తెలంగాణపై నోట్, డ్రాఫ్ట్ అయ్యాక నెత్తినోరు బాదుకుంటే ఏం లాభమని జగన్ ప్రశ్నించారు. ఇప్పటికే సిడబ్ల్యూసి తీర్మాణం అయ్యేంత వరకు చూస్తే సమస్య ఎంత జఠిలం అయ్యిందో చూసారుగా అన్నారు. అందుకే ఆ ప్రమాదం మళ్లీ రావద్దంటే నోట్ తయారు కాకముందే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపించాలన్నారు. అందుకే ఆ పనికోసం అసెంబ్లీని సమావేశ పరిచేందుకు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరానని చెప్పారు.
అసెంబ్లీ సమైక్య తీర్మాణం చేసాకా కేంద్రం ముందుకు పోయే సాహసం చేయదన్న ఆశాభావం నాకుందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయమన్న వాళ్లు రాష్ట్ర ప్రయోజనాలను కాస్తా ఆలోచిస్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ వారు ఇప్పుడు ఇక్కడ సమైక్యం అంటున్నారు, వారికి తెలియదా, వారి అధిష్టానం ఏం చేయబోతోందో, అప్పడే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.
ఇక చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. సరే తరవాత నిజం తెలుసుకున్నాడు అనుకుందాం, అలాంటప్పుడు ఆయన ఇచ్చిన లేఖను వాపసు తీసుకోవచ్చు కదా.. అలా కాకున్నా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మరో లేఖనైనా రాయొచ్చు కదా అన్నారు. కాని చంద్రబాబు ఆ పని చేయడం లేదంటే దానర్థం ఏంటి అన్నారు. రాష్ట్రంలో సమైక్యం కోరుకుంటున్న పార్టీలు కేవలం ఎంఐఎం, సిపిఎం, వైఎస్సార్ సిపి లేనని ఆయన స్పష్టం చేసారు.
Monday, 30 September 2013
నోట్, డ్రాఫ్ట్ అయ్యాకా నెత్తినోరు బాదుకుంటారా : జగన్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment