Saturday, 5 October 2013

లుక్కు మారిస్తే లక్కు వస్తుందా?


తుఫాన్ సినిమా కొట్టిన బీభత్సమైన దెబ్బకి అల్లకల్లోలం అయిపోయింది రామ్ చరణ్ కెరీర్. ఎందుకిలా జరిగిందా అంటూ కుమిలిపోతోన్న కుర్రాడు ఇప్పటికి కాస్త తేరుకున్నాడు. మిగతా సినిమాల మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్నాడు. తుఫాన్ మిగిల్చిన చేదు అనుభవాన్ని తుడిచేయాలని తపిస్తున్నాడు. తుఫాన్ పోతే పోయింది, ఎవడు అయినా తన తలరాతను మారుస్తుందేమో అని ఆశపడిన రామ్ చరణ్ కి నిరాశే మిగిలింది. సమైక్యాంధ్ర ఉద్యమం పుణ్యమా అని ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో కూడా తెలీని పరిస్థితి ఏర్పడింది. అందుకే దాన్న సంగతి పక్కన పెట్టి, వెంకటేష్ తో కలిసి కృష్ణవంశీ డైరెక్షన్లో మల్టీస్టారర్ చేయడానికి ప్రిపేరవుతున్నాడు చెర్రీ. దానికోసం తెగ కసరత్తులు చేస్తున్నాడు. ముఖ్యంతా తన లుక్స్ విషయంలో బాగా కేర్ తీసుకుంటున్నాడు. కొద్దిగా గడ్డం, కొంచెం పొడవైన జుత్తుతో కనిపించేవాడు చెర్రీ మొన్నటివరకూ. కానీ ఇప్పుడు హెయిర్ స్టయిల్ మారింది. ఫేస్ లో లుక్ కూడా మారింది. ఇంతకు ముందులా కాకుండా కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. ఏంటా అని ఆరా తీస్తే, అదంతా కృష్ణవంశీ సినిమా కోసం అని తెలిసింది. ఇందులో వెంకటేష్ అన్న కొడుకుగా కనిపించనున్నాడు చెర్రీ. చూద్దాం... లుక్కు మార్చాక అతడి లక్కు ఏమైనా మారుతుందేమో!

No comments:

Post a Comment