. ఈ లెక్కన జూలై 31న రిలీజ్ కావలసిన ఈ 'ఎవడు' చిత్రం సరిగ్గా మూడు నెలల అనంతరం ప్రేక్షకుల ముందుకు వస్తోందన్న మాట. కాగా, సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల రీ షూట్ చేయడంతో ఇప్పుడు క్వాలిటీ పరంగా మరింత సంతృప్తికరంగా వచ్చిందని అంటున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు.
సచిన్ రిటైర్మెంట్!!!
సచిన్ రిటైర్మెంట్ పై వస్తున్న పలు ఊహాగానాలకు బీసీసీఐ తెరదించే ప్రయత్నం చేసింది. 200వ టెస్ట్ మ్యాచ్ తర్వాత సచిన్ ను బీసీసీఐ రిటైర్ కావాలని అడిగినట్టు వస్తున్న వార్తలను బీసీసీఐ సెక్రెటరీ సంజయ్ పటేల్ ఖండించారు. రెటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవాల్సింది మాస్టరేనని... అతనిపై బీసీసీఐ ఒత్తిడి తీసుకురాదని తెలిపారు. రిటైర్ కమ్మని చెప్పడానికి సచిన్ ఆషామాషీ ఆటగాడు కాదని అన్నారు. సచిన్ రిటైర్మెంట్ పై ముంబైలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ పటేల్ ఈ విధంగా స్పందించారు. సచిన్ ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డు దాన్ని సమర్థిస్తుందని తెలిపారు.
'మసాలా' పాటలు వచ్చేస్తున్నాయ్
వెంకటేష్, రామ్ హీరోలుగా రూపొందుతున్న 'మసాలా' సినిమా ఆడియో వేడుకకు డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ నెల 13న దసరా సందర్భంగా ఈ వేడుకను హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగు కార్యక్రమం ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీ సినిమా 'బోల్ బచ్చన్' ఆధారంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో వెంకీ సరసన అంజలి, రామ్ పక్కన షాజన్ పదాంసీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ బాబు తో కలిసి స్రవంతీ రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్పెయిన్ లో నితిన్ విహారం
వరుస హిట్లతో మంచి జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం స్పెయిన్ లో తిష్ఠ వేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హార్ట్ ఎటాక్' చిత్రం షూటింగు ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. హీరో నితిన్, హీరోయిన్ ఆదా శర్మలపై ముఖ్య సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. అక్కడి అందమైన లొకేషన్లలో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్ లో చాలా భాగం షూటింగు నిర్వహిస్తారు. కాగా, ఇంతకు ముందు హైదరాబాదులో జరిగిన షెడ్యూల్ లో క్లైమాక్స్ కు చెందిన యాక్షన్ దృశ్యాలను, మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సారీ చెప్పిన పవన్ కల్యాణ్
అవును ... పవన్ కల్యాణ్ తన సాటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు నిజంగానే 'సారీ' చెప్పాడు. ఈ విశేషం 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే ... ఆ సినిమా క్లైమాక్స్ దృశ్యాలలో హీరో పవన్ కల్యాణ్ ఎమోషనల్ గా స్పందించి, కన్నీళ్లు పెట్టుకునే దృశ్యం ఒకటుంది. అది ప్రేక్షకులను ఎంతగానో టచ్ చేస్తుంది కూడా.ఈ సీన్ తీసేటప్పుడు అందులో తాను పూర్తిగా లీనమవడానికి వీలుగా, తనకు ఎటువంటి డిస్టర్ బెన్స్ లేకుండా వుండడం కోసం, ఆ సీన్ తో సంబంధం లేని ఆర్టిస్టులనూ, టెక్నీషియన్ లనూ సెట్లోంచి దూరంగా వెళ్ళిపొమ్మని పవన్ ఆదేశించాడట. ఆ తర్వాత ఆ సీన్ ఓకే అయ్యాక, అందర్నీ పిలిచి, తను వెళ్ళిపొమ్మన్నందుకు కారణాన్ని వివరించి చెప్పి, అందరికీ 'సారీ' చెప్పాడట.
దాంతో వాళ్ళంతా పవన్ వ్యక్తిత్వానికీ, సంస్కారానికీ హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ విషయాన్ని ఆనాడు సెట్లో వున్న హాస్యనటుడు అలీ, తాజాగా మీడియాకు చెబుతూ, "పవన్ కల్యాణ్ గారి స్థాయికి మాకలా సారీ చెప్పక్కర్లేదు. అయితే, మేమెక్కడ హర్ట్ అయ్యామో అన్న ఉద్దేశంతో, వివరించి చెప్పి, సారీ చెప్పారు. అది ఆయన సంస్కారం" అన్నాడు.
నటి అంజలి వ్యవహార శైలిపై కోర్టు సీరియస్
చెన్నై: సినీ నటి అంజలి వ్యవహార శైలిపై కోర్టు సీరియస్ అయ్యింది. ఆమె మరోమారు కోర్టుకు డుమ్మా కొట్టింది. కేసు విచారణ నిమిత్తం గురువారం అంజలి కోర్టుకు హాజరు కాకపోవటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29న తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. తమిళ దర్శకుడు కళంజియం దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఆమె ఎలాంటి కారణాలు చెప్పకుండానే ఇప్పటికే పలుసార్లు కోర్టుకు గైర్హాజరు అయ్యింది. గతంలో కోర్టు పలు మార్లు హెచ్చరికలు చేసినా ఆమె తన తీరు మార్చుకోలేదు.
టీడీపీ అంటే ఆ ఇద్దరు రెడ్లకూ ఇష్టం లేదు!
బీజేపీ-తెలుగుదేశం పార్టీల పొత్తు రోజుకొక అడుగుగా ముందుకు వెళుతోంద. ఆదిలో ఊహాగానంగా మొదలైన ఈ అంశం ఈ గాంధీ జయంతితో ఒక కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్డీయే రోజులను గుర్తు చేసుకోవడం, తాము అద్భుతాలను సాధించామని అనడం, మోడీతో ప్రత్యేకంగా సమావేశం అవ్వడం.. ఇవన్నీ తెలుగుదేశం బీజేపీ పొత్తుకు సంకేతాలు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక పొత్తు ఖాయమేనని సీట్ల సర్దుబాటు గురించి చర్చలు కూడాజరిగే అవకావం ఉందని, అయితే ముందుగా ఈ అంశాన్ని ఎవరు బహిరంగ పరుస్తారనేది ఆసక్తికరమైన అంశమని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ వైపు నుంచి ప్రతపాదన వస్తుందా? లేక తెలుగుదేశం నుంచి ఈ ప్రతిపాదన ఉంటుందా? అనేది వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయమని అభిప్రాయపడుతున్నారు.గతంలో పొత్తుతో స్నేహంగా మెలిగిన ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతానికి కొంత ఇగో క్లాషెష్ ఉండవచ్చని.. అయితే వాటిని తొలగించుకోవడం పెద్ద విషయం కాదని అంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. తెలుగుదేశంతో పొత్తు అనే ఊహానాలు వచ్చినప్పటి నుంచి బీజేపీలోని ఇద్దరు వ్యక్తులు మొహం మాడ్చుకొంటున్నారు. టీడీపీతో పొత్తుకు వీళ్లు ససేమేరా అంటున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు, ఇది బాబును ఉద్ధరించడానికి జరుగుతున్నట్లుందని వాళ్లు అధిష్టానానికి మొరపెట్టుకొంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులే కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి. న్యూఢిల్లీలో బాబు-మోడీల మీటింగ్ తర్వాత వీళ్లు మరింతగా బిగుసుకుపోయారు. మోడీని పొడిగితే మాత్రం బాబుకు సీట్లను పంచి ఇస్తామా? అని నాగం ప్రశ్నిస్తుంటే.. కిషన్ రెడ్డి మీడియా ముందుకే రావడం లేదు.. మరి వీరిని ఈ విషయంలో కూల్ చేసేది ఎవరో!
డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన షాక్ కు ఖంగుతిన్న నాగార్జున...
టాప్ హీరోల సినిమాలు జనానికి నచ్చుతాయో లేదో అనే సమస్య ఒకటి అయితే ఆ సినిమాను బద్రంగా కధ దగ్గరనుంచి చివరకు పైరసీ వరకూ తమ సినిమాలను కాపాడుకోవడానికి మన టాలీవుడ్ టాప్ హీరోలు పడరాని పాట్లు పడుతున్నారు. రేపు శనివారం పాటల సందడి చేయబోతున్న అక్కినేని నాగార్జున ‘భాయ్’ సినిమా ఈ నెలాఖరుకు విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించి జరిగిన సంఘటన అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాను నాగార్జున కొందరు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు చూపించాడట. ఆ సినిమా చూసినతరువాత ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆసినిమా బేరసారాలు నాగ్ తో మాట్లాడుకుని బయటకు వచ్చేసారట. ఇంతవరకు బాగానేవుంది ఈ సినిమా చుసిన వ్యక్తులలో ఒక వ్యక్తి సినిమా రివ్యూలు బాగా రాసే ఒక రివ్యూ రైటర్ కు ఈ సినిమా కధ చెపితే అతడు మరీ ఉత్సాహపడిపోయి నాగ్ ‘భాయ్’ కధ ఇదే అంటూ వార్తలు వ్రాయడం.
ఆ వార్తలును ఆదారంగా చేసుకుని మిగతా వెబ్ మీడియా వారు కూడా కధనాలు వ్రాయడంతో చిర్రెత్తి పోయిన నాగ్ సినిమా చూపించకుండా రైట్లు అమ్ముతాము అంటే సినిమా చూడకుండా ఎలా కొంటాము అని అడిగే కొందరు డిస్ట్రిబ్యూటర్లు తీరా సినిమా చుసిన తరువాతా ఇలా లీకులు ఇచ్చుకుంటూ పోతే సినిమాలు పరిస్థితి ఏమిటీ అని తల పట్టుకుంటున్నాడట. సినిమా మాని చూడకుండా ఎవరో చెప్పిన కధను ఆధారంగా తీసుకుని మూడు పేరాలలో కధను రాసి లీకులిస్తూ ఉంటే అటు పైరసీ ఇటు లీకుల మధ్య ఇక భవిష్యత్ లో సినిమాలు తీయడం కష్టమే అంటూ తన ‘భాయ్’ సినిమాను చూసి లీక్ లు ఇచ్చిన ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ పై చాల కోపంగా ఉన్నాడట మన నాగ్..
అశోక్ బాబూ... సాటి ఉద్యోగులే చావగొడతారట

అప్పుడే వారి ఉద్యమానికి మరింత బలం చేకూరి లక్ష్యసాధన మరింత ఈజీ అవుతుందన్న దానిని కూడా తోసి పుచ్చలేం. మరి అశోక్ బాబు ఏంచేస్తున్నాడు, రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నారని రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఎంపీలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు హెచ్చరిస్తూ చీల్చి చెండాడుతున్నాడు, ఉద్యమకారుడిగా ఆయనలో అంత తెగువ అవసరమే, కాని అందులో పారదర్శకత ఉండాలి కదా... ఈ రోజు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నదెవరు, అంటే కాంగ్రెస్ అని అశోక్ బాబు కూడా చెబుతున్నాడుగా, ఆయన తిట్టుతూ, హెచ్చరిస్తున్నది కూడా కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులనే కదా... కాని ఇందులోనే ఓ ట్విస్టు ఉంది ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడుతూ, సీమాంద్ర హీరో అంటూ ఆయనను చేరదీస్తూ మంత్రులను, ఎంపీలను తిట్టి పోస్తున్నాడు, ఈరాజకీయం ఆయనకు అవసరమా, అందరిని ఒకేలా చూడాలిగా. పైగా సిఎం కిరణ్ ను నిన్న విమర్శించిన మంత్రులను, సమావేశం అయి సిఎం తీరుతో విభేదించిన చిరంజీవి, బొత్స వంటి వారిని కూడా ఆయన హెచ్చరించి సిఎం ను ఏమన్నా సహించేది లేదు అన్నట్టు వ్యవహరించడంలో అర్థం ఏమిటి. ఆయనేమన్నా సిఎం వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతనా... సరే, సిఎం అధిష్టానాన్ని వ్యతిరేకించి గట్టిగా సమైక్యాంధ్ర వాణి వినిపిస్తున్నాడు కాబట్టి అనుకుందాం, అదేదో రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రమ్మని సిఎం ను ఎందుకు కోరడం లేదు అని ఎవరైనా అడిగితే సమాధానం ఏంటి. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సిఎం పదవిలో ఉండాలని ఆ వెసులు బాటు కల్పించారనుకుందాం, కాని సమైక్యాంద్రకోసం తెలంగాణలో పార్టీని భూస్తాపితం చేసుకుని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు పార్టీ అద్యక్షుడిగా తాను కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చిన వైఎస్సార్ సిపిని, జగన్ ను అశోక్ బాబు ఎందుకు దగ్గరికి తీసుకోవడం లేదంటే సమాధానమేంటి, ఇలా రాజకీయ నేతలు, పరిశీలకులు అశోక్ బాబు విషయంలో సందిస్తున్న ప్రశ్నలు. ఇదంతా సిఎం చూసుకుంటాడు అన్న దీమా ఆయనలో ఉందేమో, రేపు కిరణ్ కుమార్ రెడ్డినే ఎటూ కాకుండా చేసి, ఆయన స్థానంలో అశోక్ బాబుతో బండబూతులు తిట్టించుకున్న మరో నేత ముఖ్యమంత్రి అయితే అశోక్ బాబు పరిస్థితి ఏంటి, ఆయనను నమ్ముకుని కుటుంబాలను వీది పాలు చేసి ఉద్యోగాలను వదిలి ఆయన వెంట నడుస్తున్న వారి పరిస్థితి ఏంటి... ఇవన్నీ విశ్లేషిస్తున్న వారు ‘ అశోక్ బాబూ... సాటి ఉద్యోగులే చావగొడుతారేమో, నీ భవిష్యత్తు కుక్కలు చింపిన విస్తరి అవుతుందేమో’ అంటున్నారు.
Subscribe to:
Posts (Atom)

