సెలబ్రిటీల ఎఫైర్‌లు ఇంత ధారుణంగా తెగించాయా అంటే కాదలేని పరిస్థితిలా మారింది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్‌సింగ్, డెంగ్యూతో బాధపడుతూ హాస్పిటల్ బెడ్ ఎక్కాడు. రణ్‌వీర్‌సింగ్ అప్‌కమింగ్ ఫిల్మ్ రామ్‌లీలా మూవీ వెస్ట్‌బెంగాళ్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. షూటింగ్ మధ్యలోనే హీరో రణ్‌వీర్‌సింగ్ డెంగ్యూ భారిన పడ్డాడు. వెంటనే చిత్ర యూనిట్ రణ్‌వీర్‌ను హాస్పిటల్‌కు తరలించింది. దాదాపు నాలుగు రోజులు హాస్పిటల్‌లోనే ట్రీట్‌మెంట్ తీసుకొని, క్యూర్ అయ్యాడు. అయితే డాక్టర్లు మాత్రం ఇంకో పదిహేను రోజుల వరకూ పూర్తి విశ్రాంతి కావాలని హీరోకు సూచించారు.రామ్‌లీలా మూవీలో రణ్‌వీర్‌సింగ్ సరసన హీరోయిన్ దీపికాపదుకొనె నటిస్తుంది. హీరో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడని తెలుసుకొని, ప్రతి రోజు రాత్రిళ్ళ సమయంలో హీరోను చూసుకోవడానికి హాస్పిటల్‌కి వెళ్ళేదట. రణ్‌వీర్‌సింగ్,దీపికాపుదకొనె ఇద్దరూ రాత్రి సమయంలో చాలా సేపు కబుర్లు చెప్పుకుంటున్నారని బాలీవుడ్ చెబుతుంది. ఒక్కోసారి రాత్రి ఎనిమిది గంటలకు హాస్పిటల్‌కి వెళ్ళిన దీపికా, ఉదయం ముడు,నాలుగు గంటల వరకూ బయటకు వచ్చేది కాదంట. జస్ట్ పలకరించటానికి అని వచ్చిన దీపికా, అంత సమయం వరకూ ఇద్దరూ ఏకాంతంగా ఏం మాట్లాడుకుంటారు అని బి-టౌన్‌లో బాహాటంగానే వినిపిస్తుంది. వీళ్ళు ఇదే సాకుతో హాస్పిటల్‌లోనే రొమాన్స్ చేశారని కూడ కొందరు చెబుతున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందోలేదో తెలియదు కాని, వీరిద్దరూ మాత్రం ప్రతి రోజు పర్సనల్‌గా కలుసుకోవడం మాత్రం జరుగుతుంది.
No comments:
Post a Comment