బీజేపీ-తెలుగుదేశం పార్టీల పొత్తు రోజుకొక అడుగుగా ముందుకు వెళుతోంద. ఆదిలో ఊహాగానంగా మొదలైన ఈ అంశం ఈ గాంధీ జయంతితో ఒక కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్డీయే రోజులను గుర్తు చేసుకోవడం, తాము అద్భుతాలను సాధించామని అనడం, మోడీతో ప్రత్యేకంగా సమావేశం అవ్వడం.. ఇవన్నీ తెలుగుదేశం బీజేపీ పొత్తుకు సంకేతాలు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇక పొత్తు ఖాయమేనని సీట్ల సర్దుబాటు గురించి చర్చలు కూడాజరిగే అవకావం ఉందని, అయితే ముందుగా ఈ అంశాన్ని ఎవరు బహిరంగ పరుస్తారనేది ఆసక్తికరమైన అంశమని విశ్లేషకులు అంటున్నారు. బీజేపీ వైపు నుంచి ప్రతపాదన వస్తుందా? లేక తెలుగుదేశం నుంచి ఈ ప్రతిపాదన ఉంటుందా? అనేది వేచి చూసి తెలుసుకోవాల్సిన విషయమని అభిప్రాయపడుతున్నారు.గతంలో పొత్తుతో స్నేహంగా మెలిగిన ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతానికి కొంత ఇగో క్లాషెష్ ఉండవచ్చని.. అయితే వాటిని తొలగించుకోవడం పెద్ద విషయం కాదని అంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. తెలుగుదేశంతో పొత్తు అనే ఊహానాలు వచ్చినప్పటి నుంచి బీజేపీలోని ఇద్దరు వ్యక్తులు మొహం మాడ్చుకొంటున్నారు. టీడీపీతో పొత్తుకు వీళ్లు ససేమేరా అంటున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదు, ఇది బాబును ఉద్ధరించడానికి జరుగుతున్నట్లుందని వాళ్లు అధిష్టానానికి మొరపెట్టుకొంటున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులే కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి. న్యూఢిల్లీలో బాబు-మోడీల మీటింగ్ తర్వాత వీళ్లు మరింతగా బిగుసుకుపోయారు. మోడీని పొడిగితే మాత్రం బాబుకు సీట్లను పంచి ఇస్తామా? అని నాగం ప్రశ్నిస్తుంటే.. కిషన్ రెడ్డి మీడియా ముందుకే రావడం లేదు.. మరి వీరిని ఈ విషయంలో కూల్ చేసేది ఎవరో!
No comments:
Post a Comment