Thursday, 3 October 2013

సారీ చెప్పిన పవన్ కల్యాణ్


అవును ... పవన్ కల్యాణ్ తన సాటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు నిజంగానే 'సారీ' చెప్పాడు. ఈ విశేషం 'అత్తారింటికి దారేది' సినిమా షూటింగులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే ... ఆ సినిమా క్లైమాక్స్ దృశ్యాలలో హీరో పవన్ కల్యాణ్ ఎమోషనల్ గా స్పందించి, కన్నీళ్లు పెట్టుకునే దృశ్యం ఒకటుంది. అది ప్రేక్షకులను ఎంతగానో టచ్ చేస్తుంది కూడా.

 ఈ సీన్ తీసేటప్పుడు అందులో తాను పూర్తిగా లీనమవడానికి వీలుగా, తనకు ఎటువంటి డిస్టర్ బెన్స్ లేకుండా వుండడం కోసం, ఆ సీన్ తో సంబంధం లేని ఆర్టిస్టులనూ, టెక్నీషియన్ లనూ సెట్లోంచి దూరంగా వెళ్ళిపొమ్మని పవన్ ఆదేశించాడట. ఆ తర్వాత ఆ సీన్ ఓకే అయ్యాక, అందర్నీ పిలిచి, తను వెళ్ళిపొమ్మన్నందుకు కారణాన్ని వివరించి చెప్పి, అందరికీ 'సారీ' చెప్పాడట.

 దాంతో వాళ్ళంతా పవన్ వ్యక్తిత్వానికీ, సంస్కారానికీ హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ విషయాన్ని ఆనాడు సెట్లో వున్న హాస్యనటుడు అలీ, తాజాగా మీడియాకు చెబుతూ, "పవన్ కల్యాణ్ గారి స్థాయికి మాకలా సారీ చెప్పక్కర్లేదు. అయితే, మేమెక్కడ హర్ట్ అయ్యామో అన్న ఉద్దేశంతో, వివరించి చెప్పి, సారీ చెప్పారు. అది ఆయన సంస్కారం" అన్నాడు.

No comments:

Post a Comment