జగన్ బెయిల్ వ్యవహారం కాంగ్రెస్ లో కంపరం పుట్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీమాంద్రకు చెందిన కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని విబేదిస్తూ ప్రకటనలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో సంచలనాల కేంద్రబిందువైన విజయవాడ ఎంపీ లగడపాటి, ఇతర ప్రముఖ నేతలు ఉండవల్లి, మంత్రి శైలజానాథ్ వంటి వారు తాజాగా జగన్-కాంగ్రెస్ డీల్ పై బహిరంగంగానే పరోక్ష హెచ్చరికలు జారీ చేసారు. లగడపాటి మాత్రం ఏకంగా తన రాజీనామా ఆమోదం పొందిన మరుక్షణం చీకటి ఒప్పందాల గుట్టు రట్టు చేస్తానని జబర్దస్థ్ హెచ్చరిక జారీచేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఈ హెచ్చరికలు అంతగా పట్టించుకోదు, కారణం ఇప్పటికే సీమాంద్రలో పార్టీ చచ్చిపోయిందన్న నిర్ణయానికి వచ్చింది, ఇంకా పార్టీకి వచ్చే ముప్పు ఏముంటుంది. కాని ఈ వ్యవహారం వల్ల జగన్ కే ప్రమాదం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం ఇప్పటికే జగన్ సోనియాతో డీల్ కుదుర్చుకోవడం వల్లే ఆయనకు బెయిల్ దొరికిందని కాంగ్రెస్ తో సహా అంటే ఒక్క జగన్ పార్టీ వారు తప్ప అందరు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇక వైఎస్సార్ సిపి నేతలు కూడా ఎలక్ట్రానిక్ మీడియా చర్చల్లో, బయట మీడియా ముందు డైరెక్టుగా కాకున్నా ఇండైరెక్టుగా జగన్ – సోనియా ల డీల్ కరెక్టే అన్న విధంగా వాఖ్యలు చేస్తున్నారు. ఈతరుణంలో లగడపాటి వంటి వారు రాజీనామా ఆమోదమే తరువాయి ఆదారాలతో సహా చీకటి ఒప్పందాలను బయట పెడతానంటే దానికి మీడియా కూడా విశేష ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే ఇది జగన్ కు జబర్దస్థ్ హెచ్చరిక లాంటిదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
Friday, 27 September 2013
జగన్ కు జబర్దస్థ్ వార్నింing

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment