Saturday, 28 September 2013

బీరు+బిర్యానీ+300 ఇస్తే చలో సకలజన భేరీ!


చాలా రోజుల తర్వాత వచ్చిన అవకాశం సద్వినియోగం చేసకోర్రి, .లుంగీలు, ఎగేసుకొని వచ్చేయ్యుర్రి ..పొట్టపగలా బీర్లు తాగి , బిర్యానీలు మెక్కి ..జేబులు నింపుకొని ఇళ్ళకు పోర్రి ..చాలా రోజుల తరువాత వచ్చిన అవకాశం .. సద్వినియోగం చేసుకోర్రి..అంటున్నారు సమైక్యవాదులు. తెలంగాణ వాదులు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న సకలజనభేరీ గురించి సమైక్యవాదులు విరుచుకుపడుతున్నారు. ఇది పూర్తిగా కృత్రిమ ఉద్యమం అని.. జనాలను ప్రలోభపెట్టి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారని వారు అంటున్నారు. ఈ మేరకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారు సమైక్యవాదులు. ఒకవైపు సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. వారి ఒత్తికి ప్రభుత్వం ఎక్కడ దిగి వస్తుందో.. అనే ఆందోళనతో తెలంగాణ వాదులు మళ్లీ సభలకూ, సమావేశాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యవాదులు తెలంగాణ వాదులపై ఇలాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. ఒకవైపు సీమాంధ్రలో నడుస్తున్నది కృత్రిమ ఉద్యమం అంటూ తెలంగాణ వాదులు అంటుంటే.. తెలంగాణవాద ఉద్యమం బీర్లు, బిర్యానీలతో నడుస్తున్నదని సమైక్యవాదులు అంటున్నారు. ఇలా ఇరు ప్రాంతాల ప్రజలూ.. మీది ఉద్యమం కాదని అంటే మీది ఉద్యమం కాదు.. అంటూ విమర్శలు సంధించుకుంటున్నారు. మీ ఉద్యమాన్ని కాంట్రాక్టర్లు డబ్బు పెట్టి నడిపిస్తున్నారని సీమాంధ్రులను తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. అయితే మీరు జనాలకు సొమ్ములు ఇచ్చిన సభలకు రప్పించుకుంటున్నారని తెలంగాణ వాదులను సీమాంధ్రులు విమర్శిస్తున్నారు. మరి ఎవరి మాటలు రైటో.. ఉద్యమం రైటో..

No comments:

Post a Comment