
కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలని, కేబినెట్ నోట్ తయారయ్యాక ఇక అసెంబ్లీ తీర్మానానికి ప్రాధాన్యం ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ జగన్మోహన రెడ్డి అన్నారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పిన విషయాలు యథాతథంగా...
* 16 నెలలుగా నేను జైలులో ఉన్నా కూడా తరగని ఆప్యాయతలతో అభిమానం చూపించిన రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి అన్న తమ్ముడికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
* కేబినెట్ నోట్ తయారు కాకముందే అసెంబ్లీని సమావేశ పరచాలి. సమైక్య తీర్మానం చేయాలి. కేబినెట్ నోట్ తయారయిన తరువాత తీర్మానం చేసినా ప్రాధాన్యత ఉండదు. అందువల్ల వెంటనే అసెంబ్లీని సమావేశపరచండి. తీర్మానం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం, రాష్ట్ర విభజనకు వ్యతిరేకత తెలుపుతున్న విషయం దేశంలోని అందరికీ, కేంద్రంలోని పెద్దలకు తెలుస్తుంది.
* రాష్ట్రం సమైక్యంగా ఉంచాలన్న విషయంలో నిజాయితీగా పని చేస్తున్న పార్టీలు కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఎం, ఎంఐఎం మాత్రమే సమైక్యానికి మనసా వాచా కట్టుబడి ఉన్నాయి. మిగిలిన పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి. ఒక తండ్రిగా ఆలోచించి న్యాయం చేయాలి. తండ్రి వద్దకు కూతురు గానీ, కొడుకు గానీ వచ్చి తమకు అన్యాయం జరుగుతోందని చెబితే వినే పరిస్థితిలో తండ్రి ఉండాలి. ఓట్ల కోసం, సీట్ల కోసం రాజకీయ పార్టీలు అన్యాయం జరుగుతున్నా అడగడంలేదు.
No comments:
Post a Comment