ది మమ్ముత్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 'సత్య-2'. శర్వానంద్, అనైక సొటి, అమిత్రియాన్ పాటిల్, ఆరాధన కీలక పాత్రధారులు. ఈ సినిమాకు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌కుమార్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా ఆడియో విడుదల సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. పూరి సంగీత్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని పూరి జగన్నాథ్ విడుదల చేసి బోయపాటి శ్రీనుకు అందజేశారు. సంజీవ్-దర్శన్, నితిన్ రైక్వర్, ఇష్క్ బెక్టర్ సంగీతాన్ని అందించారు.
రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ "నేను 'సత్య' ముందు వరకు క్లారిటీతో సినిమాలు చేశాను. ఆ సినిమాను కన్ఫ్యూజ్డ్గా చేశాను. అయినా సినిమా హిట్ అయింది. నాకు క్రైమ్ అంటే ఆసక్తి మెండుగా ఉంటుంది. నేను నేరస్తుల గురించి ఇంత పరిశోధన చేసి దర్శకుడిని కాకుండా, డాన్ అయి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుని ఈ కథ రాసుకున్నాను. నాకున్న ఆసక్తితో ఓ డ్యూయట్ కూడా పాడాను. ఆ పాటను ప్రత్యేకంగా కాశ్మీర్లో తెరకెక్కించాను. శర్వానంద్ కళ్లలోని ఇంటెన్సిటీని గమనించి ఈ పాత్రకు ఎంపిక చేశాను.
ఇది సైన్స్ ఫిక్షన్ కాదు. ఫ్యూచరిస్టిక్ స్టోరీ'' అని తెలిపారు. సినిమా బాగా వచ్చింది. వర్మగారితో సినిమా చేయడం ఆనందంగా ఉందని నిర్మాత అన్నారు. "కలలు నిజం కావని చాలా మంది అంటారు. కానీ వర్మతో సినిమా చేయాలని నేను కన్న కల నిజమైంది. సత్య-2లో నా పాత్ర మెప్పిస్తుంది. ఈ సినిమా చేశాక జీవితం పట్ల నా దృక్పథం మారింది'' అని శర్వానంద్ అన్నారు. జీవితంలో పైకి రావాలనుకునేవారు తమ ఆలోచనలను ఆర్డర్లో పెట్టుకోవాలంటే తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందేనని పూరి జగన్నాథ్ చెప్పారు. సినిమాలో నటించడం ఆనందంగా ఉందని నాయికలు చెప్పారు. మంచి సంగీతం కుదిరిందని సంగీత దర్శకులు అన్నారు. పాటలు, సినిమా పెద్ద హిట్ కావాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఐజీ సీతారామాంజనేయులు, మంచు విష్ణు, లక్ష్మీప్రసన్న, హరీష్ శంకర్, నందినిరెడ్డి, కోన వెంకట్, సందీప్ కిషన్, మధుశాలిని, ఆర్పీ పట్నాయక్, ఉత్తేజ్, దేవాకట్టా, బ్రహ్మాజీ, సిరాశ్రీ, కమల్ కామరాజు, రవివర్మ తదితరులు ఆకాంక్షించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/1872#sthash.2xQdm1qe.dpuf
Monday, 30 September 2013
నాకు క్రైమ్ అంటే ఆసక్తి ఎక్కువ: రామ్‌గోపాల్ వర్మ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment