Monday, 30 September 2013

అందుకు జగన్ కు 16 నెలలు జైలా?


<img class=alignnone size full wp image 96913 alt=Jagan Jail t src=http://apgossips.com/wp content/uploads/2013/09/Jagan Jail t.gif width=213 height=20 />

జగన్ పార్టీలో సీట్లు బుక్కయిపోతున్నాయి..!


ఆలసించిన ఆశాభంగం.. ఇంకా లేట్ అయితే సీట్లు దొరికే అవకాశాలు లేవు. తొందరగా వచ్చేసి ఒక సారి జగన్ బాబు ను పొగిడేసి.. చంద్రబాబును, సోనియాను తిట్టేస్తే సీటు గ్యారెంటీ.. పోటీలో నిలబడగలిగే సత్తా ఉంటే.. జగన్ అనుగ్రహం గ్యారెంటీ.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ల నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఈ విధమైన నోటీస్ పంపిస్తోంది వైకాపా. ఇది సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం నేతల్లో కలవరం పుట్టిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై చేస్తున్న కసరత్తుతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. తాము ఆ పార్టీలోకి వె ళ్లేందుకు ఎదురుచూస్తుంటే అభ్యర్థుల ఎంపిక జరిగి పోతోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాము ఆశిస్తున్న సీటు దొరుకుతుందా లేక ఇతరులకు ఇప్పటికే కేటాయించారా అన్న అన్వేషణలో పడ్డారు. ఇప్పటికే ఎవరి కైనా జగన్ ఆ సీట్లు కట్టబెడితే తమ పరిస్థితి ఏమిటి అని వారు భయపడుతున్నారు. విభజన విషయంలో సీమాంధ్ర వ్యతిరేక వైఖరి ని కనబరుస్తున్న అధిష్టానాన్ని తిట్టి.. కాంగ్రెస్ నుంచి బయటపడటమే మంచిదని వారు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్విషయానికి వస్తే.. ఆ మధ్య ఎప్పుడో రాహుల్‌గాంధీ టీం రాష్ట్రంలో విస్త్రతంగా పర్యటించి ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలపై జనం వ్యతిరేకత ఏమేర ఉంది, ఆయా స్థానాలలో ఎక్కడైనా మార్పులు, చేర్పులు చేపట్టాలా అన్న సర్వే చేశారు. ఈ క్రమంలోనే వారు గెలుపు గుర్రాలను ఎంపిక చేసినట్లు సమాచారం.అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

Josh Media and Events Launch By Sesh Advi


presently he is now at bahubali shoot..

రేవంత్ రెడ్డి రేటు నాలుగువందల కోట్లట!


టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తాజాగా ఒక పత్రికాధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలన విషయాలను చాలా సరదగా చెప్పాడు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సంధించిన ఆకర్ష గురించి రేవంత్ స్పందించాడు. వైఎస్సార్ ఆకర్ష అస్త్రం తన వరకూ వచ్చిందని రేవంత్ చెప్పాడు. తనకు 15 కోట్ల వరకూ ఆఫర్ చేసి.. కాంగ్రెస్ వైపు రావాల్సిందిగా కోరారని రేవంత్ రెడ్డి చెప్పాడు. అయితే తాను నాలుగువందల కోట్ల రూపాయలు ఇస్తే.. కాంగ్రెస్ లో చేరతాని సమాధానం ఇచ్చినట్టుగా రేవంత్ చెప్పాడు. ఇందులో నిజానిజాల మాటేమిటోకానీ.. వినడానికి అయితే ఆసక్తి కరంగా ఉంది. ఎమ్మెల్యేల ధర పది నుంచి 15 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని రేవంత్ రెడ్డి అనడం విశేషం. మరి ఈయన నాలుగువందల కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం అనేది.. తనకుపార్టీ మారే ఉద్దేశం లేదన్నదారికి రుజువు అనుకోవాలేమో! మరి ఆ రోజుల్లోనే ఎమ్మెల్యేల ధర.. 15 కోట్లంటే.. మరి ఇప్పుడు అది ఏ స్థాయికి చేరి ఉండాలో! అలాగే తాను ఎమ్.పి పదవికి పోటీచేస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. తెలంగాణ వచ్చాక తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉంటానని కూడా ఆయన అన్నాడు. ఈయన మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నాడు అని వినికిడి.

సల్మాన్ ని భాయ్ అందేంటబ్బా!


బాలీవుడ్ బాక్సాఫీసుతో ఆడుకుంటాడు సల్మాన్ ఖాన్. రికార్డులు క్రియేట్ చేయడం, వాటిని బ్రేక్ చేసి మళ్లీ కొత్త రికార్డులు సృష్టించడం చాలా ఈజీ మనోడికి. అందుకే నిర్మాతలు అతడిని నమ్మి కోట్లు కుమ్మరిస్తారు. దర్శకులు అతడితో పని చేయడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ఇక హీరోయిన్లయితే అతడి పక్కన నటించాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అలాంటిది ఓ ముద్దుగుమ్మ సల్మాన్ ని భాయ్ అని సంబోధించి ఆశ్చర్యపరిచింది. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఒలీవియా కల్పో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ప్రస్తావన వచ్చింది. ఆమె భవిష్యత్ ప్రణాళికలను గురించి, సినిమాల్లోకి వచ్చే ప్లాన్స్ గురించి అడిగినప్పుడు సల్మాన్ తో నటించాలని ఉంది అని చెప్పింది ఒలీవియా. అయితే సల్మాన్ ఖాన్ అని కాకుండా సల్మాన్ భాయ్ అంది ఒలీవియా. ఇప్పటికే అతడిని కలవడానికి సిద్ధమవుతోందట. అయితే సినిమాల గురించి కాదు. భ్రూణహత్యలకు వ్యతిరేకంగా జరగనున్న ఓ క్యాంపెయిన్లో తనతో పాటు పాల్గొనమని అడగడానికి. త్వరలోనే అతడిని కలుస్తాను అంటూ ఆనందంగా చెప్పింది. కలుస్తుంది సరే. కానీ ఎవరైనా అతడి పక్కన హీరోయిన్ గా కదా చేయాలని ఆశపడతారు! మరి ఈ సుందరాంగి అన్నయ్య అనేస్తే, ఆమెకు ఆ చాన్స్ ఎలా దక్కుతుంది! ఒకవేళ బాలీవుడ్లో పనిచేసేంత ఆసక్తి లేక అలా అన్నదా అంటే అదీ లేదు. పాపకి హిందీ సినిమాల గురించి ఫుల్ క్లారిటీ ఉంది. చాన్స్ వస్తే చేసేంత ఇంటరెస్ట్ కూడా ఉంది. కానీ పాపం అంత దూరం ఆలోచించి ఉండదు. అయినా మాట మార్చడం ఎంతసేపులెండి. అతడి పక్కన నటిస్తావా అని అడిగి చూడండి... ఎగిరి గంతేస్తుంది. అన్నా అని పిలిచిన విషయం వెంటనే మర్చిపోతుంది. అసలు నేనెప్పుడు అన్నాను అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు!

బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కేసు 7కు వాయిదా


న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 : సీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కేసు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా పడింది. సోమవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు వాయిదా వేసింది. ఆదివారం నాడు బీసీసీఐ అధ్యక్షుడుగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతారని, అయితే ఐపీఎల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని కోర్టు ఆదేశించింది. 

నాకు క్రైమ్ అంటే ఆసక్తి ఎక్కువ: రామ్‌గోపాల్ వర్మ


ది మమ్ముత్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'సత్య-2'. శర్వానంద్, అనైక సొటి, అమిత్రియాన్ పాటిల్, ఆరాధన కీలక పాత్రధారులు. ఈ సినిమాకు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌కుమార్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆడియో విడుదల సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పూరి సంగీత్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని పూరి జగన్నాథ్ విడుదల చేసి బోయపాటి శ్రీనుకు అందజేశారు. సంజీవ్-దర్శన్, నితిన్ రైక్వర్, ఇష్క్ బెక్టర్ సంగీతాన్ని అందించారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ "నేను 'సత్య' ముందు వరకు క్లారిటీతో సినిమాలు చేశాను. ఆ సినిమాను కన్‌ఫ్యూజ్డ్‌గా చేశాను. అయినా సినిమా హిట్ అయింది. నాకు క్రైమ్ అంటే ఆసక్తి మెండుగా ఉంటుంది. నేను నేరస్తుల గురించి ఇంత పరిశోధన చేసి దర్శకుడిని కాకుండా, డాన్ అయి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుని ఈ కథ రాసుకున్నాను. నాకున్న ఆసక్తితో ఓ డ్యూయట్ కూడా పాడాను. ఆ పాటను ప్రత్యేకంగా కాశ్మీర్‌లో తెరకెక్కించాను. శర్వానంద్ కళ్లలోని ఇంటెన్సిటీని గమనించి ఈ పాత్రకు ఎంపిక చేశాను. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఫ్యూచరిస్టిక్ స్టోరీ'' అని తెలిపారు. సినిమా బాగా వచ్చింది. వర్మగారితో సినిమా చేయడం ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. "కలలు నిజం కావని చాలా మంది అంటారు. కానీ వర్మతో సినిమా చేయాలని నేను కన్న కల నిజమైంది. సత్య-2లో నా పాత్ర మెప్పిస్తుంది. ఈ సినిమా చేశాక జీవితం పట్ల నా దృక్పథం మారింది'' అని శర్వానంద్ అన్నారు. జీవితంలో పైకి రావాలనుకునేవారు తమ ఆలోచనలను ఆర్డర్‌లో పెట్టుకోవాలంటే తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందేనని పూరి జగన్నాథ్ చెప్పారు. సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నాయికలు చెప్పారు. మంచి సంగీతం కుదిరిందని సంగీత దర్శకులు అన్నారు. పాటలు, సినిమా పెద్ద హిట్ కావాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఐజీ సీతారామాంజనేయులు, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, హరీష్ శంకర్, నందినిరెడ్డి, కోన వెంకట్, సందీప్ కిషన్, మధుశాలిని, ఆర్పీ పట్నాయక్, ఉత్తేజ్, దేవాకట్టా, బ్రహ్మాజీ, సిరాశ్రీ, కమల్ కామరాజు, రవివర్మ తదితరులు ఆకాంక్షించారు. - See more at: http://www.andhrajyothy.com/node/1872#sthash.2xQdm1qe.dpuf

సమైక్య తీర్మానంపై తొలి సంతకం నాదే: వైఎస్ జగన్


కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలని, కేబినెట్ నోట్ తయారయ్యాక ఇక అసెంబ్లీ తీర్మానానికి ప్రాధాన్యం ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన రెడ్డి అన్నారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు యథాతథంగా... * 16 నెలలుగా నేను జైలులో ఉన్నా కూడా తరగని ఆప్యాయతలతో అభిమానం చూపించిన రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి అన్న తమ్ముడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. * కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలి. సమైక్య తీర్మానం చేయాలి. కేబినెట్ నోట్ తయారయిన తరువాత తీర్మానం చేసినా ప్రాధాన్యత ఉండదు. అందువల్ల వెంటనే అసెంబ్లీని సమావేశపరచండి. తీర్మానం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్ర విభజనకు వ్యతిరేకత తెలుపుతున్న విషయం దేశంలోని అందరికీ, కేంద్రంలోని పెద్దలకు తెలుస్తుంది. * రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న విషయంలో నిజాయితీగా పని చేస్తున్న పార్టీలు కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి మనసా వాచా కట్టుబడి ఉన్నాయి. మిగిలిన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. ఒక తండ్రిగా ఆలోచించి న్యాయం చేయాలి. తండ్రి వద్దకు కూతురు గానీ, కొడుకు గానీ వచ్చి తమకు అన్యాయం జరుగుతోందని చెబితే వినే పరిస్థితిలో తండ్రి ఉండాలి. ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ పార్టీలు అన్యాయం జరుగుతున్నా అడగడంలేదు.

జగన్ కు మళ్లీ షాకిచ్చిన సబ్బం


జగన్ బండారాన్ని బహుచక్కగా బయటపెట్టిన అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చాలా కూల్ గా జగన్ కు మరోసారి షాకిచ్చాడు. నన్ను పార్టీలోంచి తీసేస్తున్నారనో, లేక తనది జగన్ పార్టీ కాదనో వాళ్లు చెప్పారు అందులో ఏమాత్రం తప్పులేదు, ఎందుకంటే తాను వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తాను అని చెప్పుకుంటున్నాను కాబట్టి వారు అలా అనడంలో తప్పేంటి అన్నారు. ఇక తను జగన్ విషయంలో అన్న మాటలు తప్పు అని, అవి నావ్యక్తిగతమని అన్నారు చూడండి... అవి మాత్రం శుద్ద అబద్దం అని చెప్పి మరోసారి జగన్ కు షాకిచ్చారు సబ్బం. అవును నేను జగన్ పార్టీలోకి ఇంకా చేరలేదు, అంతెందుకు నేనింకా ఆ పార్టీలో చేరుతున్నానని దరఖాస్తు కూడా చేసుకోలేదన్నారు. కాని నాకు జగన్ పార్టీలో చేరాలని ఉన్న కోరిక మాత్రం వాస్తవం, వారు టికెటిస్తే రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను, లేదంటే ఇంకా సంతోషం అన్నారు సబ్బం హరి. అయితే ఆయన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏకు మద్దతిస్తానని నేను చెప్పడంలో వందశాతం నిజముందని అన్నారు. కారణం నేను ఈ మాట నిన్న చెప్పాను, కాని విజయమ్మ, జగన్ లు ఈ మాటను ఇప్పటికి 15 సార్లు చెప్పారని అన్నారు. మతతత్వ పార్టీ బిజేపికి మదతిచ్చే ప్రసక్తి లేదని, కాబట్టి యూపిఏకే తమ మద్దతుంటుందని ఎన్నో సార్లు విజయమ్మ, జగన్ లు అన్నారని వారు ఈ మాటలు రహస్యంగా లోలోపల అనలేదని, ఎన్నో సార్లు మీడియా ముందే అన్నారని జగన్ గుట్టును మరింత రట్టు చేసాడు సబ్బం హరి. అయినా తొందరెందుకు ఎన్నికలు కావడానికి ఎన్నో రోజులు సమయం లేదు కదా, అవి అవడం, జగన్ మద్దతివ్వడం మనం చూస్తాం కదా... అప్పుడు అందరికి నిజం ఏంటో తెలుస్థుంది కదా అంటూ జగన్ కు జబర్దస్థ్ షాకిచ్చాడు అని రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

SURYA RARE PHOTOS


నోట్, డ్రాఫ్ట్ అయ్యాకా నెత్తినోరు బాదుకుంటారా : జగన్


తెలంగాణపై నోట్, డ్రాఫ్ట్ అయ్యాక నెత్తినోరు బాదుకుంటే ఏం లాభమని జగన్ ప్రశ్నించారు. ఇప్పటికే సిడబ్ల్యూసి తీర్మాణం అయ్యేంత వరకు చూస్తే సమస్య ఎంత జఠిలం అయ్యిందో చూసారుగా అన్నారు. అందుకే ఆ ప్రమాదం మళ్లీ రావద్దంటే నోట్ తయారు కాకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. అందుకే ఆ పనికోసం అసెంబ్లీని సమావేశ పరిచేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరానని చెప్పారు. అసెంబ్లీ సమైక్య తీర్మాణం చేసాకా కేంద్రం ముందుకు పోయే సాహసం చేయదన్న ఆశాభావం నాకుందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయమన్న వాళ్లు రాష్ట్ర ప్రయోజనాలను కాస్తా ఆలోచిస్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ వారు ఇప్పుడు ఇక్కడ సమైక్యం అంటున్నారు, వారికి తెలియదా, వారి అధిష్టానం ఏం చేయబోతోందో, అప్పడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. సరే తరవాత నిజం తెలుసుకున్నాడు అనుకుందాం, అలాంటప్పుడు ఆయన ఇచ్చిన లేఖను వాపసు తీసుకోవచ్చు కదా.. అలా కాకున్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మరో లేఖనైనా రాయొచ్చు కదా అన్నారు. కాని చంద్రబాబు ఆ పని చేయడం లేదంటే దానర్థం ఏంటి అన్నారు. రాష్ట్రంలో సమైక్యం కోరుకుంటున్న పార్టీలు కేవలం ఎంఐఎం, సిపిఎం, వైఎస్సార్ సిపి లేనని ఆయన స్పష్టం చేసారు.

ఇక సమరమే... హోల్ ఆంద్రా నాదే : జగన్


నాకు తెలంగాణ, రాయలసీమ, ఆంద్రా, కోస్తాంధ్ర అంతా ఒక్కటేనని, నా తండ్రి వైఎస్సార్ అందరి వాడని నేను కూడా అంతేనని అందుకే త్వరలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సమైక్య శంఖారావం నిర్వహించబోతున్నాని చెప్పారు. ఇది అక్టోబరు 13నుంచి 20 తేదీలోపు ఉండవచ్చని చెప్పారు. దీనికోసం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుంచి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేసారు. పోలవరానికి జాతీయ హోదా అంటున్నారు, రాష్ట్రం విడిపోతే పోలవరానికి నీళ్లెక్కడి నుంచి ఇస్తారు. తెలంగాణలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మంజూరు చేసి పనులు ప్రారంభించింది తన తండ్రి వైఎస్సార్ అని ఆయన మరణం తర్వాత అది ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదన్నారు. ఇలా విడిపోతే నెలకొనె సమస్యలను అన్నింటిని వివరించారు. నేను కుమ్ముక్కయ్యాను అంటున్నారు, అలాగయితే 16 నెలలు జైల్లో ఎందుకు ఉంటాను అని ఆయన చెప్పారు. కాంగ్రెస్ కు చెందిన మాజి మంత్రి శంకర్రావు, తెలుగుదేశం నేత అశోక్ గజపతి లు వేసిన పిటిషన్ మేరకే కదా తనపై సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించిందని జగన్ గర్తు చేసారు. వైఎస్సార్ చనిపోతే ఆ బాదలో ఉన్నాడు ఆయన కొడుకు జగన్ అని కూడా చూడకుండా వారు కోర్టుకు వెల్లడం ఎంత దారుణమో అర్థం చేసుకోండి అన్నారు. అయినా కోర్టు తనను నిందితుల జాబితాలో 52వ నెంబరుగా చేర్చి మొదటి 12 పేర్లను ప్రభుత్వ శాఖలనే పేర్కొంటే కావాలని నివేదికలు సమర్పించకుండా నన్ను ఇరికించే ప్రయత్నం చేసారు కదా అన్నారు. ఇలా తనపై జరిగిన కుట్రలను రట్టు చేయడమే కాకుండా రాష్ట్రం విడిపోవడానికి కారకులెవరు, దానికోసం తానేమి చేయబోతున్నాడో కూడా చెప్పి జగన్ ఇక సమరానికి సిద్దమవుతున్నానన్న సంకేతాలు జారీ చేసాడు.

ఆంధ్రలో నీలాంటి మేధవి ఉంటే..నువ్వే ఉండేవాడివి కాదు కేసీఆర్!


అసలు ఆంధ్రలో ఎవడన్న మేధావి, ఉన్నడో లేడో అర్థం కావడం లేదనీ.. అని అన్నాడు కేసీఆర్. సకలజనుల భేరీ లో కేసీఆర్ కు ఈ సందేహం వచ్చింది.అయితే సూటిగా చెప్పాలంటే ఆంధ్రలో కేసీఆర్ అంతటి మేధావి లేడు. జనాలను రెచ్చగొట్టే తెలవితేటలు ఎవరికీ లేవు. అవే ఉండి ఉంటే.. కేసీఆర్ అంతటి మేధావే ఉండి ఉంటే..హైదరాబాద్ ఈ పాటికి అల్లకల్లోలం అయ్యేది. రెండు నెలలుగా సాగుతున్న సమైక్యవాద ఉద్యమం ఎప్పుడో హింసాత్మకం అయ్యేది! సకలజనుల భేరీలో చూశాం.. కేసీఆర్ జనాలను ఎలా రెచ్చగొడతాడో.. ఎలా విధ్వేషాలను రగల్చగలడో.. మరి ఆంధ్రలో ఇలాంటి మేధావి లేకపోవడమే మంచిదైంది. ఒకవేళ ఉండి ఉంటే.. అతడూ ఇలాగే జనాలను రెచ్చగొట్టి ఉంటే.. జనాలు కత్తులు తీసుకునిపొడుచుకు చ్చేవారు. పనిలో పనిగా కేసీఆర్్ ను కూడా ఒక పోటు పొడిచేవారు. పీడ విరగడైందనే వారు.. అని అంటున్నారు సమైక్యవాదులు. వెంట్రుకలు పీకలేరు.. జుట్టు పీకలేరు.. అంటూ అత్యంత నీఛంగా మాట్లాడుతూ.. సమస్యను తెలంగాణ నుంచి దారి మళ్లీస్తూ.. రెండు ప్రాంతాల మధ్య విధ్వేషాలను పెంచుతున్నాడు కేసీఆర్. ఇది నిస్సందేహమైన విషయం. ఇన్ని రోజులూ.. సమైక్య కాంక్ష లేని ప్రజల్లో కూడా కేసీఆర్ మాటలను విన్నాకా.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్న కోరిక పుట్టి ఉంటుందనడంలో సందేహం లేదు.

మంచు మనోజ్ కు లక్ష్మి డార్లింగ్ అట...!


మొన్న సాయంత్రం భాగ్యనగరంలో జరిగిన ‘దూసుకేళ్తా’ ఆడియో వేడుకలో హీరో మంచు మనోజ్ చేసిన ఓవర్ యాక్షన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. తెలుగు సాంప్రదాయ సినిమాలకు చిరునామాగా పిలవబడే రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు ల సమక్షంలో హీరో మంచు మనోజ్ తన సోదరి మంచు లక్ష్మి ప్రసన్నను డార్లింగ్ అంటూ సంబోధించడం ఆవేడుకకు విచ్చేసిన అతిధులకు, అలాగే ఆ ఆడియో వేడుకను లైవ్ టెలికాస్ట్ లో చూస్తున్న వీక్షకులకు అతిగా అనిపించింది. ఈమధ్య ఈ ఆడియో వేడుకలలో సినిమా హీరోలు చేస్తున్న ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువగా ఉంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులకు కూడా సమస్యగా మారుతోంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, చిన్న సినిమాల ఆడియో వేడుకలు జరుగుతున్నప్పుడు ఆ ఆడియో వేడుకలో హీరోను పోగిడినప్పుడల్లా చప్పట్లు కొట్టి అల్లరి చేసే ఒక ప్రత్యేకమైన గ్రూప్ ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమకు అందుబాటు లో ఉందట. అందువల్ల ఏ ఆడియో వేడుక జరిగినా ఆ గ్రూప్ ను పిలిస్తే చాలు, ఇక సందడే సందడి. ఆ విదానంగానే మంచు వారి కుటుంబం ‘దూసుకేళ్తా’ ఆడియో వేడుక కూడా జరిగింది అని అంటున్నారు. ఇక ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో మనోజ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ప్రతీ విషయంలోనూ క్రమశిక్షణ గురించి, డిసిప్లెన్ గురించి ఉపన్యాసాలు ఇచ్చే మోహన్ బాబు సమక్షంలోనే ఒకసారి కాదు అనేక సార్లు మనోజ్ తన సోదరి లక్ష్మి ని డార్లింగ్ డార్లింగ్ అంటూ సంబోధించడం చూసినవారు అంతా మనం తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ లో ఉన్నామా..? లేక అమెరికాలో జరుగుతున్న కార్యక్రమంలో ఉన్నామా..? అంటూ చెవులు కొరుక్కోవడం స్పష్టంగా కనిపించింది. అయినా సోదరిని డార్లింగ్ అంటూ కొత్త సంబోధనతో పలరిస్తున్న మంచు మనోజ్ నిఘంటువు లోని ఈ డార్లింగ్ పధం అర్ధానికి అర్ధం వెతకాలి అంటే మంచు మనోజ్ నే అడగాలి.

ఇడుపులపాయ వెళ్లేందుకు జగన్కు అనుమతి


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ వెళ్లేందుకు నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చింది. తన బెయిల్ షరతులను సడలించాలని, వచ్చే నెల 1, 2 తేదీలలో ఇడుపులపాయ, 4న గుంటూరు వెళ్లేందుకు అనుమతించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈరోజు విచారించింది. జగన్ పిటిషన్ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ పై ఆంక్షలు సడలించవద్దని కోరారు. సాక్షులంతా హైదరాబాద్ వెలుపలే ఉన్నారని, జగన్ పలుకుబడి ఉన్న వ్యక్తి అయినందున వారిని ప్రభావితం చేయవచ్చనని సిబిఐ న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో నిందితులు ఇంకా జైల్లోనే ఉన్నారని, వారి బెయిల్ పిటిషన్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపింది. బెయిల్ షరతులు సడలిస్తే తమ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని కౌంటర్ పిటిషన్ లో వెల్లడించింది. సీబీఐ కౌంటర్ పిటిషన్ పై జగన్ తరపు న్యాయవాది సుశీల్ కుమార్ కోర్టులో వాదనలు వినిపించారు. జగన్ పై ఉన్నది హైలీ టెక్నికల్ కేసు అని, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రతి సాక్ష్యం డాక్యుమెంట్ గా రికార్డు అయిందన్నారు. 70 మంది నిందితుల్లో 2౦ మందిని నిర్దోషులని సీబీఐ పేర్కొన్నట్లు వివరించారు. 9 కంపెనీల్లో క్విడ్ ప్రో కోనే లేదని సీబీఐ చెప్పిందన్నారు. కోర్టు కల్పించిన స్వేచ్చను తాము కోల్పోమని, ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులు ఉల్లంఘించమని సుశీల్ కుమార్ న్యాయస్థానానికి విన్నవించారు. తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికే జగన్ ఇడుపులపాయకు వెళ్లనున్నారని తెలిపారు. ఇడుపులపాయ నుంచి తిరిగి హైదరాబాద్ వస్తారని ఆ తర్వాత 4వ తేదీన గుంటూరు వెళ్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఇడుపులపాయకు వెళ్లేందుకు జగన్ కు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో సుదీర్ఘ కాలం తరువాత జగన్ ఇడుపులపాయ వెళ్లనున్నారు. తన తండ్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధివద్ద జగన్ నివాళులర్పించనున్నారు.

మీడియాను దిక్కరించిన రణబీర్ కపూర్ ...!


మీడియా ను మేనేజ్ చేయడం ఒక కళ. రాజకీయ నాయకులనైనా అలాగే ఫిల్మ్ సెలబ్రిటీలనైనా రకరకాల చిత్ర విచిత్ర ప్రశ్నలతో ఇరుకున పెట్టడం మీడియా కు వెన్నతో పెట్టిన విద్య. ఈ రీతిలోనే ఈ మధ్య బాలీవుడ్ మీడియా కంటపడిన రణబీర్ కపూర్ ను మీడియా వ్యక్తులు రకరకాల ప్రశ్నలతో చుట్టుముట్టారు. ఈ మధ్య రణబీర్, కత్రినా కైఫ్ లకు సంబంధించి వారి ప్రైవేటు హాలీ డే స్పాట్ ఫోటోలు మీడియా కు లీక్ కావడంతో అప్పటి నుంచి మీడియా పై చాలా గుర్రుగా ఉంటున్నాడు మన బాలీవుడ్ మిల్కీ బాయ్. ఈ సందర్భంలోనే ఎదురుపడ్డ మీడియా మిత్రులు రణబీర్ ను తన 31 వ పుట్టిన రోజుకు రణబీర్ ప్రేయసి కత్రినా ఏ విలువైన బహుమతి ఇచ్చింది అంటూ ప్రశ్నించే సరికి మన బాలీవుడ్ మిల్కీ బాయ్ కి దిమ్మతిరిగిన కోపం వచ్చి ‘మైండ్ యువర్ వోన్ బిజినెస్’ అంటూ చిందులు వేశాడట రణబీర్. ప్రధానమంత్రి కి కోపం వస్తేనే లెక్క చేయని మీడియా వర్గాలు, రణబీర్ కోపాన్ని లెక్క చేయక మళ్ళీ ప్రేయసి కత్రినా తో మీ డేటింగ్ హాలీ డే ఎప్పుడు..? అని ప్రశ్నిస్తే, దానికి విసురుగా ఆ హాలీ డే కి సంబంధించిన ఫోటోలు లీక్ అవుతాయి కదా...? అప్పుడు తెలుస్తుంది అంటూ విసురుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడట రణబీర్. ‘రాజ్ నీతి’ సినిమా తరువాత వరసపెట్టి సినిమాలు చేస్తున్న కత్రినా- రణబీర్ ల మధ్య ఏదో ఉంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న నేపధ్యంలో రణబీర్ కోపాన్ని బాలీవుడ్ మీడియా పట్టించుకోదు కదా..! ఈ విషయం పాపం మన బాలీవుడ్ మిల్కీ బాయ్ కి తెలియదు కాబోలు.

జగన్ లింకులో అసలు సూత్రదారి అసదుద్దీనే


జగన్ కు సోనియాతో కలిసిన లింకులో అసలు సూత్రదారి ఎంఐఎం నేత అసదుద్దీన్ అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసదుద్దీన్ తో వైఎస్ ఆత్మ కేవిపి రాంచంద్రరావు కలిసి జగన్ – సోనియా లింకును కలిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాదు జగన్ జైలు నుంచి వచ్చిన మరుక్షణం తాను ఎంఐఎంతో కలిసిపోతానని, అందుకోసం అసదుద్దీన్ తో కలిసి చర్చించనున్నానని కూడా ప్రకటించారు. దీంతో ఈ వాదనకు బలం చేకూరుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముందునుంచి సోనియా తీసుకున్న రాష్ట్రవిభజన నిర్ణయం వెనుక అసదుద్దీన్ అసలు పాత్ర పోషించాడన్న వార్తలు వెలుబడ్డ విషయం తెలిసిందే. అంతే కాదు జగన్ కయినా, కాంగ్రెస్ కయినా వారి గెలుపు కోసం ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం. వైఎఎస్ విజయాల వెనుక ముస్లిం ఓటర్ల మద్దతే ప్రధానంగా ఉందని అందరికి తెలుసు. అందుకే జగన్ ఎంఐఎం మద్దతును కోరుకుంటాడు. పైగా అసదుద్దీన్ కూడా కేవలం సిఎం కిరణ్ తోనే విభేదిస్తున్నాడు తప్ప కాంగ్రెస్ తో కాదు. జగన్ కు కూడా ఇప్పుడు సిఎం కిరణే అసలైన శతృవుగా మారనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కిరణ్ ను తప్పించడాని అసదుద్దీన్ కేవిపితో కలిసి జగన్ – సోనియాల మద్య బంధాన్ని కలిపారంటున్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఇప్పుడు కేంద్రస్థాయిలో కూడా జగన్, అసదుద్దీన్ లతో కలసి సోనియా అతి పెద్ద గేమ్ ఆడబోతోందన్న వార్తలు కూడా లేటెస్టుగా వినిపిస్తున్నాయి. ఎంఐఎం తో కలిసి మూడోఫ్రంట్ లో కీలకం అవుతామని జగన్ ప్రకటించాడు. రేపు కేంద్రంలో ఎన్నికలయ్యాక అవసరమైతే ఆ మూడో ఫ్రంట్ ను కూడా చీల్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలపై ఇప్పటి నుంచి జరుగుతున్న మంత్రాంగం అన్న అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న వాదన. ఇప్పటికయితే జగన్ వ్యవహారం పక్కా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉందన్నది వాస్తవం, ఇక రాజకీయాలు మున్ముందు ఎలా ఉంటాయి, ఈ వార్తలు నిజమా, కాదా అంటే ఎన్నికలయ్యేంత వరకు ఆగాల్సిందే.

పవన్ అత్తారింటి పై రాజమౌళి సంచలన వ్యాఖ్యానం..


తెలుగు సినిమా జక్కన్న రాజమౌళి పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను చూసి వెరైటీగా స్పందించారు. నిన్న ఆదివారం తన ‘బాహుబలి’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరీ అత్తారింటికి వెళ్ళాడట రాజమౌళి. ఈ సినిమా గొప్పతనాన్ని తన ట్విటర్ లో మూడు వాక్యాల్లో రాశాడు రాజమౌళి. ఈసినిమాను చూస్తున్నంతసేపు ప్రతి సీన్ లోను పవన్ త్రివిక్రమ్ ల అద్భుతమైన టేలెంట్ తనకు కనిపించిందనీ తన ట్విటర్ లో ట్విట్ చేసారు రాజమౌళి. ఈ మాటలు ప్రతి వ్యక్తి చెప్పేవె అయినా ఒక అద్భుతం గురించి చెపుతున్నప్పుడు అందరు ఇంచుమించు గా ఒకేలా చెప్పవలసి వస్తుందనీ అంటు పవన్ అత్తారిల్లు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అనే విషయాలు గురించి ఆలోచించే కంటే, ప్రస్తుతం ఉన్న సంక్లిష్ట పరిస్థుతులలో తెలుగు సినిమాకు దారి చూపిన సినిమాగా పవన్ ‘అత్తారింటికి దారేది’ చరిత్రలో నిలిచి పోతుంది అని వ్యాఖ్యానించడమే కాకుండా ఒక మంచి కుటుంబ సినిమాను ప్రస్తుతు పరిస్తులలో తీసిన ఘనత త్రివిక్రమ్ హీరో పవన్ లకు మాత్రమే వచ్చితీరుతుందని అభిప్రాయ పడ్డాడు రాజమౌళి. టాలీవుడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈసినిమా 60 కోట్లు పైనే వసూలు చేస్తుందని అంటున్నారు ..

