10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. స్వచ్చందంగా బంద్ లో ప్రజలు, వ్యాపార , విద్యా సంస్థలు పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం పట్టించుకోలేదు అని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం పట్టించుకోలేదని ప్రకటనలో తెలిపారు. బంద్ కు సమాజంలోని ప్రతి పౌరుడు మద్దతివ్వాలని వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినాశనం దిశగా మరో అడుగు అని వైఎస్ జగన్ అన్నారు. Thursday, 5 December 2013
విభజనకు నిరసనగా రేపు రాష్ట్ర బంద్: వైఎస్ జగన్
10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. స్వచ్చందంగా బంద్ లో ప్రజలు, వ్యాపార , విద్యా సంస్థలు పాల్గొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం పట్టించుకోలేదు అని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నా కేంద్రం పట్టించుకోలేదని ప్రకటనలో తెలిపారు. బంద్ కు సమాజంలోని ప్రతి పౌరుడు మద్దతివ్వాలని వైఎస్ జగన్ విజ్క్షప్తి చేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం వినాశనం దిశగా మరో అడుగు అని వైఎస్ జగన్ అన్నారు. 10 జిల్లాల తెలంగాణనే ఫైనల్..?
న్యూఢిల్లీ : రాయల తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఉపసంహరించుకుని 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అనంతపురం, కర్నూలు జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకరావడంతో కేంద్ర వెనక్కితగ్గినట్టు తెలుస్తోంది. బలవంతంగా ఏర్పాటు చేస్తే ఇరు ప్రాంతాల్లోనూ దెబ్బతింటామనే ఆలోచనలో పడినట్టు సమాచారం. అంతేగాక, రాయల తెలంగాణకు మద్దతు ఇవ్వబోమని బీజేపీ ప్రకటించడంతో కాంగ్రెస్ పునరాలోచనలో పడింది. బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడుతో కేంద్ర మంత్రి జైరాం రమేష్ కలిసి ఈ విషయంపై చర్చించారు. రాయల తెలంగాణకు వెంకయ్య నాయుడు ససేమిరా అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 10 జిల్లాలతో కూడిన తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు రావచ్చని భావిస్తున్నారు.
సాయంత్రం ఐదుగంటలకు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది.తెలంగాణయా? రాయల తెలంగాణయా అనేది కేంద్రకేబినెట్ భేటీ తర్వాత అధికారికంగా తేలిపోనున్నది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ సీడబ్లూసీ, కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తుందా లేక రాయల తెలంగాణకు ఆమోదం తెలుపుతుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. విభజనపై చర్చల పర్వాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా చర్చోప చర్చలు చేస్తున్న మంత్రుల బృందం తన నివేదికను ఇవాళ కేబినెట్‌కు సమర్పించనుంది.
జీఓఎం సిఫారసులపై కేబినెట్లో వాడీవేడి చర్చ జరగనున్నది. సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసంలో భేటీ అయిన ఆ ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు చేసినట్టు సమాచారం. రాయల తెలంగాణ అంశాన్ని ఆ ప్రాంత నేతలు తేల్చుకుంటారు..దాంతో మాకు సంబంధం లేదనే వాదనను కావూరి, పళ్లంరాజు చేస్తున్నారు. రాయలసీమను విభజించకూడదని...ఇవ్వాల్సి వస్తే రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలనేది మంత్రి కిషోర్‌చంద్రదేవ్ వాదన. మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి రాయల తెలంగాణకు మద్దతు పలుకుతున్నారు...మంత్రుల బృందంలోను తెలంగాణా? రాయల తెలంగాణా? అనేదానిపై అభిప్రాయ భేదాలున్నాయి.
Subscribe to:
Posts (Atom)