
అప్పుడే వారి ఉద్యమానికి మరింత బలం చేకూరి లక్ష్యసాధన మరింత ఈజీ అవుతుందన్న దానిని కూడా తోసి పుచ్చలేం. మరి అశోక్ బాబు ఏంచేస్తున్నాడు, రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నారని రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఎంపీలు అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు హెచ్చరిస్తూ చీల్చి చెండాడుతున్నాడు, ఉద్యమకారుడిగా ఆయనలో అంత తెగువ అవసరమే, కాని అందులో పారదర్శకత ఉండాలి కదా... ఈ రోజు రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నదెవరు, అంటే కాంగ్రెస్ అని అశోక్ బాబు కూడా చెబుతున్నాడుగా, ఆయన తిట్టుతూ, హెచ్చరిస్తున్నది కూడా కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులనే కదా... కాని ఇందులోనే ఓ ట్విస్టు ఉంది ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడుతూ, సీమాంద్ర హీరో అంటూ ఆయనను చేరదీస్తూ మంత్రులను, ఎంపీలను తిట్టి పోస్తున్నాడు, ఈరాజకీయం ఆయనకు అవసరమా, అందరిని ఒకేలా చూడాలిగా. పైగా సిఎం కిరణ్ ను నిన్న విమర్శించిన మంత్రులను, సమావేశం అయి సిఎం తీరుతో విభేదించిన చిరంజీవి, బొత్స వంటి వారిని కూడా ఆయన హెచ్చరించి సిఎం ను ఏమన్నా సహించేది లేదు అన్నట్టు వ్యవహరించడంలో అర్థం ఏమిటి. ఆయనేమన్నా సిఎం వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతనా... సరే, సిఎం అధిష్టానాన్ని వ్యతిరేకించి గట్టిగా సమైక్యాంధ్ర వాణి వినిపిస్తున్నాడు కాబట్టి అనుకుందాం, అదేదో రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రమ్మని సిఎం ను ఎందుకు కోరడం లేదు అని ఎవరైనా అడిగితే సమాధానం ఏంటి. తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సిఎం పదవిలో ఉండాలని ఆ వెసులు బాటు కల్పించారనుకుందాం, కాని సమైక్యాంద్రకోసం తెలంగాణలో పార్టీని భూస్తాపితం చేసుకుని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు పార్టీ అద్యక్షుడిగా తాను కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చిన వైఎస్సార్ సిపిని, జగన్ ను అశోక్ బాబు ఎందుకు దగ్గరికి తీసుకోవడం లేదంటే సమాధానమేంటి, ఇలా రాజకీయ నేతలు, పరిశీలకులు అశోక్ బాబు విషయంలో సందిస్తున్న ప్రశ్నలు. ఇదంతా సిఎం చూసుకుంటాడు అన్న దీమా ఆయనలో ఉందేమో, రేపు కిరణ్ కుమార్ రెడ్డినే ఎటూ కాకుండా చేసి, ఆయన స్థానంలో అశోక్ బాబుతో బండబూతులు తిట్టించుకున్న మరో నేత ముఖ్యమంత్రి అయితే అశోక్ బాబు పరిస్థితి ఏంటి, ఆయనను నమ్ముకుని కుటుంబాలను వీది పాలు చేసి ఉద్యోగాలను వదిలి ఆయన వెంట నడుస్తున్న వారి పరిస్థితి ఏంటి... ఇవన్నీ విశ్లేషిస్తున్న వారు ‘ అశోక్ బాబూ... సాటి ఉద్యోగులే చావగొడుతారేమో, నీ భవిష్యత్తు కుక్కలు చింపిన విస్తరి అవుతుందేమో’ అంటున్నారు.
No comments:
Post a Comment