Monday, 30 September 2013

జగన్ పార్టీలో సీట్లు బుక్కయిపోతున్నాయి..!


ఆలసించిన ఆశాభంగం.. ఇంకా లేట్ అయితే సీట్లు దొరికే అవకాశాలు లేవు. తొందరగా వచ్చేసి ఒక సారి జగన్ బాబు ను పొగిడేసి.. చంద్రబాబును, సోనియాను తిట్టేస్తే సీటు గ్యారెంటీ.. పోటీలో నిలబడగలిగే సత్తా ఉంటే.. జగన్ అనుగ్రహం గ్యారెంటీ.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ల నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్న ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఈ విధమైన నోటీస్ పంపిస్తోంది వైకాపా. ఇది సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం నేతల్లో కలవరం పుట్టిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై చేస్తున్న కసరత్తుతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. తాము ఆ పార్టీలోకి వె ళ్లేందుకు ఎదురుచూస్తుంటే అభ్యర్థుల ఎంపిక జరిగి పోతోందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తాము ఆశిస్తున్న సీటు దొరుకుతుందా లేక ఇతరులకు ఇప్పటికే కేటాయించారా అన్న అన్వేషణలో పడ్డారు. ఇప్పటికే ఎవరి కైనా జగన్ ఆ సీట్లు కట్టబెడితే తమ పరిస్థితి ఏమిటి అని వారు భయపడుతున్నారు. విభజన విషయంలో సీమాంధ్ర వ్యతిరేక వైఖరి ని కనబరుస్తున్న అధిష్టానాన్ని తిట్టి.. కాంగ్రెస్ నుంచి బయటపడటమే మంచిదని వారు లెక్కలేస్తున్నారు. ఇక కాంగ్రెస్విషయానికి వస్తే.. ఆ మధ్య ఎప్పుడో రాహుల్‌గాంధీ టీం రాష్ట్రంలో విస్త్రతంగా పర్యటించి ప్రస్తుత ఎంపీ, ఎమ్మెల్యేలపై జనం వ్యతిరేకత ఏమేర ఉంది, ఆయా స్థానాలలో ఎక్కడైనా మార్పులు, చేర్పులు చేపట్టాలా అన్న సర్వే చేశారు. ఈ క్రమంలోనే వారు గెలుపు గుర్రాలను ఎంపిక చేసినట్లు సమాచారం.అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

No comments:

Post a Comment