జగన్ కు సోనియాతో కలిసిన లింకులో అసలు సూత్రదారి ఎంఐఎం నేత అసదుద్దీన్ అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసదుద్దీన్ తో వైఎస్ ఆత్మ కేవిపి రాంచంద్రరావు కలిసి జగన్ – సోనియా లింకును కలిపారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాదు జగన్ జైలు నుంచి వచ్చిన మరుక్షణం తాను ఎంఐఎంతో కలిసిపోతానని, అందుకోసం అసదుద్దీన్ తో కలిసి చర్చించనున్నానని కూడా ప్రకటించారు. దీంతో ఈ వాదనకు బలం చేకూరుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ముందునుంచి సోనియా తీసుకున్న రాష్ట్రవిభజన నిర్ణయం వెనుక అసదుద్దీన్ అసలు పాత్ర పోషించాడన్న వార్తలు వెలుబడ్డ విషయం తెలిసిందే. అంతే కాదు జగన్ కయినా, కాంగ్రెస్ కయినా వారి గెలుపు కోసం ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం. వైఎఎస్ విజయాల వెనుక ముస్లిం ఓటర్ల మద్దతే ప్రధానంగా ఉందని అందరికి తెలుసు. అందుకే జగన్ ఎంఐఎం మద్దతును కోరుకుంటాడు. పైగా అసదుద్దీన్ కూడా కేవలం సిఎం కిరణ్ తోనే విభేదిస్తున్నాడు తప్ప కాంగ్రెస్ తో కాదు.
జగన్ కు కూడా ఇప్పుడు సిఎం కిరణే అసలైన శతృవుగా మారనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కిరణ్ ను తప్పించడాని అసదుద్దీన్ కేవిపితో కలిసి జగన్ – సోనియాల మద్య బంధాన్ని కలిపారంటున్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంతే కాదు, ఇప్పుడు కేంద్రస్థాయిలో కూడా జగన్, అసదుద్దీన్ లతో కలసి సోనియా అతి పెద్ద గేమ్ ఆడబోతోందన్న వార్తలు కూడా లేటెస్టుగా వినిపిస్తున్నాయి. ఎంఐఎం తో కలిసి మూడోఫ్రంట్ లో కీలకం అవుతామని జగన్ ప్రకటించాడు. రేపు కేంద్రంలో ఎన్నికలయ్యాక అవసరమైతే ఆ మూడో ఫ్రంట్ ను కూడా చీల్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చే అవకాశాలపై ఇప్పటి నుంచి జరుగుతున్న మంత్రాంగం అన్న అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తున్న వాదన. ఇప్పటికయితే జగన్ వ్యవహారం పక్కా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉందన్నది వాస్తవం, ఇక రాజకీయాలు మున్ముందు ఎలా ఉంటాయి, ఈ వార్తలు నిజమా, కాదా అంటే ఎన్నికలయ్యేంత వరకు ఆగాల్సిందే.
Monday, 30 September 2013
జగన్ లింకులో అసలు సూత్రదారి అసదుద్దీనే

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment