ప్రస్తుతం ఎక్కడ విన్నాపవన్ పవన్ అత్తారింటి థాంక్స్ గివింగ్ మీట్ లో చేసిన ప్రసంగం గురించి చర్చలే. ఆరోజు జరిగిన ఫంక్షన్ లో పవన్ మాట్లాడుతూ అత్తారిల్లు పైరసీ విషయం చాలా చిన్నదని దానికంటే పెద్ద విషయాలు డీల్ చేయ వలసినవి చాలా ఉన్నాయని వాటికోసం తన అభిమానులను తరుచు కలుస్తాను అనడం వెనుక ఉన్న అర్ధం గురించి చాలా లోతుగా విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ పవన్ దృష్టిలో ఉన్న పెద్ద విషయాలు ఏమిటి అన్న విషయం పై చాలా ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. పవన్ రాజకీయప్రవేశానికి సంకేతంగా ఈమాటలు పవన్ వాడడాన్ని అంటున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం లో చాలా ఉత్సాహంగా పనిచేసిన పవన్ ప్రజారాజ్యం ఓడిపోయిన తరువాత రాజకీయాల గురించి పట్టించు కోవడం మానేసినా, పవన్ ఫలానా పార్టీలో చేరబోతున్నాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.ఈ మధ్య ఈ వార్తలు మరింత ఎక్కువ అయి పోయాయి. దీనికి మరింత బలం చేకూర్చే మరోవార్త ఇప్పుడు మీడియాలో ప్రచారంలో ఉంది. రాష్ట్ర రాజకీయాలలో కింగ్ మేకర్ గా, మీడియా ప్రపంచానికి చక్రవర్తిలా పిలిపించుకొనే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పవన్ ను రెండు సార్లు కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ప్రస్తుతరాజకీయాల ఫై వీరిద్దరూ చాల సుదీర్ఘంగా చర్చించు కున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యూత్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న పవన్ అలాగే తెలుగు మీడియా ప్రపంచంలో చక్రవర్తి లా వెలిగిపోతున్న రామోజీ కలవడం వెనుక ఎదో ఒక రాజకీయ ఉద్దేశ్యం ఉంది అంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు నందమూరి తారకరామారావుకు ఆతరువాత చంద్రబాబునాయుడుకు గుండెకాయలా వ్యవహరించిన రామోజీరావు పవన్ ను కలవడం వెనుక ఆంతర్యం తెలుగు దేశం పార్టీ వైపు పవన్ ను మలుచు కోవడానికా లేదంటే మరేదైనా రాజకీయ ఉద్దేశ్యం వీరిద్దరి మధ్యా ఉన్నదా? అనే విషయం పై ఎవరికి తోచిన అభిప్రాయలు వారు వెల్లడిస్తున్నారు. ఎదిఎమైనా త్వరలో పవన్ కళ్యాణ్ నుండి ఒక సంచలన వార్త వచ్చే విధంగా ఆయన మాటలు అర్ధాలు ఇస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు...
No comments:
Post a Comment