Thursday, 3 October 2013

డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన షాక్ కు ఖంగుతిన్న నాగార్జున...


టాప్ హీరోల సినిమాలు జనానికి నచ్చుతాయో లేదో అనే సమస్య ఒకటి అయితే ఆ సినిమాను బద్రంగా కధ దగ్గరనుంచి చివరకు పైరసీ వరకూ తమ సినిమాలను కాపాడుకోవడానికి మన టాలీవుడ్ టాప్ హీరోలు పడరాని పాట్లు పడుతున్నారు. రేపు శనివారం పాటల సందడి చేయబోతున్న అక్కినేని నాగార్జున ‘భాయ్’ సినిమా ఈ నెలాఖరుకు విడుదల కావడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా గురించి జరిగిన సంఘటన అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఈ మధ్య అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాను నాగార్జున కొందరు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు చూపించాడట. ఆ సినిమా చూసినతరువాత ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆసినిమా బేరసారాలు నాగ్ తో మాట్లాడుకుని బయటకు వచ్చేసారట. ఇంతవరకు బాగానేవుంది ఈ సినిమా చుసిన వ్యక్తులలో ఒక వ్యక్తి సినిమా రివ్యూలు బాగా రాసే ఒక రివ్యూ రైటర్ కు ఈ సినిమా కధ చెపితే అతడు మరీ ఉత్సాహపడిపోయి నాగ్ ‘భాయ్’ కధ ఇదే అంటూ వార్తలు వ్రాయడం.

 ఆ వార్తలును ఆదారంగా చేసుకుని మిగతా వెబ్ మీడియా వారు కూడా కధనాలు వ్రాయడంతో చిర్రెత్తి పోయిన నాగ్ సినిమా చూపించకుండా రైట్లు అమ్ముతాము అంటే సినిమా చూడకుండా ఎలా కొంటాము అని అడిగే కొందరు డిస్ట్రిబ్యూటర్లు తీరా సినిమా చుసిన తరువాతా ఇలా లీకులు ఇచ్చుకుంటూ పోతే సినిమాలు పరిస్థితి ఏమిటీ అని తల పట్టుకుంటున్నాడట. సినిమా మాని చూడకుండా ఎవరో చెప్పిన కధను ఆధారంగా తీసుకుని మూడు పేరాలలో కధను రాసి లీకులిస్తూ ఉంటే అటు పైరసీ ఇటు లీకుల మధ్య ఇక భవిష్యత్ లో సినిమాలు తీయడం కష్టమే అంటూ తన ‘భాయ్’ సినిమాను చూసి లీక్ లు ఇచ్చిన ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ పై చాల కోపంగా ఉన్నాడట మన నాగ్..

No comments:

Post a Comment