Saturday, 28 September 2013

మోస‌క‌పోయినందుకు బాధ‌ప‌డుతున్నా


ఒక‌ప్పుడు టాలీవుడ్‌ను షేక్ చేసిన గోబ్యూ బ్యూటి ఇలియ‌న, త‌న మ‌న‌స్సులోంచి వ‌చ్చిన మాట‌ల‌ను లీడింగ్ టాబ్లాయిడ్‌తో పంచుకుంది. త‌ను చెప్పిన ప్రతి మాట త‌న హృద‌యంలో నుండి వ‌చ్చింది. ఇంట‌ర్వూలో భాగంగా రిపోర్టర్ ఓ ప్రశ్నను అడిగాడు. మీరు విదేశి యువ‌కుడితో ఎఫైర్ నడుపుతున్నారు క‌దా. మీరు ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారా అని అడిగాడు. దానికి ఇలియాన ఫేస్ టు ఫేస్ స‌మాధానం చెప్పింది. 'నాకు బాయ్ ప్రెండ్ ఉన్నాడు. అత‌డితో కొంత కాలం డేటింగ్ కూడ చేశాను. ఎందుకో ఏమ‌య్యిందో తెలియ‌దు. మేమిద్దరం ఇప్పుడు దూరంగా ఉంటున్నాము. త‌ను ఫారిన‌ర్ కాదు. ఇండియ‌న్‌. నాతో ఎంతో క్లోజ్‌గా ఉన్నాడు. కొన్ని నెలల త‌రువాత మేమిద్దరం విడిపోయాం అంత వ‌ర‌కూ నిజ‌మే. ఆ త‌రువాత నుండి నేను ఎవ‌రితోనూ ఎక్కువుగా క్లోజ్ రిలేష‌న్ పెట్టుకోవాల‌నుకోలేదు. అలాగే ఏ సెల‌బ్రితోనూ డేటింగ్ చేయాల‌నుకోవ‌డం లేదు. ఇప్పుడు నేను వేరే హీరోల‌తో డేటింగ్‌లో ఉన్నాన‌దే నిజం కాదు. డేటింగ్, క్లోజ్ రిలేష‌న్స్ మీద నాకు న‌మ్మకం పోయింది. ఏదైనా ఉంటే అది పెళ్లి వ‌ర‌కూ జ‌రుగుతుంది అని అనుకుంటే రిలేష‌న్‌ను మెయింటెన్ చేయాలి. లేకుంటే వాటి మీదే న‌మ్మకాలు పెట్టుకోకుడ‌దూ. అంతే' అంటూ ముగించేసింది. ఇలియాన చెప్పిన ఆ మాట‌ల‌కు చాలా మందిని చ‌లించివేసింది. ఇలియాన‌లో ఇంత బాధ ఉందా అని అంద‌రూ అలోచించుకుంటున్నారు.

బాలీవుడ్‌లోనూ ప‌రిగెడుతున్న ప‌వ‌నిజం


బాలీవుడ్‌లో ప‌వ‌నిజం ప‌రుగులు పెడుతుంది. కేవ‌లం ఈ మూవీ కారంణంగా బాలీవుడ్ బాడా హీరోల‌కు సౌత్‌లో థియోట‌ర్లు దొర‌క‌ని పరిస్థితి. బాలీవుడ్ చాక్లెట్ హీరో ర‌ణ్‌భీర్ క‌పూర్‌కు ఈ సిచ్యువేష‌న్ ఎద‌ర‌య్యింది. త‌న అప్‌క‌మింగ్ ఫిల్మ్ భేష‌ర‌మ్ మూవీ కోసం సౌత్‌లో అనుకున్నన్ని థియోట‌ర్లు దొర‌క‌లేదు. భేష‌ర‌మ్ మూవీను అక్టోబ‌ర్ 2న ప్రపంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 4000 థియోట‌ర్లను ఎంచుకున్నారు, ఈ చిత్ర డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. అయితే 3600 థియోట‌ర్లు మాత్రమే ర‌ణ్‌భీర్ క‌పూర్‌కి ద‌క్కింది. ఇప్పటివ‌రకూ ఇండియ‌న్ మూవీస్‌లో అత్యధిక థియోట‌ర్లలో రిలీజ్ అవుతున్న మొద‌టి మూవీ ఈ భేష‌ర‌మ్ మూవీనే. మిగిలిన నాలుగు వంద‌ల థియోట‌ర్లు సౌత్‌లో ర‌ణ్‌భీర్‌కు దొర‌క‌లేదు. ప‌వ‌న్ అత్తారింటికి దారేది మూవీ కోసం రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అడిగినా కూడ థియోట‌ర్లు య‌జ‌మానులు ఖాళీ లేవు అని చెప్పేశారట‌. దీంతో రణ్‌భీర్ మూవీ బిగ్గెస్ట్ రిలీజ్‌కు సౌత్ హీరో కార‌ణంగా కొంత మేర గండిప‌డిందంటుంది బాలీవుడ్‌. ఒక‌రకంగా చెప్పాలంటే ర‌ణ్‌భీర్ దూకుడుకి ప‌వ‌న్ బ్రేక్‌లు వేశాడ‌నే చెప్పాలి.

