ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని సంపాందించిన మెగాస్టార్ బిరుదును చిరంజీవి ఓ చిన్న తప్పుతో గంగలో కలుపుకున్నాడు అంటున్నారు. ఆయన కు మెగాస్టార్ బిరుదు రావడానికి కొన్నేళ్లు పడితే కొన్ని రోజుల్లోనే అది చెదిరిపోయి ఆస్థానంలో దగాస్టార్ అనే దరిద్రపు బిరుదును తెచ్చుకున్నాడు అంటున్నారు. తాజాగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం చేస్తున్న ప్రజలు చిరంజీవిని దగాస్టార్ తో పోల్చారు.
మెగాస్టార్ ను ఎంత అభిమానించి భుజాలకెత్తుకుని ఊరేగించామో దగాస్టార్ ను అదే రీతిలో దమ్ముకూడా తీసుకోకుండా పాతరేస్తామని ఆవేశంగా మీడియా ముందు అభిప్రాయం వెల్లడించారు సమైక్యవాదులు. ఇదంతా కాంగ్రెస్ తీస్తున్న దరిద్రపు సినిమా గా అభివర్ణించారు. ఈ సినిమాలో దగాస్టార్ చిరంజీవి హీరో అయితే కేంద్ర హోంమంత్రి షిండే విలన్ పాత్ర పోషిస్తున్నాడని సమైక్యవాదులు అన్నారు.
ఇక ఇతర పాత్రల్లో సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, తదితరులు నటిస్తున్నారని, ఈసినిమాను విడుదల కూడా కాకుండా ఆపే దమ్ము, ధైర్యం మాకుందని వారు స్పష్టం చేసారు. ఇలా రోజురోజుకు జరుగుతున్న పరిణామాల చూస్తుంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి కంప్లీట్ ఖతమైనట్టే కనిపిస్తోందంటున్నారు. సొంత ఇంటికి కూడా రాకుండా మంత్రులను అడ్డగించి చావకొట్టినంత పని చేస్తున్నారంటే పరిస్థితి ఏమేరకు విషమించిందో అర్థం చేసుకోవచ్చు.
Friday, 27 September 2013
దగా స్టార్ గా మారిన మెగాస్టార్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment