నాకు తెలంగాణ, రాయలసీమ, ఆంద్రా, కోస్తాంధ్ర అంతా ఒక్కటేనని, నా తండ్రి వైఎస్సార్ అందరి వాడని నేను కూడా అంతేనని అందుకే త్వరలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సమైక్య శంఖారావం నిర్వహించబోతున్నాని చెప్పారు. ఇది అక్టోబరు 13నుంచి 20 తేదీలోపు ఉండవచ్చని చెప్పారు. దీనికోసం రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుంచి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
పోలవరానికి జాతీయ హోదా అంటున్నారు, రాష్ట్రం విడిపోతే పోలవరానికి నీళ్లెక్కడి నుంచి ఇస్తారు. తెలంగాణలో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును మంజూరు చేసి పనులు ప్రారంభించింది తన తండ్రి వైఎస్సార్ అని ఆయన మరణం తర్వాత అది ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదన్నారు. ఇలా విడిపోతే నెలకొనె సమస్యలను అన్నింటిని వివరించారు. నేను కుమ్ముక్కయ్యాను అంటున్నారు, అలాగయితే 16 నెలలు జైల్లో ఎందుకు ఉంటాను అని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ కు చెందిన మాజి మంత్రి శంకర్రావు, తెలుగుదేశం నేత అశోక్ గజపతి లు వేసిన పిటిషన్ మేరకే కదా తనపై సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించిందని జగన్ గర్తు చేసారు. వైఎస్సార్ చనిపోతే ఆ బాదలో ఉన్నాడు ఆయన కొడుకు జగన్ అని కూడా చూడకుండా వారు కోర్టుకు వెల్లడం ఎంత దారుణమో అర్థం చేసుకోండి అన్నారు. అయినా కోర్టు తనను నిందితుల జాబితాలో 52వ నెంబరుగా చేర్చి మొదటి 12 పేర్లను ప్రభుత్వ శాఖలనే పేర్కొంటే కావాలని నివేదికలు సమర్పించకుండా నన్ను ఇరికించే ప్రయత్నం చేసారు కదా అన్నారు. ఇలా తనపై జరిగిన కుట్రలను రట్టు చేయడమే కాకుండా రాష్ట్రం విడిపోవడానికి కారకులెవరు, దానికోసం తానేమి చేయబోతున్నాడో కూడా చెప్పి జగన్ ఇక సమరానికి సిద్దమవుతున్నానన్న సంకేతాలు జారీ చేసాడు.
Monday, 30 September 2013
ఇక సమరమే... హోల్ ఆంద్రా నాదే : జగన్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment