Friday, 27 September 2013

చిరు టీం కు బాబు వెల్ కం


చిరంజీవి టీం కు చంద్రబాబు నాయుడు వెల్ కం చెప్పారు. అయితే ఒక్కరికి మాత్రం ఆయన నో చెప్పారు, ఆయనే సి. రాంచంద్రయ్య. ఆయనొక్కడు మినహా సీమాంద్రకు చెందిన చిరంజీవి గ్యాంగ్ అంతా తెలుగుదేశం లోకి చేరేందుకు రంగం సిద్దమయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవలేమని నిర్ణయించుకున్నారట. అందుకే తాము వదిలి వచ్చిన టిడిపి లోకి వెల్లాలని నిర్ణయించుకున్నారు. సీమాంద్ర కాంగ్రెస్ నాయకులంతా టిడిపి లేదా వైఎస్సార్ సిపిలోకి వెల్లేందుకు సిద్దమయ్యారన్న వార్తలు జగన్ కు బెయిల్ వచ్చినప్పుడే డిసైడ్ అయిందన్న వార్తలు వినపడ్డాయి. వారిలో ఎవరైతే జగన్ తో పొసగదు అనుకున్నారో వారంతా టిడిపి లోకి వస్తున్నారన్న మాట. ఇలా టిడిపి లోకి వస్తున్న వారిలో జగన్ కంటే ముందుగా సమైక్య రాగం అందుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారని సమాచారం. గంటా తో పాటు ముమ్మడివరం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న వంగాగీత, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు, ఆర్.సి.పురం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్న తోట త్రిమూర్తులు తో పాటు ఎంఎల్సీ సి.రాంచంద్రయ్యలు టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారన్న మాట. దీంతో జగన్ బెయిల్ కాంగ్రెస్ లో పెట్టిన అగ్గి రగులుకుంటోంది అన్నది స్పష్టం అయిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

No comments:

Post a Comment