లగడపాటి తను చేరే పార్టీ కి అనువైన కథ చెబుతాడా?


లగడపాటి రాజగోపాల్ ఏ విషయంలోనూ సూటిగా స్పందించడం లేదు. డొంకతిరుగుడు వ్యవహారాల్లో ఆయన బాగా అనుభవం సంపాదించాడు. ఉదాహరణకు ఆయన విభజనను అడ్డుకోవడానికి తమ వద్ద బ్రహ్మాస్త్రాలున్నాయని అన్నాడు. అయితే ఆ బ్రహ్మాస్త్రాలేవో చెప్పనూ లేదు.. వాటిని ప్రయోగించనూ లేదు. అయితే తనకు సమైక్యవాదుల నుంచి నిరసన సెగలు వచ్చినప్పుడు మాత్రం ఏదో కబుర్లు చెప్పాడు... అని అంటున్నారు విశ్లేషకులు. సమైక్యవాదిగా ఈ విధంగా పెయిలయిన లగడపాటి ఇప్పుడు జగన్ బెయిల్ విషయంలో స్పందించిన తీరు కూడా ఆసక్తికరంగా మారింది. జగన్ బెయిల్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి, జగన్ కు మధ్య జరిగిన డీల్ గురించి బయటపెడతానని లగడపాటి అన్నాడు. జగన్ కు ఇప్పటికే బెయిల్ వచ్చింది. ఆ డీల్ ఏదైనా ఉంటే.. ఇప్పటికే కుదిరి ఉంటుంది. మరి ఇప్పుడు లగడపాటి దాన్ని బయటపెట్టాలి కానీ.. త్వరలో బయటపెడతా అని అంటాడేంటి? ఈ విధంగా మాట్లాడితే జనాలకు ఆసక్తి ఉండటానికి ఈయన ఏమైనా సస్సెన్స్ సినిమా దర్శకుడా? ఏదో ఒక మాట చెప్పాల్సిందిపోయి.. త్వరలో బయటపెడతా.. అంటూ లగడపాటి మరోసారి జనాల దృష్టిలో పలచన అయ్యాడు. సమైక్యవాదం విషయంలో బ్రహ్మస్త్రం అంటూ తర్వాత ఏమీ మాట్లాడని లగడపాటి.. జగన్ బెయిల్ విషయంలో కూడా అంతకు మించిన వైవిధ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. ఆయన దగ్గర మేటర్ ఏమీ లేదని.. కాంగ్రెస్ వీడాలనే పరిస్థితి వస్తే.. అప్పుడు ఏవో ఒకటి మాట్లాడటానికి ఇలా బెయిలు, డీలు అని మాట్లాడుతున్నాడని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Attarintiki Daaredhi review by Vennela Kishore


గాసిప్స్‌ని ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుడు



పుకార్లు కూడా ఓ ర‌క‌మైన క్రేజే అని న‌మ్మే ద‌ర్శ‌కుల్లో రాంగోపాల్ వ‌ర్మ ఒక‌రు. ఎన్ని పుకార్లొస్తే.. అంత ఫ్రీ ప‌బ్లిసిటీ అనుకొంటారాయ‌న‌. ఇప్పుడు పూరి జ‌గ‌న్నాథ్ కూడా ఆయ‌న బాట‌లోనే న‌డుస్తున్నాడు. పూరికి కూడా గాసిప్స్ అంటే ఇష్ట‌మ‌ట‌. 

ఇటీవ‌ల పూరి ఓ వెబ్‌సైట్‌ని ఆవిష్క‌రించాడు. నా గురించి కూడా కొన్ని పుకార్లు రాయండి.. అని ఆ సైట్ నిర్వాహ‌కుల‌ను కోరాడు... స‌ర‌దాగానే. పుకార్లు ఉత్సాహాన్ని ఇస్తాయ‌ట‌. అవి చూసి మ‌రింత జోష్‌గా ప‌నిచేయెచ్చ‌ట‌!  ఈ స్టేట్‌మెంట్‌తో పూరి మ‌రో సారి వ‌ర్మ‌కు త‌గ్గ శిష్యుడు అనిపించుకొన్నాడు. 

హీరోయిన్లు కూడా ఇంత పెద్ద మ‌న‌సు చేసుకొంటే.... ఎంత బాగుండునో క‌దూ.

పిల‌క‌తో ప్ర‌భాస్‌


బాహుబ‌లి కోసం ప్ర‌భాస్ తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. అన్నింటికంటే పెద్ద క‌ష్టం... గెడ్డం, జుత్తూ పెంచ‌డ‌మే. మిర్చి త‌ర‌వాత బాహుబ‌లి కోసం క‌స‌ర‌త్తులు మొద‌లెట్టాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో గెడ్డం పెంచేశాడు. జుత్తూ పెరిగింది. ఎంత‌లా అంటే ఆ జుత్తుతో ఓ పిల‌క కూడా వెయ్య‌వ‌చ్చు. ఈ గెట‌ప్‌తో ప్ర‌భాస్ బ‌య‌ట‌కు రావ‌డానికి కూడా భ‌య‌ప‌డుతున్నాడు. వ‌చ్చినా కెమెరాల‌కు చిక్క‌కుండా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఎంత దాక్కున్నా ఏదో ఓ కెమెరా క్లిక్ మంటూనే ఉంది. రెండేళ్ల పాటు ప్ర‌భాస్ ఇదే గెట‌ప్ కొన‌సాగించాలి. అస‌లే ఎండాకాలం నెత్తిమీద అంత జుత్తుతో ప్ర‌భాస్‌కి తెగ చికాకు వ‌చ్చేస్తోంద‌ట‌. అయినా స‌రే- రాజ‌మౌళి సినిమా కోసం మౌనంగా భ‌రిస్తున్నాడు. ముందు క‌ష్ట‌ప‌డితేనే క‌దా? త‌ర‌వాత ఫ‌లితం ద‌క్కేది.

జగన్ కు షాకిచ్చిన అశోక్ బాబు


జగన్ కు అశోక్ బాబు షాకిచ్చాడు, తన ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదింపచేసుకోవాలన్న నిర్ణయంతో సీమాంద్రలో తనను హీరో చేసుకోవాలన్న జగన్ వ్యూహానికి అడ్డం తిరిగాడు అశోక్ బాబు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయవద్దన్నారు. నిన్నటి దాకా అందరు రాజీనామా చేసే ఉద్యమంలోకి రావాలన్న ఆయన హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం సంచలనం సృష్టించింది. అంటే ఎమ్మెల్యేల రాజీనామాలతో జగన్ హీరో కాదు సీమాంద్రకు విలన్ అయ్యాడు అన్నభావాన్ని స్పష్టం చేసాడు ఏపిఎన్జీఓల అద్యక్షుడు అశోక్ బాబు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపిఎన్జీఓల వెనుక ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్న మాట తెలిసిందే. జగన్ ను సిఎం కిరణ్ పై సోనియా అస్త్రంగా ప్రయోగించింది అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కూడా తన వ్యూహానికి పదును బెడుతున్నాడు అన్న వాదనకు ఇది బలం చేకూర్చింది అంటున్నారు. కారణం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే రాష్ట్ర విభజనకు సహకరించినట్టే అని మాట మార్చాడు అశోక్ బాబు. ఎందుకుంటే తెలంగాణ బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటే విభజనపై విజయం సాధించినట్టేనట, అందుకు ఎమ్మెల్యేలు ఉండాలట. కాని ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయాలట. వారు కూడా పార్లమెంట్ లో బిల్లు ఆపాలంటే తాము పదవుల్లో ఉండాలి మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా అశోక్ బాబు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అంటే అశోక్ బాబును రాజకీయం ఆడిస్తోంది అన్నది దీంతో సుష్పష్టం అయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది వికటించి అశోక్ బాబు మెడకు చుట్టుకుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజకీయ వర్గాల్లో.

65 స్క్రీన్స్‌, 2.17 కోట్లు: USA ఆల్ టైం రికార్డు


అత్తారింటికి దారేది మూవీ యు.ఎస్‌లోనూ క‌లెక్షన్స్ జోరు కురిపించింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ఇండియ‌న్ బాక్సాపీస్ వెల్లడించింది. ఇదంతా తాజా న్యూన్ రిపోర్ట్స్ అంటూ అంద‌రూ తేల్చారు. దాదాపు అర‌వై అయిదు స్క్రీన్స్‌లో రిలీజ్ అయిన అత్తారింటికిదారేది మూవీ, యు.ఎస్‌లోనూ భారీ క‌లెక్షన్ష్‌ను కొల్లగొట్టింది. యు.ఎస్‌లో అర‌వై శాతం మంది లీక్డ్ మూవీను చూసిన‌ట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయినా ఓవ‌ర్సీస్ మార్కెట్‌లో అత్తారింటికిదారేది మూవీ క‌లెక్షన్స ఏ మాత్రం త‌గ్గలేదు. నాలుగు రోజుల పాటు యు.ఎస్‌లోని అన్నీ స్క్రీన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగాయి. యు.ఎస్ మొద‌టి రోజు క‌లెక్షన్స్ 2.17 కోట్లును కొల్లగొట్టడంతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీ కూడ ప‌వ‌న్ క‌లెక్షన్స్‌కు అవాక్కయింది. బాలీవుడ్ మూవీలకూ ఇప్పటి వ‌ర‌కూ ఇంత క‌లెక్షన్స్ రాలేదు.అందుకే అత్తారింటికిదారేది యు.ఎస్ క‌లెక్షన్స్ రికార్డ్స్ బాలీవుడ్ బాక్సీపీస్ వ‌ర‌కూ వెళ్ళింది.

లక్ష్మి మంచును నిరాస పరిచిన చరణ్ - బన్నీలు!


100 ఏళ్ళ సినిమా పండుగ ఉత్సవాలు ముగిసి పోయి రోజులు గడిచి పోతున్నా మంచు వారి అమ్మాయి కి చరణ్ బన్నీలు మిగిల్చిన నిరాస నుండి కోలుకో లేక పోతోందట. ఇక వివరాల లోకి వెళ్ళితే వంద ఏళ్ళ సినిమా పండుగ ఉత్సవాల నిర్వాహకులు లక్ష్మీని ఈ ఉత్సవాల కోసం కొన్ని కార్య క్రమాలు తయారు చేయమని అడిగేతే తన సోదరుడు విష్ణు తో కలసి ఒక ప్రత్యేక షో ని మన టాలీవుడ్ స్టార్స్ తో రూపొందించింది అట . ఈ కార్యక్రమంలో చరణ్, బన్నీ, అనుష్క, తమన్నా లాంటి స్టార్స్ పాల్గొoటాము అని కూడా మాట ఇచ్చారట. దీనికి సంబంధించిన రిహార్సల్స్ కూడా కొన్ని జరిగాయి అంటున్నారు. కానీ ఇంతలో మోహన్ బాబు సమైక్య ఉద్యమ నేపధ్యంలో ఈ కార్య క్రమ౦ లో తెలుగు సినిమా పరిశ్రమ సెలబ్రిటీ లు ఎవ్వరు పాల్గొనవద్దని పిలుపు ఇవ్వడంతో ఈ స్పెషల్ షో కేన్సిల్ అనుకున్నారట. అయితే చివరి నిమిషం లో అదే మోహన్ బాబు తెలుగు సినిమా సెలేబ్రిటీల షో ఉంటేనే బాగుంటుందని అనిపించి ఈ షో ప్రదర్శించమని తన కుమార్తె లక్ష్మికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా చరణ్ బన్నీ లు వందేళ్ళ పండగకు రాము అన్నారట . దీనితో ఏమి చెయ్యలేని మన మంచు వారి అమ్మాయి తన సోదరుడు మనోజ్ తో కలిసి వందేళ్ళ పండుగలో పల్గొందట. ఈ ఉత్సవాలలో తన ప్రతిభను చాటుదాం అని అనుకొన్న తన ఆశల ఫై ముందు తన తండ్రి చివరిలో చరణ్ బన్ని లు నీళ్లు జల్లారని తెగ బాధ పడి పోతోంది మంచు వారి అమ్మాయి. ఈ బాధని మరిచిపోవాలనే కాబోలు విష్ణు సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేస్తూ కాలం గడిపేస్తోంది మంచు లక్ష్మి...

మొద‌టిరోజు క‌లెక్షన్స్ అల్‌టైం రికార్డ్‌: లిస్ట్‌


అత్తారింటికిదారేది మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ అల్‌టైం రికార్డును త‌ల‌పించేలా ఉన్నాయి. ఇప్పటి వ‌ర‌కూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఏ మూవీ కూడ‌ ఇన్ని క‌లెక్షన్స్ రాబట్టలేక‌పోయింది. రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లోనూ ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. ఆంద్రప్రదేశ్ క‌లెక్షన్స్ 10.45 కోట్లు ఉండ‌గా, ఒవ‌ర్ సీస్ క‌లెక్షన్స్ 2.67 కోట్ల రూపాల‌య‌ను కొల్లగొట్టింది. దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం -3.28cr సీడెడ్‌- 2.13cr వెస్ట్ -0.74cr ఈస్ట్ -1.04cr నెల్లూరు-0.58cr గుంటూరు -1.40cr క్రిష్ణా -0.71cr ఆంద్రప్రదేశ్ మొద‌టిరోజు టోట‌ల్ క‌లెక్షన్స్ : 10.45 కోట్లు ఓర‌ర్సీస్ క‌లెక్షన్స్ : 2.67 కోట్లు అయితే ఇందులో ఇత‌ర రాష్ట్రాల క‌లెక్షన్స్‌ను క‌లుపుకోకుండా వ‌చ్చిన క‌లెక్షన్స్‌. త‌మిళ‌నాడు,క‌ర్ణాట‌క క‌లెక్షన్స్‌ను క‌లుపుకుంటే మొత్తంగా 14 కోట్లు మొద‌టి రోజు క‌లెక్షన్స్‌గా ఉంటుందంటున్నారు. వీకెండ్ కాబ‌ట్టి ఈ కలెక్షన్స్ త‌రువాత రెండు రోజుల‌కు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉందంటున్నారు.

సోనియా ప్లాన్ వర్కవుట్ - పిసిసి చీఫ్ ఇక అవుట్


ఏపి విభజన విషయంలో సోనియా ప్లాన్ వర్కవుట్ అయ్యేలా చేసుకునే పనిలో భాగంగా పిసిసి అద్యక్షుడు ఇక అవుట్ అవుతున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజామా.. కాదా.. అన్నది కాసేపు పక్కన బెడితే అసలు విషయం కూడా ఓ సారి పరిశీలిద్దాం. ఇన్నాళ్లు అటు తెలంగాణ, ఇటు సమైక్యాంద్ర అంటూ రెండు నాల్కల దోరణిని ప్రదర్శిస్తూనే వ్యక్తిగతంగా మాత్రం తాను సమైక్యవాదినని పబ్బం గడుపుతూ వచ్చాడు పిసిసి అద్యక్షుడు. సరే ఆయన రాష్ట్రకాంగ్రెస్ కంతటికి అద్యక్షున్ని కాబట్టి అలా ఉన్నాను అంటే సరే అనుకున్నారు సమైక్యవాదులు కూడా, అయితే ఇప్పుడు ఆయనకు అసలు చిక్కు వచ్చిపడింది. దీంతో ఇక తప్పదని భావించి తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. కారణం సమైక్యవాదులు, ఏపిఎన్జీఓలు తాజాగా ఎంపీలందరిని రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసారు. ఆయన బార్య ఝాన్సీ ఎంపీ, ఆమె ఇప్పటివరకు అటూఇటూ కాకుండా చాటుగానే ఉంటున్నారు. ఇక మరో ఇద్దరు దగ్గరి బందువులు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బొత్స కుటుంబంపై జిల్లాలో తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడం మొదలయింది. అందుకే తను రాజీనామా చేస్తే తన వారు బతికి పోతారు అన్న నిర్ణయానికి వచ్చాడు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే ఆయన రాజీనామా రాష్ట్ర కాంగ్రెస్ పై తీవ్రప్రభావం పడుతుంది. మిగిలిన మంత్రులు కూడా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, పొరపాటున బొత్స ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తే కాంగ్రెస్ సీమాంద్ర ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయాల్సి వస్తుంది. అంటే ఇది సోనియా గాంధీ బొత్సతో ఆడిస్తున్న నాటకం కాదుకదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఓ వైపు ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామాలు చేయవద్దు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లును వీగిపోయేలా చేయడమొక్కటే మనముందున్న ఏకైక మార్గం అంటున్నాడు, మరి బొత్స దీనికి వ్యతిరేక మార్గంలో పోతున్నాడని తెలుస్తోంది. అంటే ఇందులో ఏదో గేమ్ ఉందన్నమాటే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

బీరు+బిర్యానీ+300 ఇస్తే చలో సకలజన భేరీ!


చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశం సద్వినియోగం చేసకోర్రి, .లుంగీలు, ఎగేసుకొని వచ్చేయ్యుర్రి ..పొట్టపగలా బీర్లు తాగి , బిర్యానీలు మెక్కి ..జేబులు నింపుకొని ఇళ్ళకు పోర్రి ..చాలా రోజుల తరువాత వచ్చిన అవకాశం .. సద్వినియోగం చేసుకోర్రి..అంటున్నారు సమైక్యవాదులు. తెలంగాణ వాదులు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సకలజనభేరీ గురించి సమైక్యవాదులు విరుచుకుపడుతున్నారు. ఇది పూర్తిగా కృత్రిమ ఉద్యమం అని.. జనాలను ప్రలోభపెట్టి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారని వారు అంటున్నారు. ఈ మేరకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారు సమైక్యవాదులు. ఒకవైపు సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. వారి ఒత్తికి ప్రభుత్వం ఎక్కడ దిగి వస్తుందో.. అనే ఆందోళనతో తెలంగాణ వాదులు మళ్లీ సభలకూ, సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులు తెలంగాణ వాదులపై ఇలాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఒకవైపు సీమాంధ్రలో నడుస్తున్నది కృత్రిమ ఉద్యమం అంటూ తెలంగాణ వాదులు అంటుంటే.. తెలంగాణవాద ఉద్యమం బీర్లు, బిర్యానీలతో నడుస్తున్నదని సమైక్యవాదులు అంటున్నారు. ఇలా ఇరు ప్రాంతాల ప్రజలూ.. మీది ఉద్యమం కాదని అంటే మీది ఉద్యమం కాదు.. అంటూ విమర్శలు సంధించుకుంటున్నారు. మీ ఉద్యమాన్ని కాంట్రాక్టర్లు డబ్బు పెట్టి నడిపిస్తున్నారని సీమాంధ్రులను తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. అయితే మీరు జనాలకు సొమ్ములు ఇచ్చిన సభలకు రప్పించుకుంటున్నారని తెలంగాణ వాదులను సీమాంధ్రులు విమర్శిస్తున్నారు. మరి ఎవరి మాటలు రైటో.. ఉద్యమం రైటో..