Thursday, 3 October 2013

యువరాజ్ ఆగయా


గత కొంత కాలం నుండి భారత జట్టులోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారత జట్టు సీనియర్ ఆటగాడు అయిన యువరాజ్ సింగ్ ఆశ నెరవేరింది. దాదాపు ఎనిమిది నెలల క్రితం ఫాం కోల్పోయి జట్టుకు దూరం అయిన యువరాజు సింగ్ కి భారత జట్టు సెలక్టర్లు మళ్ళీ చాన్స్ ఇచ్చారు. గత కొంత కాలంగా పలు మ్యాచ్ ల్లో రాణిస్తున్న యువీని ఆస్ట్రేలియాతో జరిగే ఒక టి20 మ్యాచ్ కి, ఏడు వన్డేల సిరీస్ కి ఎంపిక చేసింది. మరో ఇద్దరు సీనియర్లు అయిన గంబీర్, సెహ్వాగ్ లకు చోటు కల్పించలేదు. ఇక యువ ఆటగాడు అయిన దినేష్ కార్తీక్ పై వేటు వేస్తూ... కొత్త వారికి చోటు ఇచ్చింది.

 భారత జట్టు :

 ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్ , రోహిత్ , కోహ్లీ , యువరాజ్‌సింగ్ , సురేష్‌రైనా , అంబటి రాయుడు , జడేజా, అశ్విన్ , భువనేశ్వర్ , ఇశాంత్ , వినయ్‌కుమార్ , అమిత్‌శర్మా , మహ్మద్‌షమీ , ఉనద్కత్. -

No comments:

Post a Comment