ఆ దమ్మున్నది మహేష్, పవన్ కళ్యాణ్ లకే


భారత సినిమా చరిత్రలో ఆ రికార్డును తిరగరాసే దమ్మున్న హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకే ఉన్నందంటున్నారు సినివిశ్లేషకులు. అందరికి తెలుసు బాక్సాఫీసు వద్ద బద్దలు చేసే కలెక్షన్లు సంపాందించడంలో బాలీవుడ్ ను మించింది లేదు, ఆతర్వాత స్థానం టాలీవుడ్ దే. టాలీవుడ్ లో కూడా బాక్సాఫీస్ బద్దలు చేసే పవర్ కూడా ఉన్న స్టార్లు కూడా పవన్, మహేష్ లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ ఇప్పటికే బాక్సాఫీస్ కలెక్షన్ల రేంజీని 300 కోట్లకు తీసుకెల్లింది. కాని టాలీవుడ్ ఇంకా వంద కోట్లకు కూడా చేరుకోలేదు. ఇప్పటి వరకు మగధీర ద్వారా రాంచరణ్ కొల్లగొట్టిన 89 కోట్లే అధికం ఇక పవన్ గబ్బర్ సింగ్ సాదించింది 65 కోట్లు, మహేష్ బాబు దూకుడు సాదించింది 60 కోట్లే. అయితే రికార్డు రాంచరణ్ మీదే ఉన్నా కూడా తాజాగా పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లకు వస్తున్న క్రేజి, ఇమేజి చూస్తే వందకోట్లకు తీసుకువెల్ల గల సత్తా, దమ్ము వీరిద్దరికే ఉందంటున్నారు.

భయపెడుతున్న జగన్


జగన్ జైలు నుంచి వచ్చి రావడంతో రాజకీయ ప్రత్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న ఘట్టం తోనే అందిరికి గుండె పోటు తెప్పించిన జగన్ ఆతర్వాత తన స్టాండ్ సమైక్యం అంటూ చెప్పి షాకిచ్చారు. ఇదే సమయంలో ఆయన హఠాత్తుగా తన ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర గవర్నర్ ను కలవనుండడం అందరిలో కలవరం పుట్టిస్తోంది. ఆయన గవర్నర్ ను కలవడం వెనుక ఆంతర్యమేమిటి అంటూ టిడిపి, కాంగ్రెస్ లు తెగ టెన్షన్ పడుతున్నాయి. గవర్నర్ ను ఇప్పటికే విజయమ్మ కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని కోరింది, అంతే కాదు ఏకంగా రాష్ట్రపతిని, ప్రధానిని కూడా కలసి వినతి చేసింది, అప్పుడు లేని టెన్షన్ జగన్ కలిస్తే ఎందుకు అని అనుమానం రావడం సహజమే. ఇప్పుడు పరిస్థితులు వేరు, కిరణ్ ను దించి రాష్ట్రపతి పాలన వారం రోజుల్లోపే విదించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో కీలకమైన రాజకీయ పార్టీ అధ్యక్షుడు తన ఎమ్మెల్యేలందరితో వెల్లి కలవడం నిజంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కలవరపెట్టేదే. ఇక ఆయన గవర్నర్ ను కలిసి అసెంబ్లీని సమావేశ పరచేలా చూడండి అని కోరడానికి అంటున్నారు, మంత్రివర్గ సమావేశాన్నే పెట్టుకోలేని ముఖ్యమంత్రి ఇక అసెంబ్లీ సమావేశాన్ని ఎలా పెట్టగలడు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా అనుమతి లేనిది ముఖ్యమంత్రి కిరణ్ ఆ పని చేయగలడా... చేయలేడు. కాని సమైక్య తీర్మాణం కోసం ఈ డిమాండ్ చేయడం ద్వారా జగన్ ను సీమాంద్రలో మైలేజి పెరగడం ఖాయం. అది సీమాంద్రలో హీరోలు కావాలనుకుంటున్న సిఎం కిరణ్, ఆయన వర్గానికి, ఇటు చంద్రబాబు ను కూడా భయపెట్టే అంశమే కదా..