Thursday, 3 October 2013

స్పెయిన్ లో నితిన్ విహారం


వరుస హిట్లతో మంచి జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం స్పెయిన్ లో తిష్ఠ వేశాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'హార్ట్ ఎటాక్' చిత్రం షూటింగు ప్రస్తుతం అక్కడ జరుగుతోంది. హీరో నితిన్, హీరోయిన్ ఆదా శర్మలపై ముఖ్య సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. అక్కడి అందమైన లొకేషన్లలో జరుగుతున్న ఈ భారీ షెడ్యూల్ లో చాలా భాగం షూటింగు నిర్వహిస్తారు. కాగా, ఇంతకు ముందు హైదరాబాదులో జరిగిన షెడ్యూల్ లో క్లైమాక్స్ కు చెందిన యాక్షన్ దృశ్యాలను, మరి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

No comments:

Post a Comment