Thursday, 3 October 2013

సంచలనం : తెలంగాణ రాష్ట్రానికి క్యాబినెట్ ఆమోదం


సంచలనం, ఎంతో ఉద్విగ్న పరిస్థితులకు కారణమైన రాష్ట్ర విభజనకు కేంద్ర క్యాబినెట్ పచ్చా జెండా ఊపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు అధికారికంగా కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించారు. అంతే కాదు ఈ విభజన ప్రక్రియ సజావుగా సాగేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారు రాష్ట్రంలోని ఏ ప్రాంతాల వారికి చెందాల్సిన హక్కులు వారికి కల్పించేలా చూడాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు.

 హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన చదివి వినిపించడం విశేషం. క్యాబినెట్ మీటింగు నుంచి బయటకు వచ్చిన వెంటనే విలేఖరులతో అన్న తొలి మాటలు ‘ క్యాబినెట్ తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది (క్యాబినెట్ తెలంగాణ నయా రాజ్య్ నిర్మాణ్ కియా హై) అన్నారు. తెలంగాణ, రాయల సీమ, ఆంద్రా ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా మెకానిజాన్ని మంత్రుల బృందం చూసుకుంటుందని ఆయన చెప్పారు.

దీనికి కావాల్సిన ప్రత్యేక నిధుల కేటాయింపును కేంద్రం చూసుకుంటుందని తెలిపారు. ఈమేరకు దీనిని కూడా క్యాబినెట్ తీర్మాణం చేసిందన్నారు. ఆంద్రా ప్రత్యేక రాజధాని ఏర్పాటు కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని కూడా క్యాబినెట్ తీర్మాణించిందని ఆయన తెలిపారు. దీంతో ఇన్నాళ్లు కాంగ్రెస్ నాన్చుతోంది అన్న ఆరోపణలకు తెరదించినట్టయింది.

No comments:

Post a Comment