Friday, 27 September 2013

బాగోతం బయట పెట్టుకున్న ఏపిఎన్జీఓలు


ఏపిఎన్జీఓలు ఎట్టకేలకు వారి అసలు బాగోతం బయట పెట్టుకున్నారు, వారి సమ్మెపై తెలంగాణ వాదులు చేస్తున్నవి ఆరోపణలు కావు, అవి పచ్చి నిజాలే అని హైకోర్టు సాక్షిగా బహిర్గతం చేసుకున్నారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కారణం హైకోర్టు ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె విషయంలో రాష్ట్రప్రభుత్వం పై సీరియస్ అయ్యింది, వారి సమ్మె విరమణకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని అక్షింతలు వేసింది, అంతే కాదు వారి సమ్మె విరమణకోసం ప్రభుత్వం తరఫున ఏంచేసారో నివేదిక సమర్పించాలని కూడా హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై అంతటి ఆగ్రహంతో ఉన్న హైకోర్టుకు ఏపిఎన్జీఓల న్యాయవాది ఏకంగా ఉద్యోగులు సమ్మెను ప్రభుత్వ విచక్షణకు వదిలేయండి, అదే చూసుకుంటుంది అని నివేదించాడు. అంటే దీని అర్థం ఏమిటి, ప్రభుత్వానికి వదిలేయండి, అది మమ్మల్ని ఏమి అనదు, మాసమ్మె మేం చేసుకుంటాం అని కోర్టుకే పరోక్షంగా చెప్పినట్టు కాదా... అంటున్నారు న్యాయ నిపుణులు. సమ్మె విరమణకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగులతో కనీసం చర్చలు చేపట్టలేదు, పైగా వారి సభకు తెలంగాణావాదులు అడ్డు చెప్పినా సరే హైదరాబాద్ లో అనుమతిచ్చారు. ఇప్పటి వరకు సమ్మె విరమించమని కనీసం హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. అసలు ఉద్యోగులతో ఈ సమ్మె చేయిస్తున్నదే ముఖ్యమంత్రి అని ఎప్పటినుంచో తెలంగాణ వాదులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మెను విరమింప చేయాలని హైకోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడం, ఈ సమ్మె విరమణ కోసం ఏంచేసారో చెప్పండి అంటే కూడా చెప్పకుండా వాయిదాలను ప్రభుత్వ న్యాయవాది కోరుతుండడం, ఇప్పుడు ఏకంగా ఏపిఎన్జీఓల న్యాయవాదే సమ్మె విషయం మీరు పట్టించుకోవద్దు, అది ప్రభుత్వానికే వదిలేయండి అని అంటే ఏమన్నట్టు, ఇది ఇంకా వివరించి చెప్పాలా... అందుకే ఏపిఎన్జీఓలు వారి బాగోతాన్ని వారే బయట పెట్టుకున్నారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు

No comments:

Post a Comment