Friday, 27 September 2013

మోహన్ బాబు బాగా బుక్కయ్యాడు!




నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. ఊరు మంచిది కాకపోయినా ఫరవాలేదంటాడు కానీ, తన నోటిని మాత్రం అదుపు చేసుకోడు మోహన్ బాబు. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అతడి ఘాటు విమర్శలకు పెద్ద పెద్ద వాళ్లు కూడా బలైపోతుంటారు. అయినా కూడా తన దారి తనదే అన్నట్టుగా ఉంటాడు మోహన్ బాబు. అయితే అతడు వందసార్లు అంటే, అతడిని అనే అవకాశం అవతలివాళ్లకు ఒక్కసారి కూడా రాకుండా పోతుందా చెప్పండి! ఇప్పుడు ఆ చాన్స్ దొరికింది అందరికీ.
వందేళ్ల సినిమా వేడుకకు వెళ్లొద్దంటూ టాలీవుడ్లో అందరి బుర్రలూ తినేశాడు డైలాగ్ కింగ్. రాష్ట్రంలో ఏమాత్రం శాంతి లేదు, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, ఇలాంటప్పుడు మనకెందుకు పండుగలు అంటూ పెద్ద లెక్చరే ఇచ్చాడు. వేడుకకు ఎవరూ వెళ్లకుండా బెటర్ అంటూ ఉపదేశాలు వల్లించాడు. కానీ ఎవ్వరూ అతడి మాట వినలేదు. నువ్వు రాకపోతే మానెయ్, మేం వెళ్తాం అంటూ వెళ్లిపోయారు. దాంతో పాపం అవమానంగా ఫీలయినా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయాడు.
అయితే తన కొడుకు విష్ణు హీరోగా నిర్మిస్తోన్న దూసుకెళ్తా సినిమాని వచ్చే నెల పన్నెండో తేదీన విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించాడు మన యాంగ్రీ మ్యాన్. అంతే... అందరూ ఒక్కసారిగా పడీ పడీ నవ్వడం మొదలెట్టారు. రాష్ట్రమంతా కష్టాల్లో ఉంది అన్నాడు కదా, ఇప్పుడు తీరిపోయాయా కష్టాలు, వందేళ్ల వేడుకకు అడ్డొచ్చిన ప్రజల సమస్యలు తన కొడుకు సినిమాకి అడ్డు రావడం లేదా అంటూ సెటైర్లు వేయడం మొదలెట్టారు. అంతేమరి! తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి సలహాలిస్తే లోకువయిపోతారు ఎవరైనా. ఆ విషయం మోహన్ బాబుకి తెలియలేదు. అయినా అంతగా లెక్చరిస్తే వందేళ్ల వేడుకకు అతడి కొడుకు, కూతురు వెళ్లి వచ్చారు. వాళ్లే అలా చేస్తే, ఇక బయటివాళ్లు ఆయనకు గౌరవం ఏం ఇస్తారు!

No comments:

Post a Comment