
తిరుమల కొండపై జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించేందుకు ఈ ఉగ్రవాదులు ప్లాన్ గీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీవారి గరుడోత్సవానికి చెన్నై నుంచి వచ్చే గొడుగుల్లో బాంబులు అమర్చేందుకు వీరు కుట్ర పన్నినట్లు భావిస్తున్నారు. ఆలయంలోని పూజారి సాయంతో బాంబు అమర్చేందుకు తీవ్రవాదులు పన్నాగం పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విధ్వంసం కోసం 6 నెలల క్రితమే పుత్తూరులో ఉగ్రవాదులు స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ పరికరాల వ్యాపారం పేరుతో ఇక్కడికి చేరుకుని.. బాంబులు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని తిరువళ్లూరులో పట్టుబడిన తీవ్రవాది నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.
No comments:
Post a Comment