Thursday, 3 October 2013

పక్క పార్టీలోకి పోలేని వాళ్లే.. ఇంకా పోరాడతామంటున్నారు!


ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధిష్టానం పై తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కాంగ్రెస్ లో ఉంటే ఇక చేతికి చిప్పేనని అనుకున్న వారు పార్టీని వీడటానికి సిద్ధం అవుతున్నారు. రాజీనామాలకు రెడీ అని అంటున్నారు. అయితే.. ఇప్పటికీ కొంతమంది కాంగ్రెస్ నేతలు, మంత్రులు మాత్రం ఇప్పటికి అధిష్టానంపై వీర విధేయత చూపుతున్నారు. కాంగ్రెస్ ను వీడేది ఉండదని అంటున్నారు. ఇంకా కాంగ్రెస్ లోనే ఉండి పోరాడతామంటున్నారు. సమైక్యవాదులు అయినప్పటికీ.. విభజన నిర్ణయం తీసుకున్న అధిష్టాన ఆజ్ఞలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు. మరి వీరిలో ఇంత విధేయత ఎందుకు? ప్రజలు కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా వీరు ఇలా ఎందుకు కాంగ్రెస్ లోనే ఉంటామంటున్నారు? అని ఆరాతీస్తే.. కాంగ్రెస్ లోనే ఉంటామంటున్న జాబితాను పరిశీలిస్తే.. ఈ జాబితాలో ఉన్న వారంతా జగన్ అంటే పడని వాళ్లు.. జగన్ పార్టీలోకి పోలేని వాళ్లు. కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు కారణమైనా.. ఆ పార్టీని వ్యతిరేకించి ఎక్కడికీ పోలే స్థితిలో ఉన్నారు వీరంతా. విభజనకు కారణమైన పార్టీలో ఉన్నామన్న అపవాదు ను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ.. వేరే పార్టీలోకి వెళ్లడానికి సిద్ధ పడటం లేదు. అసలు వీరు వేరే పార్టీల్లోకి వెళ్లడానికే అవకాశం లేదు. అందుకే ఇక్కడే ఉండి పోరాడతామంటున్నారు.

No comments:

Post a Comment