బాలీవుడ్ నటి కాజోల్ నివాసంలో దొంగతనం జరిగింది. కాజోల్కు సంబంధించిన 17 బంగారు గాజులను దొంగిలించిన ఇద్దరు పని మనుషులను ముంబై పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి కాజోల్ నివాసంలో పనిచేస్తున్న వారు కొన్ని రోజుల క్రితం ఇంట్లోని బంగారు ఆభరణాల దొంగతనానికి పాల్పడ్డారు. జుహు పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలోని జుహులో ఉన్న భవనంలో కాజోల్, ఆమె భర్త అజయ్ దేవగణ్ నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నివాసంలో 12మంది పని మనుషులు ఉన్నట్లు తెలిపారు. దీపావళి పండగ సందర్భంగా తమ ఇంటిని శుభ్రం చేసేందుకు మరో ముగ్గురు పని మనుషులను అక్టోబర్ 15న తీసుకున్నారు. కాగా అక్టోబర్ 23న కాజోల్ తనకు సంబంధించిన రూ. 5లక్షల విలువైన బంగారు గాజులు పోయినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎవరైతే కొత్తగా తన నివాసంలో పని మనుషులుగా వచ్చారో వారిపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అక్టోబర్ 23న తన పడకగదిలోని ఒక పెట్టెలో ఆ గాజులను భద్రపర్చినట్లు పోలీసులకు కాజోల్ తెలిపింది. తదుపరి రోజు అందులోనే ఉన్నట్లు గుర్తించానని, అక్టోబర్ 22న అవి అదృశ్యమైనట్లు కనుగొన్నట్లు ఆమె తెలిపింది. తమ విచారణలో కాజోల్ నివాసంలో గతమూడు సంవత్సారాలుగు పని చేస్తున్న సంతోష్ పాండే, గాయత్రి దేవేంద్రన్లు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. బంగారు గాజులు, ఇతర ఆభరణాలను దొంగిలించిన నిందితులు సెరిసగం పంచుకున్నారని, కొంతకాలం తర్వాత అమ్మేయాలనుకున్న నిందితులు బంగారు గాజులను మురికి కాలువలో దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిందితులను పోలీసులు కస్టడీకి తరలించారు.
Wednesday, 30 October 2013
నటి కాజోల్ ఇంట్లో దొంగతనం: నిందితుల పట్టివేత

పవర్ స్టార్ దారినే ఎంచుకున్న ఉపేంద్ర !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేలిబ్రేటీగా మారిపోయాక మన తెలుగు హీరోలకే కాదు, దక్షణ భారతదేశ సినిమా రంగం ప్రముఖులకు కూడా ఆరాధ్య దైవంగా మారిపోయాడు. టాలీవుడ్ లో పవన్ కు ఎటువంటి ఇమేజ్ ఉందో కన్నడ సినిమా రంగంలో ఉపేంద్రకు కూడా ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉంది. అనేక వెరైటీ సినిమాలు నటించిన కెరియర్ గ్రాఫ్ ఉపేంద్రది, కన్నడ ప్రేక్షకులు ఇతని నటనను విపరీతంగా ఇష్టపడతారు. ఉపేంద్ర నటించిన చాల సినిమాలు తెలులో కూడా డబ్ అయి విజయవంతం సాధించాయి. గత కొద్దికాలం గా కన్నడ సినిమా రంగంలో సైలెంట్ గా ఉన్న ఉపేంద్ర ఈ మధ్య కన్నడంలో విడుదల అయిన ‘టోపీవాలా’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపెట్టాడు. నల్ల ధనం కధా వస్తువుతో ఈ సినిమా నిర్మింపబడింది. ఈసినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ ‘టోపీవాలా’ సినిమాకు తెలుగు ప్రేక్షకుల అభిరుచిని బట్టీ ఏ టైటిల్ పెట్టాలి అని దర్శకుడు ఎం.జి. శ్రీనివాస్ ఆలోచిస్తూ ఉంటే కన్నడ హీరో ఉపేంద్ర ఈ మధ్య విడుదలై సంచలనం సృస్టించిన ‘పవన్ అత్తారింటికి దారేది’ టైటిల్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ‘స్విస్ బ్యాంక్ కు దారేది’ అనే టైటిల్ ను పెడితే తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అని ఉపేంద్ర ఈ సినిమా నిర్మాతలకు సూచించాడట. ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. పవన్ ‘అత్తారిల్లు’ లా ఉపేంద్ర కు స్విస్ బ్యాంక్ కు దారేది ఏ దారికి తీసుకేడుతుందో చూడాలి...
Subscribe to:
Posts (Atom)