Saturday, 19 October 2013

దిల్ రాజ్ కు క్లాస్ పీకిన జూనియర్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దిల్ రాజ్ ను తన ఇంటికి పిలిచి క్లాస్ తీసుకున్నట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. గతంలో దిల్ రాజ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘బృందావనం’ సినిమా నిర్మాణ సమయంలోనే వీరిద్దరి మధ్యా బేధాభిప్రయాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీనికి కారణం ఆ చిత్రం షూటింగ్‌లో ఉండగానే జూనియర్ ఎన్టీఆర్ తన పారితోషికాన్ని 9 కోట్లు వరకు దిల్ రాజ్ నుండి ముక్కుపిండి మరీ వసూలు చేశాడని దిల్‌రాజు తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ దెబ్బతో ఇకపై దిల్ రాజ్ ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేయకూడదు అని అనుకుంటున్నాడు అంటూ రకరకాల కధనాలు చక్కర్లు కొట్టాయి. కానీ ఏమి జరిగిందో తెలియదు కాని అదే దిల్ రాజ్ జూనియర్ తో ‘రామయ్య’ ను తీసాడు. అయితే తను తీసిన 'రామయ్యా వస్తావయ్యా' పెద్దగా సక్సెస్‌ కాకపోయేసరికి దిల్ రాజ్ చాల షాక్ అయ్యాడట. అంతేకాదు రామయ్య సినిమా పై మీడియా అంత విపరీతంగా నెగెటివ్‌గా ఎందుకు రాసింది అని అడిగాడట జూనియర్ ఎన్టీఆర్.

 అంతేకాదు మీరు గతంలో మీడియాతో మీరు ఎందుకు గొడవ పెట్టుకున్నారు అని జూనియర్ దిల్ రాజ్ ను ప్రశ్నించాడట. ఈ విషయాన్ని దిల్‌ రాజు ఘాటుగా తీసుకుని తన పై ఎవరో ఎన్‌టిఆర్‌కు లేనిపోని విషయాలు నూరిపోస్తున్నారు అంటూ దిల్ రాజ్ తన సన్నీహితుల దగ్గర బాధ పడుతున్నాడట. ఇదే సందర్భంలో దిల్ రాజ్ జూనియర్ తో సినిమాలో సరుకుంటే చూస్తారు లేకుంటే లేదు సినిమా ఫెయిల్ అవ్వడానికి తాను ఒక్కడినే కారణం కాదు కదా అని చురక అంటించేసరికి మన జూనియర్ మైండ్ బ్లాంక్ అయింది అని అంటున్నారు. రామయ్య సినిమా విడుదల అయి పదిరోజులు గడిచి పోతున్నా ఆ చేదుజ్ఞాపకాలను ఎన్టీఆర్ ఇంకా మరిచి పోనట్లే కనిపిస్తోం ది...

No comments:

Post a Comment