జగన్ కు అశోక్ బాబు షాకిచ్చాడు, తన ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదింపచేసుకోవాలన్న నిర్ణయంతో సీమాంద్రలో తనను హీరో చేసుకోవాలన్న జగన్ వ్యూహానికి అడ్డం తిరిగాడు అశోక్ బాబు. ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయవద్దన్నారు. నిన్నటి దాకా అందరు రాజీనామా చేసే ఉద్యమంలోకి రావాలన్న ఆయన హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం సంచలనం సృష్టించింది.
అంటే ఎమ్మెల్యేల రాజీనామాలతో జగన్ హీరో కాదు సీమాంద్రకు విలన్ అయ్యాడు అన్నభావాన్ని స్పష్టం చేసాడు ఏపిఎన్జీఓల అద్యక్షుడు అశోక్ బాబు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపిఎన్జీఓల వెనుక ముఖ్యమంత్రి కిరణ్ ఉన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్న మాట తెలిసిందే. జగన్ ను సిఎం కిరణ్ పై సోనియా అస్త్రంగా ప్రయోగించింది అన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కూడా తన వ్యూహానికి పదును బెడుతున్నాడు అన్న వాదనకు ఇది బలం చేకూర్చింది అంటున్నారు.
కారణం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే రాష్ట్ర విభజనకు సహకరించినట్టే అని మాట మార్చాడు అశోక్ బాబు. ఎందుకుంటే తెలంగాణ బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటే విభజనపై విజయం సాధించినట్టేనట, అందుకు ఎమ్మెల్యేలు ఉండాలట. కాని ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయాలట. వారు కూడా పార్లమెంట్ లో బిల్లు ఆపాలంటే తాము పదవుల్లో ఉండాలి మొర్రో అని మొత్తుకుంటున్నా కూడా అశోక్ బాబు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అంటే అశోక్ బాబును రాజకీయం ఆడిస్తోంది అన్నది దీంతో సుష్పష్టం అయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది వికటించి అశోక్ బాబు మెడకు చుట్టుకుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి రాజకీయ వర్గాల్లో.
Saturday, 28 September 2013
జగన్ కు షాకిచ్చిన అశోక్ బాబు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment